BM Sandip Kumar | దేశ రాజ్యాంగం కాంగ్రెస్ రాజ్యాంగం ఒక్కటే
BM Sandip Kumar | దేశ చరిత్ర కాంగ్రెస్ చరిత్ర ఒక్కటేనని.. దీంతోపాటు దేశ రాజ్యాంగం (Indian Constitution) కాంగ్రెస్ రాజ్యాంగమూ ఒక్కటేనని ఏఐసీసీ ఇంచార్జి బీఎం సందీప్ కుమార్ (Sandip Kumar) వ్యాఖ్యానించారు.
- రేవంత్‌రెడ్డి పాలనలో సామాజిక న్యాయం జరిగింది
- ఇక్కడ జై కాంగ్రెస్ అంటే.. నాగ్‌పూర్ ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో వినిపించాలి
- హైదరాబాద్ సంవిధాన్ రక్షా మార్చ్‌లో ఏఐసీసీ ఇంచార్జి బీఎం సందీప్ కుమార్
BM Sandip Kumar | త్రినేత్ర న్యూస్: దేశ చరిత్ర కాంగ్రెస్ చరిత్ర ఒక్కటేనని.. దీంతోపాటు దేశ రాజ్యాంగం (Indian Constitution) కాంగ్రెస్ రాజ్యాంగమూ ఒక్కటేనని ఏఐసీసీ ఇంచార్జి బీఎం సందీప్ కుమార్ (Sandip Kumar) వ్యాఖ్యానించారు. స్వాతంత్య్ర పోరాటంలో ఒక్క ఆర్ఎస్ఎస్ కార్యకర్తది కూడా ఇసుమంత భాగస్వామ్యం లేదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన తెలంగాణలో సామాజిక న్యాయం జరిగిందన్నారు. హైదరాబాద్ (Hyderabad)లో గురువారం నిర్వహించిన సంవిధాన్ రక్షా మార్చ్ (Constitution Protection March) లో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఇక్కడ జై కాంగ్రెస్ అంటే నాగ్‌పూర్ ఆర్ఎస్ కార్యాలయంలో వినిపించాలని పిలుపునిచ్చారు.
సత్యం, అహింసా మార్గంలో దేశం సిద్ధించింది. విశ్వంలోనే భారత చరిత్ర గొప్పది. భారతదేశంలో రాజ్యాంగం సమాన హక్కులు కల్పించింది. అంబేద్కర్ లిఖిత పూర్వక రాజ్యాంగం అందించారు. పేద, ధనిక అనే తేడా రాజ్యాంగంలో ఉండదు. భారతదేశ రాజ్యాంగాన్ని ప్రపంచ దేశాలు కొనియాడుతున్నాయి. మన రాజ్యాంగాన్ని ఆదర్శంగా తీసుకుంటున్నాయి.
రాజ్యాంగం ఇబ్బందుల్లో ఉంది
దేశంలో రాజ్యాంగం ప్రేమ, సమానత్వంతో కూడుకుంది. 13 ఏండ్ల నుంచి దేశంలో రాజ్యాంగం ఇబ్బందుల్లో పడింది. ఆర్ఎస్ఎస్ ఎక్కడ దేశ స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనలేదు. లాల్ బహుదూర్ శాస్త్రి జై జవాన్.. జై కిసాన్ అంటే.. ప్రధాని మోదీ రైతులను చంపేస్తున్నారు. ఇందిరా గాంధీ గరీబీ హఠావో అంటే మోదీ పేదలను బతకనివ్వకుండా చేస్తున్నారు. దేశ స్వతంత్రాన్ని కాపాడటానికి కాంగ్రెస్ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది. కాంగ్రెస్ పోరాటం హింస, అహింసా మధ్య పోరాటం. సత్యం, అసత్యం మధ్య పోరాటం. ఆర్ఎస్ఎస్, బీజేపీలు రాజ్యాంగాన్ని పట్టించుకోవు అని సందీప్ కుమార్ ఆరోపించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Errolla Srinivas | రేవంత్ పాలనలో అడుగడుగునా కుల వివక్ష : ఎర్రోళ్ల శ్రీనివాస్
- ●Apple Store | హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. త్వరలో యాపిల్ ఫస్ట్ రిటైల్ స్టోర్.. ఎక్కడంటే..?
- ●Amala Paul | పెళ్లి తర్వాత సినిమాల్లోకి అమలాపాల్ - తల్లి పాత్రలో మలయాళ బ్యూటీ
- ●Uterus | బాలుడి కడుపులో గర్భాశయం.. పరిగిలో వెలుగు చూసిన ఘటన
- ●WhatsApp | వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. 14 రోజుల ముందే మెసేజ్ షెడ్యూల్..
- ●FMCG Stocks | ఎఫ్ఎంసీజీ షేర్లలో భారీ ర్యాలీ.. 17 ఏళ్ల రికార్డు.. ఇప్పుడు కొనవచ్చా..?

Errolla Srinivas | రేవంత్ పాలనలో అడుగడుగునా కుల వివక్ష : ఎర్రోళ్ల శ్రీనివాస్

Apple Store | హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. త్వరలో యాపిల్ ఫస్ట్ రిటైల్ స్టోర్.. ఎక్కడంటే..?

Amala Paul | పెళ్లి తర్వాత సినిమాల్లోకి అమలాపాల్ - తల్లి పాత్రలో మలయాళ బ్యూటీ

Uterus | బాలుడి కడుపులో గర్భాశయం.. పరిగిలో వెలుగు చూసిన ఘటన





