Revanth Reddy | ఇప్పుడు పాలకులే ఓటర్లను నిర్ణయిస్తున్నరు
Revanth Reddy | ఇప్పటివరకు ఎవరు పాలకులుగా ఉండాలో రాజ్యాంగం (Constitution) నిర్ణయించిందని.. దురదృష్టవశాత్తు ఇప్పుడు పాలకులే ఓటర్లను నిర్ణయిస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ఆరోపించారు.
- 13 కోట్ల ఓట్లు తొలగించి, ఇంకో 7 కోట్లు తీసేసే ప్రయత్నం చేస్తున్నరు
- గాడ్సే వారసత్వంతో మోదీ ముఠా పని చేస్తోంది.. ఆ కౌరవ సైన్యాన్ని ఓడిద్దాం
- రాజ్యాంగంపై జరిగే దాడిని తిప్పి కొడదాం
- వచ్చే ఎన్నికల్లో 90 ఎమ్మెల్యే, 15 ఎంపీ సీట్లు గెలిపించాలి
- సంవిధాన రక్షా మార్చ్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు
Revanth Reddy | త్రినేత్ర న్యూస్: ఇప్పటివరకు ఎవరు పాలకులుగా ఉండాలో రాజ్యాంగం (Constitution) నిర్ణయించిందని.. దురదృష్టవశాత్తు ఇప్పుడు పాలకులే ఓటర్లను నిర్ణయిస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ఆరోపించారు. ఇప్పటికే దళితులు, గిరిజనులు, మహిళలు, మైనారిటీలకు చెందిన 13 కోట్ల ఓట్లు తొలగించారన్నారు. మరో 7 కోట్ల ఓట్ల తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. గాడ్సే వారసత్వంతో మోదీ ముఠా పనిచేస్తోంది.. గాంధీ పక్షాన నిలిచి మోదీ కౌరవ సైన్యాన్ని ఓడించాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో 90 ఎమ్మెల్యే, 15 ఎంపీ సీట్లు గెలిపించాలని కోరారు. గురువారం హైదరాబాద్ (Hyderabad)లో నిర్వహించిన సంవిధాన్ రక్షా మార్చ్ (Constitution Protection March) లో రేవంత్ పాల్గొని అనంతరం నిర్వహించిన సభలో మాట్లాడారు.
యుద్ధాలు, హింస లేకుండా అహింసా మార్గంలో స్వాతంత్య్రం సాధించిన పార్టీ కాంగ్రెస్. అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని గాంధీ, నెహ్రూ, పటేల్, అంబేడ్కర్ లు అందించిన రాజ్యాంగం ఇది. కొందరు అధికారం శాశ్వతం చేసుకోవాలని రాజ్యాంగంపై దాడి చేస్తున్నారు. రాజ్యాంగంపై దాడిని మనం తిప్పికొట్టాలి. దేశానికి స్వాతంత్య్రం సాధించాలని, సమాన అవకాశాలను అందించాలని 1885లో కాంగ్రెస్ ఏర్పడింది. ఎందరో తమ ప్రాణ త్యాగాలతో స్వాతంత్య్రాన్ని, రాజ్యాంగాన్ని మనకు అందించారు.
దేవుని ఆశీర్వాదంతో ఈ వేదికపై ఉన్నా
గతంలో రాజులు చనిపోతే వాళ్ల కొడుకులు, తమ్ముళ్లు అధికారం పొందేవారు. కానీ పాలన ప్రజల చేతుల్లో పెట్టాలంటే రాజ్యాంగం అవసరమని నెహ్రూ, అంబేడ్కర్ ఆలోచించి రాజ్యాంగాన్ని అందించారు. గిరిజనులు, దళితులు, మహిళలు, మైనారిటీలకు ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించారు. మేమంతా ప్రజలకు సేవకులం.. ప్రజలు నాకు ఇచ్చిన అవకాశం, దేవుని ఆశీర్వాదంతో ఈ వేదికపై ఉన్నా. రాజ్యంగం అవకాశం కలిపించిన గొప్ప అవకాశం ప్రజాస్వామ్యం.
