Nayara Energy | పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గింపు
Nayara Energy | దేశంలో అతిపెద్ద ప్రైవేట్ ఇంధన రిటైలర్ అయిన నయారా ఎనర్జీ (Nayara Energy) సంస్థ వాహనదారులకు భారీ ఊరట కల్పించింది. పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా తగ్గించింది.
Nayara Energy | దేశంలో అతిపెద్ద ప్రైవేట్ ఇంధన రిటైలర్ అయిన నయారా ఎనర్జీ (Nayara Energy) సంస్థ వాహనదారులకు భారీ ఊరట కల్పించింది. పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా తగ్గించింది. పెట్రోల్ ధరను లీటరుకు రూ. 5, డీజిల్ ధరను లీటరుకు రూ. 3 చొప్పున తగ్గించింది. దేశవ్యాప్తంగా ఉన్న 7,000కు పైగా నయారా రిటైల్ ఔట్‌లెట్ల (Nayara Retail Oulets)లో తగ్గిన ధరలు నేటి నుంచే అమల్లోకి వచ్చాయి.
ధరల సవరణ తర్వాత బెంగళూరులో పెట్రోల్ ధర రూ.111.20గా, డీజిల్ ధర రూ.98.80గా ఉంది. ఫరీదాబాద్‌లో పెట్రోల్ ధర రూ. 103 గా ఉండగా, డీజిల్ ధర రూ. 98.84గా, మహారాష్ట్రలోని నయారా బంకుల్లో పెట్రోల్ లీటరు రూ. 111.66 కు, డీజిల్ రూ. 97.99కు విక్రయిస్తున్నారు. ఈ ధరల పెంపు రాష్ట్రాల వారీగా మారుతూ ఉంటుంది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు విధించే వ్యాట్‌ను బట్టి పెరుగుదల ప్రభావం మారుతుంది.
కాగా, పశ్చిమాసియా సంక్షోభం సమయంలో నయారా ఎనర్జీ ఈ ఏడాది మార్చిలో పెట్రోల్, డీజిల్ ధరలను పెంచిన విషయం తెలిసిందే. లీటరు పెట్రోల్‌పై గరిష్టంగా రూ.5, డీజిల్‌పై రూ.3 చొప్పున పెంచింది. అయితే, ప్రస్తుతం పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లారడం, కీలకమైన సముద్ర మార్గాలు తిరిగి తెరుచుకోవడంతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టాయి. ఫలితంగా ఇంధన ధరలను నయారా తగ్గించింది.
Also Read..
బీజేపీకి రాజ్యాంగంపై ఎలాంటి విశ్వాసం లేదు : కేసీ వేణుగోపాల్
ఈవీల ఛార్జింగ్‌లకు సగం ఇళ్లే సిద్ధం.. 45 శాతం గృహాల్లో విద్యుత్ అప్‌గ్రేడ్ అవసరం..
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Konda Surekha | ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో మంత్రి కొండా సురేఖ భేటీ..!
- ●Telangana Cabinet | తెలంగాణ కేబినెట్ విస్తరణ..! కొండా సురేఖకు ఉద్వాసన..?
- ●Nagarkurnool | వానలు పడడం లేదని.. మృతదేహాన్ని వెలికి తీశారు
- ●Auto Strike | తెలంగాణలో ఆటోల సమ్మె బంద్..
- ●BRS Party | కాంగ్రెస్ 1000 రోజుల దగాపై బీఆర్ఎస్ సమరభేరి.. సెప్టెంబర్ 2 నుంచి నిరసనలు
- ●MLA Mallareddy | మంత్రి పొంగులేటి పాలు పొంగినట్టు పొంగుతున్నాడు : ఎమ్మెల్యే మల్లారెడ్డి

Konda Surekha | ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో మంత్రి కొండా సురేఖ భేటీ..!

Telangana Cabinet | తెలంగాణ కేబినెట్ విస్తరణ..! కొండా సురేఖకు ఉద్వాసన..?

Nagarkurnool | వానలు పడడం లేదని.. మృతదేహాన్ని వెలికి తీశారు

Auto Strike | తెలంగాణలో ఆటోల సమ్మె బంద్..






