Niharika Konidela | నిహారిక కొణిదెల యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ మూవీ – సైలెంట్‌గా షూటింగ్ పూర్తి
కమిటీ కుర్రాళ్లు, రాకా బ్లాక్‌బస్టర్స్ తర్వాత ప్రొడ్యూసర్‌గా తన మూడో సినిమాను అనౌన్స్‌చేసింది మెగా డాటర్ నిహారిక కొణిదెల. పాకెట్ రాకెట్స్ పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో త్రినాథ్ వర్మ, శ్రియా కొంతం, నిర్మల్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. రుద్ర అత్రి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ పూర్తయ్యింది.
Niharika Konidela | కమిటీ కుర్రాళ్లు, రాకా సినిమాలతో ప్రొడ్యూసర్‌గా పెద్ద విజయాలను అందుకుంది మెగా డాటర్ నిహారిక కొణిదెల (Niharika Konidela). కమిటీ కుర్రాళ్లు రెండు నేషనల్ అవార్డులను అందుకొని నిహారికకు మంచి పేరు తీసుకొచ్చింది. తాజాగా నిర్మాతగా మూడో సినిమాను అనౌన్స్ చేసింది మెగా డాటర్. గ్యాబ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు పాకెట్ రాకెట్స్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.
శ్రియా కొంతం...
యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో త్రినాథ్ వర్మ, శ్రియా కొంతం, నిర్మల్ హీరోహీరోయిన్లుగా నటిస్తోన్నారు. జేడీ చక్రవర్తి ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. పాకెట్ రాకెట్స్ సినిమాకు రుద్ర అత్రి దర్శకత్వం వహిస్తున్నారు.
షూటింగ్ పూర్తి...
విదేశాల్లో చదువుకోవాలని ఓ యువకుడు కలలు కంటాడు. కానీ ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోవడంతో డబ్బు కోసం గ్యాబ్లింగ్‌లోకి దిగుతాడు. ఆ తర్వాత ఏమైంది? గ్యాబ్లింగ్ కారణంగా అతడి జీవితం, కలలు ఎలా తలక్రిందులు అయ్యాయి అనే అంశాలకు వినోదం, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ను జోడించి దర్శకుడు రుత్ర ఈ సినిమాను రూపొందించారు. పాకెట్ రాకెట్స్ షూటింగ్ పూర్తి అయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో టీజర్ విడుదల చేయడమే కాకుండా సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామని మేకర్స్ అన్నారు.
బరి...
పింక్ ఎలిఫెంట్ పిక్చర్ బ్యానర్‌పై నిహారిక కొణిదెల నిర్మిస్తున్న మూడో సినిమా ఇది. నిహారికతో పాటు రాహుల్ రాఘవేంద్ర, రాహుల్ నిమ్మకూరి ఈ సినిమాకు ప్రొడ్యూసర్లుగా వ్యవహరిస్తోన్నారు. గ్యానీ డైరెక్టర్. పాకెట్ రాకెట్స్‌తో పాటు సోదరుడు వరుణ్ తేజ్ హీరోగా బరి అనే సినిమాను నిర్మిస్తోంది నిహారిక కొణిదెల.
పాకెట్ రాకెట్స్‌లో హీరోగా నటిస్తోన్న త్రినాథ్ వర్మ...కమిటీ కుర్రాళ్లతోనే టాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. శుభం, నాని గ్యాంగ్‌లీడర్‌తో పాటు మరికొన్ని సినిమాల్లో నటించింది శ్రియా కొంతం.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Harish Rao | “నేను రైతునవుతా.. దేశానికి అన్నం పెడతా” అని చెప్పుకొనే రోజు రావాలి
- ●Jafar Panahi | ప్రభుత్వానికి వ్యతిరేకంగా సినిమాలు - స్టార్ డైరెక్టర్‌కు ఐదేళ్ల జైలు శిక్ష
- ●ISRO | ఇస్రో కీలక ప్రయోగం.. అయినా నవిక్ పునరుద్ధరణకు మరింత సమయం..
- ●Regime Change | ఆ నిరసనల్లో పాల్గొనే వారు ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులు.. యూపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- ●Ponnam Prabhakar | మున్నూరు కాపు భవన నిర్మాణానికి 5 కోట్లు కేటాయించడం సంతోషకరం: పొన్నం ప్రభాకర్
- ●Gold Prices | ఫెడ్ వడ్డీ రేట్ల ఎఫెక్ట్.. బంగారం, వెండిలపై ఇప్పుడు పెట్టుబడులు పెట్టవచ్చా..?

Harish Rao | “నేను రైతునవుతా.. దేశానికి అన్నం పెడతా” అని చెప్పుకొనే రోజు రావాలి

Jafar Panahi | ప్రభుత్వానికి వ్యతిరేకంగా సినిమాలు - స్టార్ డైరెక్టర్‌కు ఐదేళ్ల జైలు శిక్ష

ISRO | ఇస్రో కీలక ప్రయోగం.. అయినా నవిక్ పునరుద్ధరణకు మరింత సమయం..

Regime Change | ఆ నిరసనల్లో పాల్గొనే వారు ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులు.. యూపీ ప్రభుత్వం కీలక నిర్ణయం






