Stock Markets | భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 1.68 శాతం పెరిగిన నిఫ్టీ..
Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాలతో ముగిశాయి. మెరుగైన క్యూ2 ఆర్థిక ఫలితాలు, దేశీయ ఆర్థిక పరిస్థితుల్లో సానుకూల సంకేతాలు, విదేశీ పెట్టుబడిదారుల కొనుగోళ్లు మార్కెట్లకు అండగా నిలిచాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గడం కూడా ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను బలపరిచింది.
Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాలతో ముగిశాయి. మెరుగైన క్యూ2 ఆర్థిక ఫలితాలు, దేశీయ ఆర్థిక పరిస్థితుల్లో సానుకూల సంకేతాలు, విదేశీ పెట్టుబడిదారుల కొనుగోళ్లు మార్కెట్లకు అండగా నిలిచాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గడం కూడా ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను బలపరిచింది. బీఎస్ఈ సెన్సెక్స్ 1,233.25 పాయింట్లు (1.66 శాతం) పెరిగి 75,692.78 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 387.70 పాయింట్లు (1.68 శాతం) లాభపడి 23,440.80 వద్ద ముగిసింది. రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలను మించడం, దేశీయ ఆర్థిక సూచీలు మెరుగుపడడం, విదేశీ పెట్టుబడిదారులు తిరిగి కొనుగోళ్లు చేపట్టడం మార్కెట్ల ర్యాలీకి ప్రధాన కారణాలుగా నిలిచాయి. అక్టోబర్‌లో ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు పెరగడం, జీఎస్టీ వసూళ్లు అధికంగా నమోదవడం దేశీయ వినియోగ డిమాండ్ బలంగా ఉందనే సంకేతాలిచ్చాయి.
భారీగా లాభపడ్డ మెటల్ షేర్లు..
జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ మాట్లాడుతూ, అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గడం, అమెరికా-ఇరాన్ మధ్య దౌత్యపరమైన చర్చలు తిరిగి ప్రారంభం కావడం కూడా మార్కెట్‌లకు సానుకూలంగా మారాయని తెలిపారు. కృత్రిమ మేధ ఆధారిత స్టాక్స్‌లో ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడుల కేటాయింపులు మారుతున్న నేపథ్యంలో విదేశీ ఇన్వెస్టర్లు భారత మార్కెట్లలో కొనుగోళ్లు చేపట్టడం ర్యాలీకి మరింత బలాన్నిచ్చిందని పేర్కొన్నారు. రంగాల వారీగా చూస్తే నిఫ్టీ మెటల్ 2.8 శాతం లాభంతో అగ్రస్థానంలో నిలిచింది. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ 1.19 శాతం, నిఫ్టీ ఆటో 1.05 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.80 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.4 శాతం పెరిగాయి. అయితే నిఫ్టీ ఐటీ 0.8 శాతం, నిఫ్టీ మీడియా 0.7 శాతం, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ 0.40 శాతం, నిఫ్టీ ఫార్మా 0.32 శాతం నష్టపోయాయి.
వ్యక్తిగత షేర్లలో రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, శ్రీరామ్ ఫైనాన్స్ టాప్ గెయినర్లుగా నిలిచాయి. ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, కోటక్ మహీంద్రా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ నష్టాలను నమోదు చేశాయి. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర 4 శాతానికి పైగా తగ్గి బ్యారెల్‌కు 108.54 డాలర్లకు చేరింది. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,38,420 వద్ద కొనసాగగా, వెండి ధర 1.65 శాతం పెరిగి కిలోకు రూ.1,82,094కు చేరింది.
బలహీన పడిన రూపాయి..
కరెన్సీ మార్కెట్లో భారత రూపాయి బలహీనపడింది. సోమవారం డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 21 పైసలు తగ్గి రూ.94.97కు చేరింది. శుక్రవారం ముగింపు విలువ రూ.94.76గా ఉంది. బ్రిక్‌వర్క్ రేటింగ్స్ రీసెర్చ్ హెడ్ రాజీవ్ శరణ్ మాట్లాడుతూ డాలర్ ఇండెక్స్ 101.88 సమీపంలో బలంగా ఉండడం, అమెరికా టెక్నాలజీ షేర్లలో కృత్రిమ మేధ సంబంధిత అమ్మకాల ప్రభావం ఆసియా కరెన్సీలపై ఒత్తిడి పెంచాయని తెలిపారు. ఆర్బీఐ విదేశీ మారక నిల్వలు వరుసగా ఏడో వారం కూడా తగ్గి 719.75 బిలియన్ డాలర్లకు చేరాయని, అయితే ఈ తగ్గుదలలో 2.65 బిలియన్ డాలర్లు బంగారం విలువ తగ్గడం వల్లేనని వివరించారు. వాస్తవ డాలర్ విక్రయాలకు సంబంధించిన విదేశీ కరెన్సీ ఆస్తులు మాత్రం 1.36 బిలియన్ డాలర్లు పెరిగాయని తెలిపారు. చమురు ధరలు తగ్గడం, విదేశీ పెట్టుబడిదారుల కొనుగోళ్లు రూపాయికి కొంత మద్దతునిస్తున్నప్పటికీ, డాలర్ బలం కొనసాగితే ఒత్తిడి తప్పదని పేర్కొన్నారు. ఆసియా మార్కెట్లలో మిశ్రమ ధోరణి కనిపించింది. జపాన్ నిక్కీ 0.12 శాతం, సింగపూర్ స్ట్రెయిట్స్ టైమ్స్ 1.37 శాతం, తైవాన్ సూచీ 0.65 శాతం నష్టపోయాయి. హాంకాంగ్ హ్యాంగ్ సెంగ్ 0.26 శాతం, దక్షిణ కొరియా కోస్పి 2 శాతానికి పైగా లాభపడ్డాయి.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Nora Fatehi | కోర్టు అంటే తమాషా అనుకున్నావా - నోరా ఫతేహికి ఝలక్
- ●Cyclone Murasu | ముంచుకొస్తున్న మురాసు.. అర్ధరాత్రి ఏపీలో తీరం దాటనున్న తుపాను
- ●SEBI | విదేశీ పెట్టుబడిదారులకు భారీ ఊరట.. మూలధన లాభాల పన్ను ఇక ఉండదు..?
- ●Ponguleti Srinivas Reddy | సరిహద్దు పంచాదులుండొద్దిగ.. జాయింట్ సర్వే చేయండి
- ●Supreme Court | గ్రీన్ క్రాకర్స్‌కు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్..
- ●2027 UP Assembly Elections | హ్యాట్రిక్‌పై గురి.. యూపీ ఎన్నికలకు బీజేపీ త్రిముఖ వ్యూహం

Nora Fatehi | కోర్టు అంటే తమాషా అనుకున్నావా - నోరా ఫతేహికి ఝలక్

Cyclone Murasu | ముంచుకొస్తున్న మురాసు.. అర్ధరాత్రి ఏపీలో తీరం దాటనున్న తుపాను

SEBI | విదేశీ పెట్టుబడిదారులకు భారీ ఊరట.. మూలధన లాభాల పన్ను ఇక ఉండదు..?

Ponguleti Srinivas Reddy | సరిహద్దు పంచాదులుండొద్దిగ.. జాయింట్ సర్వే చేయండి





