Rajnath Singh | సింధూర్‌లో సైనికులెవరూ అమరులు కాలేదంటూ ప్రకటన.. రాజ్‌నాథ్‌పై ప్రివిలేజ్ నోటీసు ఇచ్చిన కాంగ్రెస్
Rajnath Singh | గతేడాది జరిగిన ఆపరేషన్ సింధూర్‌లో (Operation Sindoor) భారత సైనికులెవరూ మరణించలేదంటూ ప్రకటించి లోక్‌సభను తప్పుదోవ పట్టించారనే ఆరోపణలతో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh)పై కాంగ్రెస్ (Congress) పార్టీ ప్రివిలేజ్ నోటీసు (privilege notice) ఇచ్చింది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ (KC Venugopal) ఈ నోటీసును లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు సమర్పించారు.
Rajnath Singh | రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh)పై కాంగ్రెస్ ప్రివిలేజ్ నోటీస్ ఇచ్చింది. గతేడాది జరిగిన 'ఆపరేషన్ సింధూర్' (Operation Sindoor)లో భారత సైనికులు ఎవరూ ప్రాణాలు కోల్పోలేదని రాజ్‌నాథ్ సింగ్ పార్లమెంట్‌ను తప్పుదోవ పట్టించారని ఆరోపిస్తూ ఆయనపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చింది. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ లోక్‌సభ స్పీకర్‌కు ఈ నోటీసును అందజేశారు. లోక్‌సభ నియమ నిబంధనల్లోని రూల్ 223 కింద రక్షణ మంత్రిపై ప్రివిలేజ్ చర్యలు తీసుకోవాలని కోరారు.
కాగా, పహల్గామ్ ఉగ్రదాడి, ఆ తర్వాత జరిగిన ఆపరేషన్ సింధూర్‌పై 2025 జులై 28న పార్లమెంట్‌లో చర్చ జరిగింది. ఈ చర్చ సందర్భంగా ఈ ఆపరేషన్‌లో భారత సైనికులు ఎవరూ ప్రాణాలు కోల్పోలేదని రాజ్‌నాథ్ సభకు తెలిపారని కేసీ పేర్కొన్నారు. అయితే, ఆ సైనిక ఆపరేషన్‌లో సాయుధ దళాలకు చెందిన ఆరుగురు సిబ్బంది మరణించినట్లు ప్రభుత్వం ఆ తర్వాత అధికారికంగా వెల్లడించిందని గుర్తు చేశారు. మరణాల గురించిన సమాచారాన్ని దాచడం ఆ సైనికుల కుటుంబాలను, సాయుధ దళాలను అవమానించడమే అవుతుందన్నారు.
"గతేడాది పార్లమెంట్‌లో ఆపరేషన్ సింధూర్‌పై జరిగిన చర్చ సమయంలో రాజ్‌నాథ్ భారత ప్రజలకు అబద్ధం చెప్పారు. ఆపరేషన్‌లో ఏ ఒక్క భారతీయ సైనికుడూ అమరుడు కాలేదని ఆయన ఎలా చెప్పారు..? ఆ తర్వాత ఆరుగురు జవాన్లను కోల్పోయామని సాయుధ దళాలు అధికారికంగా ఎలా ప్రకటిస్తాయి..? ఆపరేషన్ సింధూర్ సమయంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సభలో మంత్రి ఇచ్చిన ప్రకటన స్పష్టంగా తప్పుదోవ పట్టించేదిగా ఉంది. పార్లమెంటును తప్పుదోవ పట్టించడం లేదా సమాచారాన్ని దాచడం అనేది సభా హక్కుల ఉల్లంఘన, సభను ధిక్కరించడమే అవుతుంది. రాజ్‌నాథ్‌పై సభా ఉల్లంఘన చర్యలు తీసుకోవాలి" అని కేసీ వేణుగోపాల్ స్పష్టం చేశారు.
సంబంధిత వార్తలు

One Nation One Election | 2029లో జమిలి సాధ్యమే.. రాష్ట్రాలదే తుది నిర్ణయం : జేపీసీ చైర్మన్
ఆగస్టు 25, 2026

ఆపరేషన్ సిందూర్ వేళ సైబర్ దాడులు: రామగుండం సహా 5 ప్రాంతాల్లో NIA మెరుపు సోదాలు.. అసలు లింకేంటి?
ఆగస్టు 25, 2026

Graduates’ MLC Elections | పట్టభద్రుల ఎమ్మెల్సీ బరి.. రాకేశ్‌రెడ్డి వర్సెస్ గడల శ్రీనివాస్, పీవీ శ్రీనివాస్‌రావు!
ఆగస్టు 25, 2026
తాజావార్తలు
- ●Mrunal Thakur | బాహుబలి ప్రీక్వెల్ - శివగామి పాత్రలో మృణాల్ ఠాకూర్ - వంద కోట్లతో షూటింగ్ - కట్ చేస్తే!
- ●Etala Rajendar | కాంగ్రెస్‌లో రేవంత్ ఉడుం లెక్క చొర్రిండట.. వాళ్ల కార్యకర్తలే ఆయనపై కోపంగున్నరు
- ●BC | బీసీల ఝూటా పార్టీగా మారిన బీజేపీ.. గద్దె దింపుతామన్న బీసీ నేతలు
- ●Kriti Sanon | సంస్కృతి దుస్తుల్లో కాదు.. గుండెల్లో ఉంటుంది.. రాఖీ యాడ్ విమర్శలపై కృతి సనన్ కౌంటర్..
- ●BJYM | ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి.. లేదంటే ఉద్యమం మరింత ఉధృతం చేస్తాం
- ●One Nation One Election 2029 | 2029లోనే 'జమిలి' సమరం? ఎన్డీయే మాస్టర్ ప్లాన్

Mrunal Thakur | బాహుబలి ప్రీక్వెల్ - శివగామి పాత్రలో మృణాల్ ఠాకూర్ - వంద కోట్లతో షూటింగ్ - కట్ చేస్తే!

Etala Rajendar | కాంగ్రెస్‌లో రేవంత్ ఉడుం లెక్క చొర్రిండట.. వాళ్ల కార్యకర్తలే ఆయనపై కోపంగున్నరు

BC | బీసీల ఝూటా పార్టీగా మారిన బీజేపీ.. గద్దె దింపుతామన్న బీసీ నేతలు

Kriti Sanon | సంస్కృతి దుస్తుల్లో కాదు.. గుండెల్లో ఉంటుంది.. రాఖీ యాడ్ విమర్శలపై కృతి సనన్ కౌంటర్..



