CTI | 10 లక్షల మంది నిరసనకారులు, 20 వేల వాహనాలు.. నవంబర్ 1 ర్యాలీని వాయిదా వేసుకోండి
CTI | నవంబర్ 1న ఇండీ కూటమి తలపెట్టిన మెగా ర్యాలీని వాయిదా వేసుకోవాలని కోరుతూ ‘ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ’ (Chamber of Trade and Industry) కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి మరోసారి విజ్ఞప్తి చేసింది. దీపావళి తర్వాత తేదీకి వాయిదా వేసుకోవాలని కోరింది.
- రాహుల్‌కు CTI మరోసారి లేఖ
- మార్కెట్లన్నీ రామ్‌లీలా మైదాన్ చుట్టూనే
- పండుగ సీజన్‌లో.. రూ.10,000 కోట్ల నష్టం వాటిల్లే ప్రమాదం
- ర్యాలీని దీపావళి తర్వాతకు వాయిదా వేసుకోండి..
- లేదంటే ప్రత్యామ్నాయ ప్రాంతాలను ఎంచుకోండి
CTI | త్రినేత్ర న్యూస్ : దీపావళి పండుగ (Diwali) షాపింగ్ పీక్ టైమ్‌లో ప్రతిపక్ష ఇండీ కూటమి తలపెట్టిన నిరసన ర్యాలీని వాయిదా వేయాలని కోరుతూ ‘ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ’ (Chamber of Trade and Industry) కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి మరోసారి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు రాహుల్‌తోపాటూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి CTI చైర్మన్ బ్రిజేష్ గోయల్ (CTI chairman Brijesh Goyal) లేఖ రాశారు. నవంబర్ 1న రామ్‌లీలా మైదాన్ వేదికగా లక్షలాది మందితో నిర్వహించ తలపెట్టిన మెగా ర్యాలీని దీపావళి తర్వాత తేదీకి వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
దీపావళి పండుగ సీజన్‌లో ఈ మెగా ర్యాలీ కారణంగా వేల కోట్ల వ్యాపారం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేస్తూ CTI ఇప్పటికే రాహుల్ గాంధీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. అయితే, వ్యాపారుల విజ్ఞప్తిని రాహుల్ తోసిపుచ్చిన నేపథ్యంలో ట్రేడర్లు మరోసారి లేఖ రాశారు. మెగా ర్యాలీ కారణంగా ఈనెలాఖరు నుంచే పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి రోడ్లు మూసివేస్తారని తమ లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. అక్టోబర్ 31 నుంచే బారికేడ్లు ఏర్పాటు చేసి.. రహదారులను మూసివేస్తారా..? నవంబర్ 1న దుకాణాలు తెరిచేందుకు అనుమతి ఉంటుందా..? వినియోగదారులు మార్కెట్లకు చేరుకోగలరా..? అంటూ ప్రశ్నించింది.
దుకాణాలన్నీ రామ్‌లీలా చుట్టూనే..
అంతేకాదు, ఈ ర్యాలీ కోసం 15,000 నుంచి 20,000 బస్సుల్లో సుమారు 10 లక్షల మంది నిరసనకారులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. వీటికి తోడు రాజకీయ నాయకుల ప్రైవేటు వాహనాలు కూడా వస్తాయని తెలిపారు. దీంతో రామ్‌లీలా మైదాన్ చుట్టూ భారీ ట్రాఫిక్ స్తంభించిపోతుందని పేర్కొన్నారు. చాందినీ చౌక్, భగీరథ్ ప్యాలెస్, ఖారీ బావ్లీ, సదర్ బజార్, చావ్‌డీ బజార్, కశ్మీరీ గేట్, నబీ కరీమ్, కరోల్ బాగ్ వంటి అతిపెద్ద హోల్‌సేల్, రిటైల్ మార్కెట్లన్నీ రామ్‌లీలా మైదాన్ చుట్టూనే ఉన్నాయని గుర్తు చేశారు. ఇండీ కూటమి ర్యాలీ కారణంగా ఆ రహదారులన్నీ మూసివేస్తే తమకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
రూ.10,000 కోట్ల నష్టం..
అక్టోబర్ 10న జంతర్ మంతర్ వద్ద కేవలం 3,000 మందితో జరిగిన నిరసనల వల్లే సెంట్రల్ ఢిల్లీ ప్రాంతం పూర్తిగా మూతపడి వ్యాపారులకు రూ.3,000 కోట్ల నష్టం వాటిల్లిందని CTI గుర్తుచేసింది. ఇప్పుడు లక్షలాది మందితో నవంబర్ 1న నిర్వహించే ర్యాలీ వల్ల ఓల్డ్ ఢిల్లీ వ్యాపారమంతా పూర్తిగా స్తంభించిపోయి రూ.10,000 కోట్ల నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని అంచనా వేసింది. తమ ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని ర్యాలీని దీపావళి తర్వాతకు వాయిదా వేసుకోవాలని కోరింది.
ప్రత్యామ్నాయ సూచనలు..
ర్యాలీని వాయిదా వేయడం కుదరకపోతే.. మార్కెట్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా రామ్‌లీలా మైదాన్‌కు ప్రత్యామ్నాయంగా బురారీ గ్రౌండ్స్, జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియం వంటి ఇతర వేదికలను ఎంచుకోవాలని సూచించింది. శాంతియుతంగా నిరసన తెలిపే ప్రజాస్వామ్య హక్కును తాము గౌరవిస్తున్నప్పటికీ, వ్యాపారుల ప్రయోజనాలు, ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని తగిన నిర్ణయం తీసుకోవాలని కోరింది.
అలా చేస్తే.. 30 సెకన్లలో నిరసనలు ఆగిపోతాయ్ : రాహుల్
ఓట్ల చోరీ ఆరోపణలతో ఇండియా కూటమి నవంబర్ 1న ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించనున్న విషయం తెలిసిందే. దీపావళి పండుగకు వారం రోజుల ముందు ఈ ర్యాలీ తమ వ్యాపారాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేశారు. పండగల సమయంలో బంగారం, వెండి, ఎలక్ట్రానిక్స్, దుస్తులు, గృహోపకరణాలు, డ్రైఫ్రూట్స్, స్వీట్లు, ఆటోమొబైల్స్, రియల్ ఎస్టేట్, గిఫ్ట్ ఐటమ్స్ రంగాల్లో ఢిల్లీలో సుమారు రూ.25,000 కోట్ల వ్యాపారం జరుగుతుందని తెలిపారు. పండుగకు వారం ముందు నుంచే మార్కెట్లలో రద్దీ విపరీతంగా పెరుగుతుందని చెప్పారు. అందుకే ర్యాలీ తేదీని మార్చాలని విజ్ఞప్తి చేశారు.
ఇది కూడా చదవండి.. జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించమని మోదీకి చెప్పండి..
అయితే, ట్రేడర్ల విజ్ఞప్తిని రాహుల్ తిరస్కరించారు. ఓటుచోరీ ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని ప్రధాని మోదీకి చెబితే 30 సెకన్లలో నిరసనలు ఆగిపోతాయని రాహుల్ స్పష్టం చేశారు. "ఢిల్లీలోని ప్రతి వ్యాపారికీ నేను చెప్పేది ఒక్కటే.. ప్రభుత్వం మెట్రోను నిలిపివేసింది, రోడ్లను బ్లాక్ చేసింది. రాజధానిని లాక్‌డౌన్ చేసింది. ఓటు చోరీ జరిగితే ఏదీ సురక్షితం కాదు. మీ దుకాణాలు, మీ పొదుపు, మీ పిల్లల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది. ఓటుచోరీ ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించమని మీరు ప్రధానికి చెప్పండి. అప్పుడు 30 సెకన్లలో నిరసనలు ఆగిపోతాయి" అని రాహుల్ వ్యాఖ్యానించారు. నవంబర్ 1నే ర్యాలీ నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ప్రతిపక్ష నేత స్పందనపై రామ్‌లీలా మైదాన్ చుట్టుపక్కల దాదాపు 20 ప్రధాన మార్కెట్ల వ్యాపారులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
Also Read..
‘సత్యం శివం సుందరం’.. రాహుల్ గాంధీ ఆసక్తికర పోస్టు
రిజ్వీ బాటలోనే జయేష్ రంజన్..? వీఆర్ఎస్‌కు దరఖాస్తు..?
స్నేహితుడిని బస్టాండ్‌లో దింపి వెళ్తుండగా ప్రమాదం.. బీటెక్ విద్యార్థి దుర్మరణం
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Rahul Gandhi | ‘సత్యం శివం సుందరం’.. రాహుల్ గాంధీ ఆసక్తికర పోస్టు
అక్టోబర్ 27, 2026

