Rain Alert | హైదరాబాద్‌లో సాయంత్రం వర్షాలు.. త్వరగా లాగ్ అవుట్ అవ్వండి..
Rain Alert | సోమవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్ నగరం తడిసి ముద్దైన సంగతి తెలిసిందే. సుమారు గంటకు పైగా కురిసిన వర్షానికి పలుచోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
Rain Alert | త్రినేత్ర.న్యూస్ : సోమవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్ నగరం తడిసి ముద్దైన సంగతి తెలిసిందే. సుమారు గంటకు పైగా కురిసిన వర్షానికి పలుచోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మంగళవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ క్రమంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమయ్యారు.
సైబరాబాద్ పరిధిలో పని చేసే ఐటీ ఉద్యోగులతో పాటు ఇతర ఉద్యోగులు త్వరగా ఇంటికి చేరుకునేలా ప్లాన్ చేసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. మధ్యాహ్నం 3.30 గంటల నుంచే ఉద్యోగులు తమ కంప్యూటర్లను లాగ్ అవుట్ చేసి ఇంటికి వెళ్లేలా ప్లాన్ చేసుకోవాలన్నారు. సాయంత్రం వేళ భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడే అవకాశం ఉన్నందున వీలైనంత త్వరగా ఉద్యోగులు తమ నివాసాలకు చేరుకుంటే ఉత్తమమని పోలీసులు పేర్కొన్నారు.
ఇక ఉద్యోగులు ఇంటికి వెళ్లే సమయంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ఎక్స్ హ్యాండిల్‌ను ఫాలో కావాలని సూచించారు. రోడ్లపై వాహనాలను నెమ్మదిగా డ్రైవ్ చేయాలని సూచించారు.
🚨*SCSC-Situation Report & Advisory*🚨
*Date: 21st July 2026*
*Time: 14:30 hrs*Situation: ⛈️ Forecast of moderate to Intense rains during evening peak hours.
*Advisory:* 🚨Early Logouts in staggered manner starting 3:30 PM - to avoid heavy traffic congestion during peak… pic.twitter.com/17aPpwVDlm
— Cyberabad Traffic Police (@CYBTRAFFIC) July 21, 2026
తాజావార్తలు
- ●Dharmendra Pradhan | ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు బదులు శాఖ మార్పు ప్రతిపాదన చేసిన మోదీ సర్కార్.. కానీ..
- ●Aadhaar | ఆధార్ బయోమెట్రిక్ లాక్ ఆన్, ఆఫ్ ఎలా చేయాలి.. చాలా సులభం..
- ●Parliament Monsoon Session | నీట్ మంటలు.. ఉభయసభలు మళ్లీ వాయిదా.. మధ్యాహ్నం లోక్‌సభలో పేపర్ లీక్ బిల్లుపై చర్చ
- ●PM Modi | ప్రధాని మోదీ సెల్ఫీ వీడియో తొలగింపు.. క్షమాపణలు చెప్పిన మెటా
- ●Gold And Silver Prices Today | ఈక్విటీ మార్కెట్ల ఎఫెక్ట్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..
- ●Amarnath Yatra | అమర్నాథ్ యాత్రికుల బస్సు బోల్తా.. 39 మందికి గాయాలు

Dharmendra Pradhan | ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు బదులు శాఖ మార్పు ప్రతిపాదన చేసిన మోదీ సర్కార్.. కానీ..

Aadhaar | ఆధార్ బయోమెట్రిక్ లాక్ ఆన్, ఆఫ్ ఎలా చేయాలి.. చాలా సులభం..

Parliament Monsoon Session | నీట్ మంటలు.. ఉభయసభలు మళ్లీ వాయిదా.. మధ్యాహ్నం లోక్‌సభలో పేపర్ లీక్ బిల్లుపై చర్చ

PM Modi | ప్రధాని మోదీ సెల్ఫీ వీడియో తొలగింపు.. క్షమాపణలు చెప్పిన మెటా






