Rajagopal Reddy | అధికారం ఉందనే అహంకారంతో ఇష్టానుసారంగా వ్యవహరించొద్దు.. సీఎం రేవంత్‌కు రాజగోపాల్ రెడ్డి కౌంటర్
Rajagopal Reddy | ఉన్నత పదవుల్లో ఉన్న ముఖ్య నేతలు హుందాగా మాట్లాడాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి (Revanth Reddy) మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి (Rajagopal Reddy) చురకలు అంటించారు. అధికారం ఉందన్న అహంకారంతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ప్రజలు హర్షించరని చెప్పారు.
Rajagopal Reddy | త్రినేత్ర న్యూస్: ఉన్నత పదవుల్లో ఉన్న ముఖ్య నేతలు హుందాగా మాట్లాడాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి (Revanth Reddy) మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి (Rajagopal Reddy) చురకలు అంటించారు. అధికారం ఉందన్న అహంకారంతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ప్రజలు హర్షించరని చెప్పారు. అదృష్టం కొద్దీ దక్కిన అధికారంతో విచ్చలవిడిగా అవినీతికి పాల్పడే, ప్రజావసరాలను విస్మరించి దుర్మార్గపు పాలన సాగించే పాలకులను తెలంగాణ (Telangana) ప్రజానీకం, చరిత్ర ఎన్నిటికీ క్షమించదనే విషయం మరువొద్దంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేసేలా ధర్మంగా, నిజాయితీగా పాలన సాగించేలా ముఖ్య నేతలకు సద్బుద్ధి, ఆత్మ పరిశీలనా జ్ణానాన్ని ప్రసాదించాలని ఆ అయ్యప్ప స్వామిని వేడుకుంటున్నాని చెప్పారు.
కాగా, ప్రభుత్వంపై బహిరంగంగా విమర్శలు చేస్తున్న కొందరు నేతలను ఉద్దేశించి సీఎం రేవంత్‌రెడ్డి పరోక్షంగా స్పందించారు. గురువారం సిద్దిపేటలో జరిగిన బహిరంగ సభ వేధికగా సొంతపార్టీ ఎమ్మెల్యేలపై (Congress MLAs) ఘాటు వ్యాఖ్యలు చేశారు. కొంతమంది మైకుల ముందు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. కానీ వ్యక్తిగతంగా కలిసినప్పుడు ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రశంసిస్తున్నారు. చెడు విషయాలను ఎవరి చెవిలోనైనా చెప్పాలి.. మంచి విషయాలను మైకులో చెప్పాలి. కానీ కొందరు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. మనవాళ్లలో కొందరికి పిచ్చికుక్కలు కరిచినట్టుంది. ప్రభుత్వాన్ని బహిరంగంగా విమర్శిస్తూ.. వ్యక్తిగతంగా మాత్రం మంచిపనులను మెచ్చుకుంటున్నారు. అలాంటి వారిని కాంగ్రెస్ కార్యకర్తలే ఎర్రగడ్డ దవాఖానకు తీసుకెళ్తారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
దీంతో సీఎం వ్యాఖ్యలకు రాజగోపాల్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కొడంగల్‌తో (Kodangal) పాటు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉందని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని తాను ఎన్నోసార్లు వ్యక్తిగతంగా కలిసి చెప్పానని వెల్లడించారు. అహంకారాన్ని పక్కనపెట్టి నిజాయితీతో పాలన సాగించాలని సీఎంకు హితవు పలికారు. రాష్ట్రంలో అవినీతి (Corruption) లేకుండా పాలన సాగిస్తున్నారా? అని రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. గుండెపై చేయి వేసుకుని సమాధానం చెప్పాలని నిలదీశారు. ముఖ్యమంత్రి తన పాలనపై తానే ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. గత మూడేండ్లుగా రేవంత్‌రెడ్డి ఏం మాట్లాడుతున్నారో తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారన్నారు.
సీఎం స్థానంలో కూర్చుని దొంగలకు, పెట్టుబడిదారులకు దోచిపెట్టకూడదని విమర్శించారు. తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా నియోజకవర్గ అభివృద్ధి కోసమే నిధులు అడుగుతున్నానని స్పష్టం చేశారు. కొడంగల్‌కు నిధులు కేటాయించడంపై తనకు అభ్యంతరం లేదని, అదే సమయంలో రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాల అభివృద్ధిని కూడా ప్రభుత్వం పట్టించుకోవాలని డిమాండ్ చేశారు.
ఉన్నత పదవుల్లో ఉన్న ముఖ్య నేతలు హుందాగా మాట్లాడాలి. అధికారం ఉందన్న అహంకారంతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ప్రజలు హర్షించరని గ్రహించాలి. అదృష్టం కొద్దీ దక్కిన అధికారంతో విచ్చలవిడిగా అవినీతికి పాల్పడే, ప్రజావసరాలను విస్మరించి దుర్మార్గపు పాలన సాగించే పాలకులను తెలంగాణ ప్రజానీకం, చరిత్ర ఎన్నిటికీ క్షమించదని మరువరాదు.
ఇచ్చిన హామీలను అమలు చేసేలా ధర్మంగా, నిజాయితీగా పాలన సాగించేలా ముఖ్య నేతలకు సద్బుద్ధి, ఆత్మ పరిశీలనా జ్ణానాన్ని ప్రసాదించాలని ఆ అయ్యప్ప స్వామిని వేడుకుంటున్నాను.స్వామియే శరణం అయ్యప్ప 🙏
— Komatireddy Raj Gopal Reddy (@rajgopalreddy_K) November 20, 2026
సంబంధిత వార్తలు

