త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PM Modi | దేశ యువ‌త సామ‌ర్థ్యం గురించి ఆ యువ‌రాజుకు ఏమీ తెలియ‌దు.. రాహుల్‌పై ప్ర‌ధాని మోదీ ఫైర్‌

PM Modi | కాంగ్రెస్ అగ్ర‌నేత‌, లోక్‌స‌భ‌లో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)పై ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ (PM Modi) తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. కాంగ్రెస్ యువ‌రాజుకి (Congress prince) (రాహుల్‌ని ఉద్దేశిస్తూ) దేశంలోని యువ‌త ఆకాంక్ష‌లు అర్థం కావ‌ని విమ‌ర్శించారు.

D

National | Published On Mar 11, 2026, 5.04 pm IST

PM Modi | దేశ యువ‌త సామ‌ర్థ్యం గురించి ఆ యువ‌రాజుకు ఏమీ తెలియ‌దు.. రాహుల్‌పై ప్ర‌ధాని మోదీ ఫైర్‌
Advertisement

PM Modi | కాంగ్రెస్ అగ్ర‌నేత‌, లోక్‌స‌భ‌లో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)పై ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ (PM Modi) తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. కాంగ్రెస్ యువ‌రాజుకి (Congress prince) (రాహుల్‌ని ఉద్దేశిస్తూ) దేశంలోని యువ‌త ఆకాంక్ష‌లు అర్థం కావ‌ని విమ‌ర్శించారు. కేర‌ళ‌లో అనేక కంపెనీలు డ్రోన్ త‌యారీలో నిమ‌గ్న‌మై ఉన్నాయ‌న్నారు. కానీ ఆయ‌న‌కు ఇవేవీ ప‌ట్ట‌వ‌ని ఎద్దేవా చేశారు.

"భారత యువత డ్రోన్ రంగంలో అద్భుతమైన కృషి చేస్తున్నారు. ఈ విషయం కాంగ్రెస్ యువరాజుకు తెలియదు. కేరళ యువత స్వయంగా డ్రోన్‌లను తయారు చేస్తున్నారనే కనీస అవగాహన కూడా ఆయనకు లేదు. త‌న లోకంలో బందీ అయిపోయిన ఈ వ్య‌క్తి కేర‌ళ యువ‌త అస‌లైన సామ‌ర్థ్యాన్ని ఎప్ప‌టికీ గుర్తించ‌లేడు" అని ప్ర‌ధాని వ్యాఖ్యానించారు.

ప‌శ్చిమాసియా ఉద్రిక్త‌త‌ల‌పై కాంగ్రెస్ రాజ‌కీయం చేస్తోంది

కేర‌ళ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన ప్ర‌ధాని సుమారు రూ. 10,000 కోట్లకు పైగా విలువైన పలు కీలక అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అనంత‌రం కొచ్చి (Kochi)లో జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో పాల్గొని ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భంగా కాంగ్రెస్ పార్టీపై విరుచుకుప‌డ్డారు. ప‌శ్చిమాసియా ఉద్రిక్త‌త‌ల‌పై కాంగ్రెస్ రాజ‌కీయం చేస్తోంద‌ని ప్ర‌ధాని మండిప‌డ్డారు. విదేశాల్లో ఉన్న భారతీయుల పరిస్థితిని మ‌రింత దిగ‌జార్చేలా రెచ్చ‌గొట్టే, బాధ్య‌తారాహిత్య‌మైన ప్ర‌క‌ట‌న‌లు చేస్తోంద‌ని ఫైర్ అయ్యారు. ఈ సంద‌ర్భంగా గ‌ల్ఫ్ దేశాల్లో చిక్కుకుపోయిన భార‌తీయుకుల ప్ర‌భుత్వం సాధ్య‌మైన అన్ని స‌హాయ స‌హ‌కారాల‌ను అందిస్తుంద‌ని ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని హామీ ఇచ్చారు. ఆయా దేశాల్లోని భార‌త రాయ‌బార కార్యాల‌యాలు మ‌న పౌరుల‌కు నిరంత‌రం స‌హాయం చేస్తున్నాయ‌ని ప్ర‌ధాని తెలిపారు. ఆయా ప్రాంతాల్లోని మిత్రదేశాల ప్రభుత్వాలు కూడా భారతీయుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ సంక్షోభ స‌మ‌యంలో కాంగ్రెస్ రాజ‌కీయ ల‌బ్ధి కోసం ప్ర‌య‌త్నించ‌డం దురదృష్ట‌క‌ర‌మ‌న్నారు.

Also Read..

ఇరాన్‌తో యుద్ధం వేళ ట్రంప్ కీల‌క ప్ర‌క‌ట‌న‌.. రిల‌య‌న్స్ భాగ‌స్వామ్యంతో టెక్సాస్‌లో భారీ ఆయిల్ రిఫైన‌రీ

దుబాయ్ ఎయిర్‌పోర్టుపై ఇరాన్ డ్రోన్ దాడి.. భార‌తీయుడు స‌హా న‌లుగురికి గాయాలు

యుద్ధం ఆప‌క‌పోతే ఆరోగ్య సంక్షోభం త‌లెత్తే ప్ర‌మాదం.. WHO హెచ్చ‌రిక‌..

Advertisement
Advertisement