త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Cyclone Murasu | ముంచుకొస్తున్న మురాసు.. అర్ధ‌రాత్రి ఏపీలో తీరం దాట‌నున్న తుపాను

Cyclone Murasu | బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను ‘మురాసు’ తీరం దిశ‌గా దూసుకొస్తోంది. దక్షిణ భారత తీర ప్రాంతాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉండ‌డంతో భారత వాతావరణ శాఖ అప్రమత్తమైంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హెచ్చ‌రించింది. సోమ‌, మంగ‌ళ‌వారాల్లో ప‌లు ప్రాంతాల్లో కుండ‌పోత వ‌ర్షాలు కురిసే అవ‌కాశాలున్నాయంటూ హెచ్చ‌రిక‌లు జారీ చేసింది.

P

National | Published On Nov 2, 2026, 3.55 pm IST

Cyclone Murasu | ముంచుకొస్తున్న మురాసు.. అర్ధ‌రాత్రి ఏపీలో తీరం దాట‌నున్న తుపాను
Advertisement

Cyclone Murasu | బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను ‘మురాసు’ తీరం దిశ‌గా దూసుకొస్తోంది. దక్షిణ భారత తీర ప్రాంతాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉండ‌డంతో భారత వాతావరణ శాఖ అప్రమత్తమైంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హెచ్చ‌రించింది. సోమ‌, మంగ‌ళ‌వారాల్లో ప‌లు ప్రాంతాల్లో కుండ‌పోత వ‌ర్షాలు కురిసే అవ‌కాశాలున్నాయంటూ హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. మురాసు తుపాను సోమ‌వారం అర్ధరాత్రి నుంచి మంగ‌ళ‌వారం తెల్ల‌వారు జామున 3 గంట‌ల మ‌ధ్య దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. నెల్లూరు-నరసాపురం మధ్య, ఒంగోలుకు దక్షిణంగా తీవ్ర తుపానుగా తీరం దాటవచ్చని వెల్లడించింది. రాత్రి 11.30 గంటల నుంచి తెల్లవారుజామున 4 గంటల మధ్య ల్యాండ్‌ఫాల్‌ ఉండొచ్చని చెప్పింది. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 100-110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంద‌ని, అప్పుడప్పుడు గాలి వేగం 120 కిలోమీటర్లకు చేరవచ్చని హెచ్చరించింది. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం, చెట్లు కూలడం, రహదారులపై రాకపోకలకు ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని పేర్కొంది.

మూడు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

తుపాను ప్రభావంతో ఏపీలోని కోస్తాంధ్ర, రాయలసీమతో పాటు యానాంలోనూ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంద‌ని ఐఎండీ తెలిపింది. నవంబర్ 2, 3 తేదీల్లో కోస్తాంధ్ర, యానాం, రాయలసీమలో అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని హెచ్చరించింది. తెలంగాణలో నవంబర్ 3న అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తమిళనాడులో సోమ‌వారం భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవవచ్చని అంచనా వేసింది. మురాసు ప్రభావంతో ఇప్పటికే పలు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. సోమ‌వారం ఉదయం 8.30 గంటలతో ముగిసిన 24 గంటల వ్యవధిలో తమిళనాడు, మధ్య మహారాష్ట్రలో 12-21 సెంటీమీటర్ల మేర భారీ నుంచి అతిభారీ వర్షపాతం నమోదైంది. అసోం, ఒడిశా, కేరళలోనూ 7-11 సెంటీమీటర్ల వర్షం కురిసింది.

అప్ర‌మ‌త్త‌త అవ‌స‌రం..

తీవ్ర గాలులు, భారీ వర్షాలు ఏకకాలంలో విరుచుకుపడే అవకాశం ఉండటంతో తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. లోతట్టు ప్రాంతాల్లో నీటిముంపు, ఆకస్మిక వరదలు సంభవించే ప్రమాదం ఉంద‌ని, నదుల నీటిమట్టాలు, డ్రైనేజీ వ్యవస్థలపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాల్సిన అవసరం ఉన్న‌ది. మురాసు తుపాను తీరం దాటే సమయం సమీపిస్తున్న నేపథ్యంలో దాని దిశ, వేగం, తీవ్రతలో వచ్చే మార్పులు కీలకం కానున్నాయి. తాజా వాతావరణ హెచ్చరికలను గమనిస్తూ తీర ప్రాంత ప్రజలు, యంత్రాంగం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంద‌ని అధికారులు సూచిస్తున్నారు.

ట్యాగ్స్:

Andhra PradeshCyclone MurasuCyclone Murasu LandfallHeavy RainIMD IndiaNarsapurNelloreTamil NaduTelanganaTelugu News
Advertisement
Advertisement