Cyclone Arnab | అర్నబ్ బీభత్సం.. సముద్రం అల్లకల్లోలం
Cyclone Arnab | అర్నబ్ తుపాన్ (Cyclone Arnab) తీవ్రత కారణంగా ఉత్తర చెన్నై (Chennai)లోని ఎన్నూర్ ఎక్స్‌ప్రెస్‌వేపై (Ennore Expressway) సముద్రపు నీరు భారీగా వచ్చి చేరింది. సముద్రంలో ఎగసిపడిన భారీ అలలు తీరాన్ని దాటి ఎక్స్‌ప్రెస్‌వే రోడ్డుపైకి దూసుకురావడంతో ప్రయాణికులు, వాహనదారులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.
Cyclone Arnab | త్రినేత్ర న్యూస్ : బంగాళాఖాతంలో ఏర్పడిన అర్నబ్ తుపాను (Cyclone Arnab) తీరం దాటింది. యానాంకు నైరుతి దిశలో నరసాపురానికి సమీపంలో ఇది తీరం దాటినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో అక్కడ బలమైన గాలులు వీస్తున్నాయి. తీరం దాటే ముందు ఈ తుపాను సముద్రంలో అల్లకల్లోలం సృష్టించింది. కాకినాడ సహా కొన్ని చోట్ల సముద్రం కొన్ని మీటర్ల మేర ముందుకు రాగా.. పలు చోట్ల అలలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి.
అర్నబ్ తుపాన్ తీవ్రత కారణంగా ఉత్తర చెన్నై (Chennai)లోని ఎన్నూర్ ఎక్స్‌ప్రెస్‌వేపై (Ennore Expressway) సముద్రపు నీరు భారీగా వచ్చి చేరింది. సముద్రంలో ఎగసిపడిన భారీ అలలు తీరాన్ని దాటి ఎక్స్‌ప్రెస్‌వే రోడ్డుపైకి దూసుకురావడంతో ప్రయాణికులు, వాహనదారులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అలల ధాటికి కొన్ని వాహనాలు ఒక్కసారిగా అదుపుతప్పాయి. కొన్ని బోల్తాపడగా.. మరికొన్ని స్వల్పంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. అప్రమత్తమైన అధికారులు భద్రతా కారణాల దృష్ట్యా ఆ రహదారిని తాత్కాలికంగా మూసివేశారు. ఇందుకు సంబంధించిన షాకింగ్ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇదిలా ఉండగా.. తుపాను ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో తమిళనాడులో అధికారులు అప్రమత్తమయ్యారు. చెన్నై కార్పొరేషన్‌తో పాటు తమిళనాడులోని 4 తీరప్రాంత జిల్లాలను అధికారులు హై అలర్ట్‌లో ఉంచారు. అటు ఒడిశాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి.
Breaking - North Chennai sea enters Ennore Expressway, crashes into commuters and vehicles. https://t.co/rIYa3EqoNu
— Omjasvin M D (@omjasvinMD) October 27, 2026
తీరం దాటిన అర్నబ్..
ఈ తుపాను బీభత్సానికి అటు ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. బలమైన ఈదురు గాలులతో కూడిన వర్షం పడుతోంది. పలు చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. ఈ తుపాను ఇవాళ ఉదయం తీరం దాటింది. దీంతో అతి తీవ్ర తుపాను కాస్తా తీవ్ర తుపానుగా బలహీనపడినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. భారీ వర్షాల నేపథ్యలో ఉభయగోదావరి జిల్లాలతోపాటూ కోనసీమ, అల్లూరి, అనకాపల్లి, విశాఖ జిల్లాలకు రెడ్ అలర్జ్ జారీ చేశారు. పల్నాడు, గుంటూరు, విజయనగరం, శ్రీకాకుళం, మన్యం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో పలు జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలకు అధికారులు సెలవు ప్రకటించారు.
#WATCH | Cyclone Arnab | Visakhapatnam, Andhra Pradesh | Strong winds, high tides witnessed at RK Beach as Cyclone Arnab intensifies.
Centre of the severe cyclonic storm is very close to the coast line and the landfall process will continue during next few hours. https://t.co/VtmrH0bqZN
— ANI (@ANI) October 28, 2026
తెలంగాణలో చలిగాలులు..
ఈ తుపాను ధాటికి తెలంగాణ రాష్ట్రంలో చలిగాలులు వీస్తున్నాయి. ఇవాళ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విద్యా సంస్థలకు అధికారులు సెలవు (Holiday) ప్రకటించారు. భారీ వర్షాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉండటంతో జిల్లాలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు బుధవారం (అక్టోబర్ 28న) సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ అంకిత్ వెల్లడించారు.
VIDEO | Cyclone Arnab: Landfall process continues, with rough seas and strong gusty winds along the Kakinada coastline; visuals from 7:20 am.
(Full video available on PTI Videos - https://t.co/d8jp61yd2p) https://t.co/aYzQix4C8N
— Press Trust of India (@PTI_News) October 28, 2026

Also Read..
జియో ఐపీవో ఇన్వెస్టర్లపై కనకవర్షం.. 21 శాతం లాభం..
బాటిల్‌పై కాలు పెట్టడంతోనే భారీ పేలుడు.. తీవ్రంగా గాయపడిన కార్మికులు.. వీడియో
తీరాన్ని తాకిన అర్నబ్ తుఫాను.. పలు విమానాలు, రైళ్లు రద్దు
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Jio Platforms IPO | జియో ఐపీవో ఇన్వెస్టర్లపై కనకవర్షం.. 21 శాతం లాభం..
- ●Bottle Blast | బాటిల్‌పై కాలు పెట్టడంతోనే భారీ పేలుడు.. తీవ్రంగా గాయపడిన కార్మికులు.. వీడియో
- ●Stock Markets | భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 680 పాయింట్లు పతనం..
- ●Mahesh Goud | ఎన్ని అడ్డంకులు వచ్చినా ఢిల్లీకి వెళ్లి తీరుతాం.. నిరసనను విజయంతం చేస్తాం: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
- ●BEL | బీఈఎల్‌లో 350 ప్రొబేషనరీ ఇంజినీర్లు.. నేటి నుంచి దరఖాస్తులు షురూ..
- ●Cyclone Arnab | తీరాన్ని తాకిన అర్నబ్ తుఫాను.. పలు విమానాలు, రైళ్లు రద్దు

Jio Platforms IPO | జియో ఐపీవో ఇన్వెస్టర్లపై కనకవర్షం.. 21 శాతం లాభం..

Bottle Blast | బాటిల్‌పై కాలు పెట్టడంతోనే భారీ పేలుడు.. తీవ్రంగా గాయపడిన కార్మికులు.. వీడియో

Stock Markets | భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 680 పాయింట్లు పతనం..

Mahesh Goud | ఎన్ని అడ్డంకులు వచ్చినా ఢిల్లీకి వెళ్లి తీరుతాం.. నిరసనను విజయంతం చేస్తాం: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్






