KA Paul | రేవంత్ పాలనలో పెరిగిన అవినీతి.. లక్షల కోట్ల ప్రజాధనం దోపిడీ: కేఏ పాల్
KA Paul | రేవంత్ రెడ్డి (Revanth Reddy) పాలనలో తెలంగాణలో అవినీతి పెరిగిపోయిందని, లక్షల కోట్ల ప్రజాధనం దోపిడీ జరుగుతున్నదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) విమర్శించారు. ప్రభుత్వం ప్రజాధనాన్ని విచ్చలవిడిగా దుర్వినియోగం చేస్తున్నదని ఆరోపించారు.
KA Paul | త్రినేత్ర న్యూస్: రేవంత్ రెడ్డి (Revanth Reddy) పాలనలో తెలంగాణలో అవినీతి పెరిగిపోయిందని, లక్షల కోట్ల ప్రజాధనం దోపిడీ జరుగుతున్నదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) విమర్శించారు. ప్రభుత్వం ప్రజాధనాన్ని విచ్చలవిడిగా దుర్వినియోగం చేస్తున్నదని ఆరోపించారు. భారత్ సమ్మిట్ ఖర్చులపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఆయన అవినీతి ఆరోపణలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అవినీతిని (Corruption) అంతం చేయాలని రేవంత్ సర్కార్‌ను హెచ్చరించారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి, ఆయన అన్నదమ్ములు.. ఏడుగురూ కలిసి లక్షల కోట్ల రూపాయల ఆస్తులను దోచుకున్నారని ప్రతిపక్ష పార్టీల నేతలు బహిరంగంగా ఆరోపిస్తున్నారని చెప్పారు. ఇంత పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వస్తున్నా ఇప్పటివరకు దీనిపై ఎలాంటి విచారణ చేపట్టకపోవడం దారుణమని వెల్లడించారు.
ఇటీవల నగరంలోని నోవాటెల్ హోటల్‌లో నిర్వహించిన ‘భారత్ సమ్మిట్’ (Bharat Summit) సదస్సు కోసం ఎన్ని వందల కోట్లు ఖర్చు చేశారో ప్రభుత్వం లెక్కలు చెప్పాలని డిమాండ్ చేశారు. సమ్మిట్ పేరుతో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీతోపాటు (Rahul Gandhi) పలువురు నేతలను పిలిపించి విలాసవంతమైన వేడుకలు నిర్వహించారన్నారు. ఇదంతా ప్రజల కళ్ల ముందే జరిగిందని ఆరోపించారు. అయితే కొన్ని మీడియా సంస్థలు ఈ అంశాన్ని ఎందుకు ప్రస్తావించడం లేదని ప్రశ్నించారు. ఒకవైపు రాష్ట్రంలో ప్రజలకు కనీసం గుక్కెడు తాగునీరు కూడా అందించలేని దుస్థితిలో ఉన్న ప్రభుత్వం, ఇలాంటి సదస్సులకు ప్రజాధనాన్ని వృథా చేయడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. రేవంత్ రెడ్డి సర్కారు ప్రజా సమస్యలను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నదని ధ్వజమెత్తారు.
సంబంధిత వార్తలు

Kishan Reddy | తెలంగాణలో ఇక బీజేపీ ఆట షురూ.. కిషన్రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!
నవంబర్ 20, 2026

Supreme Court | డిఫాల్టర్ రైస్ మిల్లర్లకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. ఎస్ఎల్పీలను కొట్టివేసిన కోర్టు..
నవంబర్ 20, 2026

Kondagattu Anjanna | నిజరూపంలో దర్శనమిచ్చిన కొండగట్టు అంజన్న
నవంబర్ 20, 2026
తాజావార్తలు
- ●Kishan Reddy | తెలంగాణలో ఇక బీజేపీ ఆట షురూ.. కిషన్రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!
- ●Nagarguna Sagar | నాగార్జునసాగర్ బ్యాక్వాటర్లో నిర్మాణాలపై ఇంజినీర్ల బృందం ఆరా
- ●Student Dies | రంగారెడ్డిలో దారుణం..! సెలవు ఇవ్వలేదని విద్యార్థి ఆత్మహత్య..
- ●Supreme Court | డిఫాల్టర్ రైస్ మిల్లర్లకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. ఎస్ఎల్పీలను కొట్టివేసిన కోర్టు..
- ●TG Bhavan | ఆస్ట్రేలియాలో ‘తెలంగాణ భవన్’ నిర్మాణానికి శ్రీకారం
- ●Kayadu Lohar | 12 వేల అడుగుల ఎత్తైన పర్వతంపై టాలీవుడ్ హీరోయిన్ సాహసం

Kishan Reddy | తెలంగాణలో ఇక బీజేపీ ఆట షురూ.. కిషన్రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Nagarguna Sagar | నాగార్జునసాగర్ బ్యాక్వాటర్లో నిర్మాణాలపై ఇంజినీర్ల బృందం ఆరా

Student Dies | రంగారెడ్డిలో దారుణం..! సెలవు ఇవ్వలేదని విద్యార్థి ఆత్మహత్య..

Supreme Court | డిఫాల్టర్ రైస్ మిల్లర్లకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. ఎస్ఎల్పీలను కొట్టివేసిన కోర్టు..



