Gold And Silver Prices Today | బంగారం ధరలు ఢమాల్.. ఒక్క రోజులోనే రూ.51వేలకు పైగా తగ్గుదల..
Gold And Silver Prices Today | పశ్చిమ ఆసియాలో పెరిగిన యుద్ధ ఉద్రిక్తతలు, ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో భారీ నష్టాలు, ఫెడ్ మళ్లీ వడ్డీ రేట్లను పెంచే అవకాశాలు తదితర పరిస్థితుల నేపథ్యంలో బులియన్ మార్కెట్లపై తీవ్ర అమ్మకాల ఒత్తిడి నెలకొంది. దీంతో బంగారం ధరలు ఒక్క రోజులోనే భారీగా పతనమయ్యాయి.
Gold And Silver Prices Today | పశ్చిమ ఆసియాలో పెరిగిన యుద్ధ ఉద్రిక్తతలు, ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో భారీ నష్టాలు, ఫెడ్ మళ్లీ వడ్డీ రేట్లను పెంచే అవకాశాలు తదితర పరిస్థితుల నేపథ్యంలో బులియన్ మార్కెట్లపై తీవ్ర అమ్మకాల ఒత్తిడి నెలకొంది. దీంతో బంగారం ధరలు ఒక్క రోజులోనే భారీగా పతనమయ్యాయి. అంతర్జాతీయ బులియన్ మార్కెట్లలో ఔన్స్ బంగారం ధర ఒక్క రోజే ఏకంగా 2.85 శాతం పతనమై 3,521 డాలర్లకు దిగిరాగా, వెండి ధర 3.52 శాతం పతనమై 41 డాలర్లకు చేరింది. దేశీయ కమోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 5,732 పాయింట్లు పడిపోయి 1,21,700కు చేరగా, సిల్వర్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 9,165 పాయింట్లకు పైగా పడిపోయి 1,48,420 వద్ద ఉంది. ఇక దేశీయ స్పాట్ మార్కెట్‌లోనూ బంగారం, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. పసిడి ధర ఒక్క రోజులోనే రూ.51వేలకు పైగా క్షీణించగా, వెండి ధర కూడా భారీగానే తగ్గింది.
స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు..
24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.12,557 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,10,456 గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,25,570 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధర రూ.12,55,700 గా ఉంది. ఇది కిందటి రోజు ముగింపుతో పోలిస్తే రూ.51,200 తగ్గింది.
22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.11,510 ఉండగా, 8 గ్రాముల ధర రూ.92,080గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,15,100 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.11,51,000గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.47,000 తగ్గింది.
18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.9,418 ఉండగా, 8 గ్రాముల ధర రూ.75,344గా ఉంది. 10 గ్రాముల ధర రూ.94,180 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.9,41,800గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.38,400 తగ్గింది.
దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధర రూ.1,75,000 ఉండగా, తులం ధర రూ.1,750గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి ధర కిలోకు రూ.5వేలు తగ్గింది. అలాగే హైదరాబాద్‌లో 1 కిలో వెండి ధర రూ.1,75,000 ఉండగా, తులం ధర రూ.1,750 గా ఉంది.
తాజావార్తలు
- ●WhatsApp | గుడ్‌న్యూస్ చెప్పిన వాట్సాప్.. గ్రూప్ సభ్యుల పరిమితి పెంపు..
- ●E-Waste | టెక్నాలజీ పెరిగే.. ఈ-వ్యర్థాలు పేరుకుపోయే!
- ●MK Stalin | స్టాలిన్ రీ ఎంట్రీ ఇస్తారా..? బాబు మృతితో అందరి చూపు కొలత్తూరు ఉప ఎన్నికపైనే
- ●Traffic Restrictions | రాణిగంజ్ ఆర్యూబీ విస్తరణ.. ఆ మార్గంలో 6 నెలలు ట్రాఫిక్ ఆంక్షలు
- ●Gold Prices | దీపావళికి బంగారం కొన్నారా? ఇప్పుడు దాని విలువ ఎంతంటే?
- ●Congress | పార్టీ వ్యవహారాల ఇన్చార్జిని కలవండి.. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశం

WhatsApp | గుడ్‌న్యూస్ చెప్పిన వాట్సాప్.. గ్రూప్ సభ్యుల పరిమితి పెంపు..

E-Waste | టెక్నాలజీ పెరిగే.. ఈ-వ్యర్థాలు పేరుకుపోయే!

MK Stalin | స్టాలిన్ రీ ఎంట్రీ ఇస్తారా..? బాబు మృతితో అందరి చూపు కొలత్తూరు ఉప ఎన్నికపైనే

Traffic Restrictions | రాణిగంజ్ ఆర్యూబీ విస్తరణ.. ఆ మార్గంలో 6 నెలలు ట్రాఫిక్ ఆంక్షలు





