త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sreelekha Mitra | ప్ర‌ధాని మోదీపై అభ్యంత‌ర‌క‌ర‌మైన పోస్ట‌ర్‌.. బెంగాలీ న‌టిపై కేసు

Sreelekha Mitra | త్రినేత్ర‌.న్యూస్‌: త్రినేత్ర‌.న్యూస్: ప్ర‌ముఖ బెంగాలి న‌టి శ్రేలేఖ మిత్ర (Sreelekha Mitra) చ‌ట్ట‌ప‌ర‌మైన ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. ప్రధాని మోదీపై (PM Modi) 'అసభ్యకరమైన' పోస్టర్‌ను (distasteful image) ప్రదర్శించినందుకు గాను ఆమెపై వివిధ స్టేష‌న్ల‌లో కేసులు న‌మోద‌య్యాయి.

G

National | Published On Jul 27, 2026, 11.28 am IST

Sreelekha Mitra | ప్ర‌ధాని మోదీపై అభ్యంత‌ర‌క‌ర‌మైన పోస్ట‌ర్‌.. బెంగాలీ న‌టిపై కేసు
Advertisement

Sreelekha Mitra | త్రినేత్ర‌.న్యూస్‌: త్రినేత్ర‌.న్యూస్: ప్ర‌ముఖ బెంగాలి న‌టి శ్రేలేఖ మిత్ర (Sreelekha Mitra) చ‌ట్ట‌ప‌ర‌మైన ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. ప్రధాని మోదీపై (PM Modi) 'అసభ్యకరమైన' పోస్టర్‌ను (distasteful image) ప్రదర్శించినందుకు గాను ఆమెపై వివిధ స్టేష‌న్ల‌లో కేసులు న‌మోద‌య్యాయి. నీట్ ఆందోళ‌న‌ల్లో భాగంగా ఇటీవ‌ల కోల్‌కతాలో (Kolkata) జరిగిన విద్యార్థి నిరసనలో (student protest) ఆమె పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మోదీ చిత్రపటాన్ని అసభ్యకరరీతిలో ప్రదర్శించిన‌ట్లు ఆమెపై రాష్ట్ర వ్యాప్తంగా ప‌లు పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు నమోదయ్యాయి. దీంతో పోలీసులు ఆమెపై బీఎన్ఎస్ (BNS)లోని సెక్షన్లు 352 (శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఉద్దేశంతో ఉసిగొల్పడం), 353 (రెచ్చగొట్టే ప్రవర్తనకు బహిరంగ మద్దతు), 356 (పరువు నష్టం) కింద ఫిర్యాదులు నమోదయ్యాయి.

ప్ర‌ధాని ఫొటోను అలా చూపించ‌డం..

`దేశ ప్రధానిని అవమానించేలా ఒక అసభ్యకరమైన పోస్టర్‌ను ప్రదర్శించినందుకు నటి శ్రీలేఖ మిత్రపై (Bengali actor) ఫిర్యాదు దాఖలైంది, ఎఫ్‌ఐఆర్ కూడా నమోద‌యింద‌ని బీజేపీ నేత కియా ఘోష్ అన్నారు. దేశ ప్ర‌ధాని ఫొటోను అలా చూపించ‌డంపై ఒక పౌరురాలిగా త‌న‌కు ఆగ్ర‌హం క‌లుగుతున్న‌ద‌ని చెప్పారు. శ్రీలేఖ మిత్రను వీలైనంత త్వరగా అరెస్ట్ చేయాల‌ని, చ‌ట్ట‌ప్ర‌కారం ఆమెపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. లేన‌ట్ల‌యితే కోర్టును ఆశ్ర‌యిస్తాన‌ని హెచ్చ‌రించారు.

కచ్చితంగా ఒక ఉద్యమం వస్తుంది: శ్రీలేఖ

ఈ వివాదంపై న‌టి శ్రీలేఖ స్పందిస్తూ.. `నన్ను అరెస్ట్ చేయాలనుకుంటే అరెస్ట్ చేయండి. నన్ను ఉరిశిక్షకు పంపాలనుకుంటే ఉరిశిక్షకు పంపండి. దీనికి వ్యతిరేకంగా కూడా కచ్చితంగా ఒక ఉద్యమం వస్తుందని నేను నమ్ముతున్నాను. తాను బీజేపీ వ్య‌తిరేకిని కావొచ్చు. కానీ త‌న‌ను దేశ‌ద్రోహి అన‌డం హాస్యాస్ప‌దంగా ఉంది` అంటు ఎక్స్ వేదిక‌గా పోస్ట్ చేశారు. అయితే నిర‌స‌న‌కు వెళ్లిన‌ప్పుడు క‌ళ్ల‌జోడు మ‌ర్చిపోయాన‌ని, త‌న వ‌ద్ద స‌న్‌గ్లాసెస్ మాత్ర‌మే ఉన్నాయ‌ని చెప్పారు. జ‌నం ఎక్కువ‌గా ఉండ‌టం, పోలీసుల లాఠీచార్జ్ గంద‌ర‌గోళంలో పోస్ట‌ర్‌పై ఉన్న చిత్రాన్ని స‌రిగ్గా గ‌మ‌నించ‌లేద‌ని వెల్లడించారు.

నీట్ ప్ర‌శ్న‌ప‌త్రం లీకేజీకి వ్య‌తిరేకంగా (NEET paper leak) కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ గ‌త శుక్రవారం కోల్‌కతా రోడ్లపై భారీ నిరసన ప్రదర్శన జరిగింది. ఈ నిరసనలో శ్రీలేఖ మిత్ర కూడా పాల్గొన్నారు. ఆ సమయంలో ఆమె ప్రధాని మోదీకి సంబంధించిన అభ్యంతరకరమైన లేదా అసభ్యకరమైన చిత్రంతో ఉన్న పోస్టర్‌ను పట్టుకున్నట్లు ఫోటోలు వెలువడ్డాయి.

 

Advertisement
Advertisement