త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponnam Prabhakar | పట్టభద్రుల ఓట‌ర్ల న‌మోదు గ‌డువు పెంచండి.. ఎన్నిక‌ల సంఘానికి పొన్నం విజ్ఞ‌ప్తి

Ponnam Prabhakar | పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల (Graduate Voters) నమోదు గడువును మరింత పొడిగించాలని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ (Ponnam Prabhakar) విజ్ఞ‌ప్తి చేశారు.

S

Telangana | Published On Nov 2, 2026, 4.15 pm IST

Ponnam Prabhakar | పట్టభద్రుల ఓట‌ర్ల న‌మోదు గ‌డువు పెంచండి.. ఎన్నిక‌ల సంఘానికి పొన్నం విజ్ఞ‌ప్తి
Advertisement

Ponnam Prabhakar | త్రినేత్ర న్యూస్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల (Graduate Voters) నమోదు గడువును మరింత పొడిగించాలని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ (Ponnam Prabhakar) విజ్ఞ‌ప్తి చేశారు. ఈనెల 6తో గ‌డువు ముగుస్తుంద‌ని.. ఇటీవ‌ల ద‌స‌రా, రాబోయే దీపావ‌ళి పండ‌గ‌ల నేప‌థ్యంలో చాలా మంది ప‌ట్ట‌భ‌ద్రులు ఓటు న‌మోదు చేసుకోలేక‌పోయార‌న్నారు. ఈ మేర‌కు ఆయ‌న సోమ‌వారం ఎక్స్ వేదిక‌గా ఎన్నిక‌ల సంఘాన్ని కోరారు.

ప్రజాస్వామ్యంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో నమోదు గడువును పొడిగించాలని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేస్తున్నాను. పట్టభద్రులైన ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, న్యాయవాదులు, వైద్యులు, వివిధ రంగాలకు చెందిన అర్హులైన పట్టభద్రులందరూ వెంటనే తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలి.

కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తమ తమ నియోజకవర్గాల్లో బూత్ స్థాయి నుంచి అర్హులైన పట్టభద్రులను గుర్తించి, ఓటరు నమోదు ప్రక్రియలో వారికి సహకరించాలి. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో ప్రతి పట్టభద్రుడి భాగస్వామ్యం కీలకం. అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును నమోదు చేసుకుని ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములు కావాలి అని పొన్నం కోరారు.

ట్యాగ్స్:

ECExtendGraduate VotersPonnam PrabhakarRegistration DeadlineTelangana
Advertisement
Advertisement