త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Arjun | దేశభక్తి కథతో అర్జున్ సినిమా – అయోధ్యలో లాంఛ్ – స్టోరీ రైట‌ర్‌గా ఆర్మీ మేజ‌ర్

కొంత గ్యాప్ త‌ర్వాత దేశ‌భ‌క్తి క‌థ‌తో సీనియ‌ర్ హీరో అర్జున్ ఓ సినిమా చేయ‌బోతున్నారు.ఈ పాన్ ఇండియ‌న్ సినిమాకు ఆయ‌నే స్వ‌యంగా ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోతున్నారు. న‌వంబ‌ర్ 27న అయోధ్యలో ఈ సినిమా పూజా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించ‌బోతున్నారు.

N

Entertainment | Published On Nov 26, 2026, 4.39 pm IST

Arjun | దేశభక్తి కథతో అర్జున్ సినిమా – అయోధ్యలో లాంఛ్ – స్టోరీ రైట‌ర్‌గా ఆర్మీ మేజ‌ర్
Advertisement

Arjun | అర్జున్ హీరోగా దేశ‌భ‌క్తి క‌థ‌ల‌తో రూపొందిన జై హింద్‌, ఎర్ర‌కోట సినిమాలు సూప‌ర్ హిట్స్‌గా నిలిచాయి. కొంత గ్యాప్ త‌ర్వాత మ‌ళ్లీ త‌న‌కు అచ్చొచ్చిన జాన‌ర్‌లో ఈ సీనియ‌ర్ హీరో మ‌రో సినిమా చేయ‌బోతున్నారు. భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతోన్న ఈ పాన్ ఇండియ‌న్ మూవీకి అర్జున్ స్వ‌యంగా ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోతున్నారు.

అయోధ్యలో...

న‌వంబ‌ర్ 27న శ్రీరామ జ‌న్మ‌భూమి అయిన అయోధ్య ఆల‌యంలో అర్జున్ కొత్త మూవీ లాంఛ్ కాబోతుంది. ఓపెనింగ్ ఈవెంట్ రోజే  టైటిల్‌తో పాటు న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను అనౌన్స్‌చేయ‌బోతున్నారు. భార‌త‌దేశ గొప్ప‌త‌నాన్ని చాటిచెప్పే క‌థ‌, క‌థ‌నాల‌తో దేశ‌భ‌క్తి ప్ర‌ధానంగా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాకు రిటైర్డ్ ఆర్మీ మేజర్ విజయ్ భార్గవన్ క‌థ‌, స్క్రీన్‌ప్లేను అందించ‌బోతున్నారు.

తొలి ద‌క్షిణాది సినిమా...

అయోధ్య‌ ఆలయంలో పూజా కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకోనున్న తొలి ద‌క్షిణాది సినిమా ఇదేన‌ని మేక‌ర్స్ వెల్ల‌డించారు. అర్జున్ కెరీర్‌లో మ‌రో విభిన్న‌మైన సినిమాగా నిలుస్తుంద‌ని అన్నారు. బాలీవుడ్‌తో పాటు ద‌క్షిణాదికి చెందిన ప్ర‌ముఖ న‌టీన‌టులు ఈ సినిమాలో కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్న‌ట్లు  తెలిపారు . ప్రెసిడెన్షియల్ మూవీస్ ఇంటర్నేషనల్ బ్యాన‌ర్‌పై అనూప్ మోహ‌న్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

 

Advertisement
Advertisement