త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Oil Refinery | ఇరాన్‌తో యుద్ధం వేళ ట్రంప్ కీల‌క ప్ర‌క‌ట‌న‌.. రిల‌య‌న్స్ భాగ‌స్వామ్యంతో టెక్సాస్‌లో భారీ ఆయిల్ రిఫైన‌రీ

Oil Refinery | ఇరాన్‌తో యుద్ధం వేళ అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. భారత దిగ్గజ సంస్థ ‘రిలయన్స్ ఇండస్ట్రీస్’ (Reliance Industries Limited of India) భాగ‌స్వామ్యంతో టెక్సాస్ (Texas)లోని బ్రౌన్స్‌విల్లే (Brownsville) ప్రాంతంలో భారీ చమురు శుద్ధి కేంద్రం (oil refinery) ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

D

Business | Published On Mar 11, 2026, 4.30 pm IST

Oil Refinery | ఇరాన్‌తో యుద్ధం వేళ ట్రంప్ కీల‌క ప్ర‌క‌ట‌న‌.. రిల‌య‌న్స్ భాగ‌స్వామ్యంతో టెక్సాస్‌లో భారీ ఆయిల్ రిఫైన‌రీ
Advertisement

Oil Refinery | ఇరాన్‌తో యుద్ధం వేళ అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. టెక్సాస్ (Texas)లోని బ్రౌన్స్‌విల్లే (Brownsville) ప్రాంతంలో భారీ చమురు శుద్ధి కేంద్రం (oil refinery) ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. దాదాపు 50 ఏళ్ల తర్వాత అమెరికాలో కొత్త చమురు శుద్ధి కేంద్రాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. భారత దిగ్గజ సంస్థ ‘రిలయన్స్ ఇండస్ట్రీస్’ (Reliance Industries Limited of India) భాగ‌స్వామ్యంతో ఈ రిఫైన‌రీని ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు.

ఈ ప్రాజెక్టు మొత్తం విలువ దాదాపు 300 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 25 లక్షల కోట్లు) అని ట్రంప్ వెల్ల‌డించారు. ఈ మేర‌కు త‌న సొంత సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్‌లో పోస్టు పెట్టారు. ఈ ప్రాజెక్టులో రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ భారీగా పెట్టుబ‌డుటు పెట్ట‌నుంది. ఈ సంద‌ర్భంగా రిఫైన‌రీలో పెట్టుబ‌డులు పెట్టేందుకు ముందుకొచ్చిన రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్‌కి ట్రంప్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ‘అమెరికా ఫస్ట్ రిఫైనింగ్ పేరిట గత 50 ఏళ్లలో తొలిసారిగా సరికొత్త రిఫైనరీని ప్రారంభిస్తున్నందుకు గర్వపడుతున్నాను. ఇది అమెరికా చరిత్రలోనే అతిపెద్ద ఒప్పందం. ఇందులో పెట్టుబ‌డులు పెట్టేందుకు ముందుకొచ్చిన రిల‌య‌న్స్ గ్రూప్ సంస్థ‌కు ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతున్నాను’ అని ట్రంప్‌ పేర్కొన్నారు.

ఈ ప్రాజెక్ట్‌తో అమెరికా ఇంధన ఉత్పత్తి పెరిగే అవకాశం ఉందని, ఎగుమతులు పెంచేందుకు సాయపడుతుందని వెల్లడించారు. ఇది ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన శుద్ధి కర్మాగారం అవుతుందన్నారు. ఈ ప్రాజెక్టుతో అమెరికాలోని వేలాది కార్మికులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, దేశ ఆర్థిక వ్యవస్థకు ఇది ఊతమిస్తుందని ట్రంప్‌ వివరించారు.

Also Read..

దుబాయ్ ఎయిర్‌పోర్టుపై ఇరాన్ డ్రోన్ దాడి.. భార‌తీయుడు స‌హా న‌లుగురికి గాయాలు

యుద్ధం ఆప‌క‌పోతే ఆరోగ్య సంక్షోభం త‌లెత్తే ప్ర‌మాదం.. WHO హెచ్చ‌రిక‌..

19 ఏళ్ల పైల‌ట్ సాహ‌నం.. ర‌ద్దీ రోడ్డుపై విమానం ల్యాండ్ చేసి..

Advertisement
Advertisement