Rahul Gandhi | జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించమని మోదీకి చెప్పండి.. 30 సెకన్లలో నిరసనలు ఆగిపోతాయి.. ఢిల్లీ వ్యాపారులకు రాహుల్
అక్టోబర్ 26, 2026

Rahul Gandhi | అమిత్ షాపై గెలిచిన రాహుల్ గాంధీ.. పరువు నష్టం కేసు కొట్టివేత
అక్టోబర్ 26, 2026
తాజావార్తలు
- ●Australia Visa | ఆస్ట్రేలియా వీసా రూల్స్‌లో మార్పులు.. భారతీయులకు బయోమెట్రిక్స్ తప్పనిసరి..
- ●Rahul Gandhi | ‘సత్యం శివం సుందరం’.. రాహుల్ గాంధీ ఆసక్తికర పోస్టు
- ●BTech student | స్నేహితుడిని బస్టాండ్‌లో దింపి వెళ్తుండగా ప్రమాదం.. బీటెక్ విద్యార్థి దుర్మరణం
- ●Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో అనిశ్చితి.. పసిడిపై ఒత్తిడి పెంచుతున్న డాలర్..
- ●Jayesh Ranjan | రిజ్వీ బాటలోనే జయేష్ రంజన్..? వీఆర్ఎస్‌కు దరఖాస్తు..?
- ●Stock Markets | క్రూడాయిల్ సెగ.. ఐటీ షేర్ల పతనం.. నష్టాల్లో సెన్సెక్స్, నిఫ్టీ..

Australia Visa | ఆస్ట్రేలియా వీసా రూల్స్‌లో మార్పులు.. భారతీయులకు బయోమెట్రిక్స్ తప్పనిసరి..

Rahul Gandhi | ‘సత్యం శివం సుందరం’.. రాహుల్ గాంధీ ఆసక్తికర పోస్టు

BTech student | స్నేహితుడిని బస్టాండ్‌లో దింపి వెళ్తుండగా ప్రమాదం.. బీటెక్ విద్యార్థి దుర్మరణం

Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో అనిశ్చితి.. పసిడిపై ఒత్తిడి పెంచుతున్న డాలర్..