Ponnam Prabhakar | సిద్దిపేట సభకు వెళ్లి మహిళ మృతి.. నివాళులర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్
నవంబర్ 20, 2026

Revanth Reddy | రేవంత్ రెడ్డి సభకు వెళ్లి బస్సు కిందపడి మహిళ మృతి
నవంబర్ 20, 2026

KTR Tweet on CM Revanth Reddy | జై తెలంగాణ అనలేని ఉద్యమ ద్రోహివి నువ్వు.. అమరుల గురించి మాట్లాడే అర్హత నీకెక్కడది?
నవంబర్ 19, 2026
తాజావార్తలు
- ●Rahul Gandhi | అంతర్జాతీయ రాజకీయాల్లో భారత్ సైడ్ ప్లేయర్‌గా మిగిలిపోయింది.. రాహుల్ సంచలన వ్యాఖ్యలు
- ●Silver Price Crash 2026 | $121 నుంచి $52కి పడిపోయిన వెండి ధర.. 46 ఏళ్ల నాటి చరిత్ర మళ్లీ రిపీట్! వెండి కొనే ముందు ఇవి తెలుసుకోండి
- ●Gold And Silver Prices Today | బంగారం ధరలు ఢమాల్.. ఒక్క రోజులోనే రూ.51వేలకు పైగా తగ్గుదల..
- ●Bank Loan | రూ.1.8 కోట్ల లోన్ ఇచ్చేందుకు రూ.9 లక్షల లంచం.. బ్యాంకు మేనేజర్ అరెస్ట్
- ●China Gold Buying | బంగారం ధర 34% పడినా ఆగని చైనా వేట.. 8 నెలల్లోనే $159 బిలియన్ల పసిడి కొనుగోలు!
- ●Akasamlo Oka Tara Review | ఆకాశంలో ఒక తార రివ్యూ - దుల్కర్ సల్మాన్ స్ట్రెయిట్ తెలుగు మూవీ ఎలా ఉందంటే?

Rahul Gandhi | అంతర్జాతీయ రాజకీయాల్లో భారత్ సైడ్ ప్లేయర్‌గా మిగిలిపోయింది.. రాహుల్ సంచలన వ్యాఖ్యలు

Silver Price Crash 2026 | $121 నుంచి $52కి పడిపోయిన వెండి ధర.. 46 ఏళ్ల నాటి చరిత్ర మళ్లీ రిపీట్! వెండి కొనే ముందు ఇవి తెలుసుకోండి

Gold And Silver Prices Today | బంగారం ధరలు ఢమాల్.. ఒక్క రోజులోనే రూ.51వేలకు పైగా తగ్గుదల..

Bank Loan | రూ.1.8 కోట్ల లోన్ ఇచ్చేందుకు రూ.9 లక్షల లంచం.. బ్యాంకు మేనేజర్ అరెస్ట్