అమెరికాకు 360 ఏళ్ల క్రితమే స్వాతంత్య్రం వచ్చినా వందల ఏళ్ల వరకు మహిళలకు ఓటు హక్కు అవకాశం కల్పించలేదు. బీజేపీ (BJP) నాయకులు నాడు కూడా పేదలు, మహిళలకు ఓటు హక్కు వద్దని వాదించారు. అంబేడ్కర్ మాత్రం అందరికీ ఓటు హక్కు కల్పించారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని, నల్ల డబ్బు తెస్తానని మోసపూరిత హామీలతో మోదీ (Modi) 2014లో అధికారంలోకి వచ్చారు. కులమత బేధాలు, తప్పుడు హామీలతో రెండోసారి, మూడోసారి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు ఓట్ల తొలగింపు ద్వారా నాలుగోసారి అధికారంలోకి రావాలని మోదీ, అమిత్ షా, అదానీ, అంబానీ దుష్ట చతుష్టయం కుట్ర పన్నుతున్నారు.
బీజేపీ రేపు ఉంటుందో లేదో తెల్వదు
ఈ దేశం కోసం గాంధీ, ఇందిరా గాంధీ, రాజీవ గాంధీ ప్రాణత్యాగాలు చేశారు. దేశ రక్షణ కోసం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, ఖర్గే, కేసీ వేణుగోపాల్ గాంధీ వాదంతో పోరాడుతుంటే, గాడ్సే వారసత్వంతో మోదీ ముఠా పనిచేస్తోంది. మనం గాంధీ కుటుంబం పక్షాన నిలవాలి. స్వాతంత్య్రం కోసం పుట్టిన పార్టీ కాంగ్రెస్, అధికారం కోసం పుట్టిన పార్టీ బీజేపీ. వందేళ్ల క్రితం కాంగ్రెస్ ఉంది, ఇప్పుడు ఉంది, మరో వందేళ్లు ఉంటుంది. బీజేపీ నాడు లేదు.. రేపు ఉంటుందో లేదో తెలియదు అని రేవంత్ విమర్శించారు.
అంతకుముందు ట్యాంక్ బండ్ అంబేడ్కర్ విగ్రహం నుంచి నెక్లెస్ రోడ్డు ఇందిరా గాంధీ విగ్రహం వరకు నిర్వహించిన సంవిధాన రక్షా మార్చ్‌లో సీఎం రేవత్‌తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Stock Markets | 10 నెలల గరిష్ఠానికి సెన్సెక్స్, నిఫ్టీ.. స్టాక్ మార్కెట్లలో భారీ లాభాలు..
- ●Paternity Leave | ప్రభుత్వ ఉద్యోగులకు పితృత్వ సెలవులు.. ప్రభుత్వం కీలక ప్రకటన
- ●Harish Rao | సిద్దిపేటపై కాంగ్రెస్ సర్కార్ వివక్ష : మాజీ మంత్రి హరీశ్‌రావు
- ●Google Gemini | గూగుల్ జెమినిలో అద్భుతమైన ఫీచర్.. డిస్కౌంట్లు, డీల్స్ ఎప్పటికప్పుడు చెబుతుంది..
- ●Errolla Srinivas | రేవంత్ పాలనలో అడుగడుగునా కుల వివక్ష : ఎర్రోళ్ల శ్రీనివాస్
- ●Apple Store | హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. త్వరలో యాపిల్ ఫస్ట్ రిటైల్ స్టోర్.. ఎక్కడంటే..?

Stock Markets | 10 నెలల గరిష్ఠానికి సెన్సెక్స్, నిఫ్టీ.. స్టాక్ మార్కెట్లలో భారీ లాభాలు..

Paternity Leave | ప్రభుత్వ ఉద్యోగులకు పితృత్వ సెలవులు.. ప్రభుత్వం కీలక ప్రకటన

Harish Rao | సిద్దిపేటపై కాంగ్రెస్ సర్కార్ వివక్ష : మాజీ మంత్రి హరీశ్‌రావు

Google Gemini | గూగుల్ జెమినిలో అద్భుతమైన ఫీచర్.. డిస్కౌంట్లు, డీల్స్ ఎప్పటికప్పుడు చెబుతుంది..







