త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jafar Panahi | ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా సినిమాలు – స్టార్ డైరెక్ట‌ర్‌కు ఐదేళ్ల జైలు శిక్ష

దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు జాఫ‌ర్ ప‌నాహికి ఇరాన్ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష‌ను విధించింది. ప్ర‌భుత్వ పాల‌న‌ను విమ‌ర్శిస్తూ సినిమాలు తీస్తున్నాడ‌నే ఆరోప‌ణ‌ల‌తో అత‌డికి జైలు శిక్ష‌ను ఖ‌రారు చేసింది. సోష‌ల్ మీడియా వాడ‌కుండా నిషేధం విధించ‌డ‌మే కాకుండా ఇరాన్ వ‌దిలి వెళ్ల‌ద్దంటూ ఆంక్ష‌లు విధించింది.

N

Entertainment | Published On Oct 29, 2026, 1.44 pm IST

Jafar Panahi | ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా సినిమాలు – స్టార్ డైరెక్ట‌ర్‌కు ఐదేళ్ల జైలు శిక్ష
Advertisement

Jafar Panahi |  ఇరాన్ ప్ర‌భుత్వ పాల‌న‌లోని లోపాలు, అవినీతిని ఎండ‌గ‌డుతూ సినిమాలు తీసినందుకు దిగ్గ‌జ ద‌ర్శ‌కుడికి ఇరాన్ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష‌ను విధించింది. జాఫ‌ర్ ప‌నాహి ఇరానియ‌న్‌లో గొప్ప ద‌ర్శ‌కుల్లో ఒక‌రిగా కొన‌సాగుతోన్నారు. ది వైట్ బెలూన్‌, ది స‌ర్కిల్‌, ఆఫ్‌సైడ్‌, టాక్సీ, నో బేర్స్‌, ఇట్ వాజ్ జ‌స్ట్ ఎన్ యాక్సిడెంట్‌తో పాటు మ‌రికొన్ని సినిమాల‌ను తెర‌కెక్కించారు ప‌న‌హా. కేన్స్‌, బెర్లిన్‌తో పాటు అనేక ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్స్‌లో ఈ సినిమాలు స్క్రీనింగ్ అయ్యాయి. ప‌లు ప్ర‌తిష్టాత్మ‌క అవార్డుల‌ను గెలుచుకున్నాయి. ఇట్ వాజ్ జ‌స్ట్ ఎన్ యాక్సిడెంట్ మూవీ ఆస్కార్‌కు నామినేట్ అయ్యింది.

నిరంకుశ పాల‌న‌...

ఇరాన్ సామాజిక ప‌రిస్థితులు, మ‌హిళ‌ల‌పై వివ‌క్ష లాంటి అంశాల‌కు ప్ర‌భుత్వ అణిచివేత‌, ఆంక్ష‌లు, నిరంకుశ పాల‌న‌ కార‌ణంగా ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న ఇబ్బందుల‌తో సినిమాలు చేస్తుంటారు ప‌నాహి. వాటికి తోడు ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ప్ర‌జ‌లు చేస్తోన్న నిర‌స‌న‌ల‌కు చాలా సార్లు ఆయ‌న మద్ద‌తు తెలిపారు. ప‌లు విదేశీ వేదిక‌ల‌పై ఇరాన్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించారు.

నిషేధం

ప్ర‌భుత్వ వ్య‌తిరేక కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డుతున్నందుకు 2010లో సినిమాలు తీయ‌కుండా జాఫ‌ర్ ప‌నాహిపై ప్ర‌భుత్వం నిషేధం విధించింది. అయినా అయినా ర‌హ‌స్యంగా సినిమాలు తీస్తూ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్స్‌కు పంపుతున్నాడ‌నే ఆరోప‌ణ‌లు రావ‌డంతో అత‌డికి టెహ్రాన్ కోర్టు ఐదు సంవ‌త్స‌రాల ఒక నెల జైలు శిక్ష‌ను విధించింది. రెండేళ్ల పాటు సోష‌ల్ మీడియా వాడ‌కుండా బ్యాన్ చేసిఒంది. అంతే కాకుండా ఇరాన్‌ను వ‌దిలిపెట్టి విదేశాల‌కు వెళ్ల‌కూడ‌ద‌ని ఆంక్ష‌లు విధించింది. . అత‌డి ఆస్తుల‌ను , బ్యాక్ అకౌంట్‌ల‌ను జ‌ప్తు చేసింది.

 

Advertisement
Advertisement