త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rahul Gandhi | గర్భిణీ జర్నలిస్టును తోసేశారంటూ ఆరోప‌ణ‌లు.. రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు నోటీసులు

Rahul Gandhi | అక్టోబ‌ర్ 12 మార్చ్ సంద‌ర్భంగా గర్భిణీ జర్నలిస్టు (pregnant journalist)ను తోసేశారంటూ వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌పై ప్ర‌తిప‌క్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి సుప్రీంకోర్టు (Supreme Court) నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంపై తమ స్పందన తెలియజేయాలని ఆదేశించింది.

D

National | Published On Oct 27, 2026, 12.48 pm IST

Rahul Gandhi | గర్భిణీ జర్నలిస్టును తోసేశారంటూ ఆరోప‌ణ‌లు.. రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు నోటీసులు
Advertisement

Rahul Gandhi | త్రినేత్ర న్యూస్ : ప్ర‌తిప‌క్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) మ‌రోసారి చిక్కుల్లో ప‌డ్డారు. అక్టోబ‌ర్ 12 మార్చ్ సంద‌ర్భంగా గర్భిణీ జర్నలిస్టును (pregnant journalist) తోసేశారంటూ రాహుల్‌పై ఆరోప‌ణ‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఈ అంశం దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు (Supreme Court)కు చేరింది. బాధితురాలు సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ సూర్య‌కాంత్ (Chief Justice Surya Kant), జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చిల‌తో కూడిన‌ ధ‌ర్మాస‌నం ముందు ఈ పిటిష‌న్ విచార‌ణ‌కు వ‌చ్చింది.

సుప్రీంకోర్టు ప్రాంగణంలోనే త‌న ప‌ట్ల రాహుల్ దురుసుగా ప్ర‌వ‌ర్తించార‌ని మ‌హిళా జ‌ర్న‌లిస్ట్ ఆరోపించారు. త‌న‌ను గేటు వైపు బ‌లంగా తోసేశార‌ని పిటిష‌న్‌లో పేర్కొన్నారు. దీంతో కింద పడటంతో చేతులతో బ్యాలెన్స్ చేసుకోవాల్సి వచ్చిందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఆ స‌మ‌యంలో తాను మూడు నెల‌ల గ‌ర్భిణీ అని తెలిపారు. ఆ త‌ర్వాత ఆసుప‌త్రిలో చికిత్స తీసుకున్న‌ట్లు పేర్కొన్నారు. విచార‌ణ‌ సంద‌ర్భంగా సీనియర్ అడ్వొకేట్ గౌర‌వ్ భాటియా మాట్లాడుతూ.. ఇది తోపులాట కాదని, బ‌హిరంగ దాడి అని వాదించారు. రాహుల్ గాంధీతో పాటు దాడిలో పాల్గొన్న అందరిపై వెంటనే ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు చేయాలని, బాధితురాలికి నష్టపరిహారం చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థించారు. స్పందించిన సీజేఐ ధ‌ర్మాస‌నం ఈ వ్యవహారంపై తమ స్పందన తెలియజేయాలని ఆదేశిస్తూ.. రాహుల్ గాంధీతో పాటు ఇతరులకు నోటీసులు జారీ చేసింది.

అక్టోబర్ 12న ఎలక్షన్ కమిషన్‌కు వ్యతిరేకంగా ఇండీ కూటమి నేతలు సుప్రీంకోర్టుకు ర్యాలీగా వెళ్లిన విష‌యం తెలిసిందే. ఆ సమయంలో ఈ ఘటన జరిగింది. అయితే, రాహుల్‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌ను కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. ఆయ‌న ఎవ‌రినీ తోసేయ‌లేద‌ని పేర్కొంది. రాహుల్‌పై వ‌చ్చిన‌వ‌న్నీ నిరాధారమైన ఆరోపణలేన‌ని స్పష్టం చేసింది.

Also Read..

10 ల‌క్ష‌ల మంది నిర‌స‌న‌కారులు, 20 వేల వాహ‌నాలు.. న‌వంబ‌ర్ 1 ర్యాలీని వాయిదా వేసుకోండి

‘సత్యం శివం సుందరం’.. రాహుల్ గాంధీ ఆస‌క్తిక‌ర పోస్టు

రిజ్వీ బాటలోనే జయేష్ రంజన్..? వీఆర్ఎస్‌కు ద‌ర‌ఖాస్తు..?

Advertisement
Advertisement