త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Abhijeet Dipke | రండి.. ప్రభుత్వ పాఠశాలలను మెరుగుప‌రుద్దాం : సీజేపీ పిలుపు

Abhijeet Dipke | దేశానికి స్వాతంత్రం వచ్చి 80 ఏళ్లు అవుతున్నా.. గ్రామాల్లోని ప్రభుత్వ స్కూళ్లను ఎవరూ పట్టించుకోవడం లేదని కాక్రోచ్ జ‌న‌తా పార్టీ (Cockroach Janta Party) వ్య‌వ‌స్థాప‌కుడు అభిజీత్ దిప్కే (Abhijeet Dipke) ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల (improve government schools in villages) దుస్థితిని మెరుగుపరచడానికి, ప్రాథమిక వసతులు కల్పించడానికి ఆగ‌స్టు 15 నుంచి దేశ‌వ్యాప్త ఉద్య‌మం ప్రారంభించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

D

National | Published On Aug 11, 2026, 1.44 pm IST

Abhijeet Dipke | రండి.. ప్రభుత్వ పాఠశాలలను మెరుగుప‌రుద్దాం : సీజేపీ పిలుపు
Advertisement
  • గ్రామీణ విద్యార్థుల‌కు ప‌ట్ట‌ణాల‌తో స‌మాన‌మైన వ‌స‌తులు క‌ల్పిద్దాం
  • సర్పంచ్ ఛాలెంజ్..
  • త‌ల్లిదండ్రుల ఆధ్వ‌ర్యంలో సోష‌ల్ ఆడిట్‌
  • మ‌రో దేశ‌వ్యాప్త‌ ఉద్య‌మానికి శ్రీ‌కారం చుట్టిన కాక్రోచ్ పార్టీ

Abhijeet Dipke | త్రినేత్ర‌.న్యూస్ : నీట్ పేప‌ర్‌లీక్‌పై ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా కాక్రోచ్ జ‌న‌తాపార్టీ (Cockroach Janta Party) చేప‌ట్టిన ఉద్య‌మం విజ‌య‌వంత‌మైన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో సీజేపీ మ‌రో ఉద్య‌మానికి శ్రీ‌కారం చుట్టింది. గ్రామీణ విద్యా మౌలిక సదుపాయాల నిర్లక్ష్యాన్ని పరిష్కరించే లక్ష్యంతో దేశ‌వ్యాప్త ఉద్య‌మానికి (nationwide campaign) సిద్ధ‌మ‌వుతోంది. ఇందుకు సంబంధించిన కీల‌క వివ‌రాల‌ను సీజేపీ వ్య‌వ‌స్థాప‌కుడు అభిజీత్ దిప్కే (Abhijeet Dipke) నిన్న సోష‌ల్ మీడియా ద్వారా వెల్ల‌డించారు.

గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల దుస్థితిని మెరుగుపరచడానికి, ప్రాథమిక వసతులు కల్పించడానికి ఆగ‌స్టు 15 నుంచి దేశ‌వ్యాప్త ఉద్య‌మం ప్రారంభించ‌నున్న‌ట్లు దిప్కే ప్ర‌క‌టించారు. గ్రామీణ విద్యార్థులకు కూడా పట్టణాలతో సమానంగా మెరుగైన వసతులు అందాలనేది ఈ ఉద్యమ‌ ముఖ్య ఉద్దేశ‌మ‌ని స్ప‌ష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతులను మెరుగుపరచడానికి పౌరులు, త‌ల్లిదండ్రులు, గ్రామ స‌ర్పంచులు అంతా క‌లిసిక‌ట్టుగా ప‌నిచేయాల‌ని ఈ సంద‌ర్భంగా దిప్కే పిలుపునిచ్చారు. మ‌హారాష్ట్ర‌లోని హింగోలిలో ఉన్న త‌న స్వ‌గ్రామం నుంచే ఈ క్యాక్ర‌మాన్ని ప్రారంభిస్తాన‌ని దిప్కే తెలిపారు. గ్రామంలోని సర్పంచ్‌ను కలసి అక్కడి ప్రభుత్వ పాఠశాలలను మెరుగుపరిచేందుకు త‌గిన‌ చర్యలు తీసుకోవాల్సిందిగా కోరతామని చెప్పారు.

స్వాతంత్య్రం వ‌చ్చి 80 ఏళ్లు అవుతోంది..

"రాబోయే ఆగస్టు 15న మనం 80వ స్వాతంత్య్ర‌ దినోత్సవాన్ని జరుపుకోబోతున్నాం. ఈ గత 80 ఏళ్లలో అత్యంత‌ నిర్లక్ష్యానికి, విస్మరణకు గురైంది ఏదైనా ఉందంటే అది మన గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలే. మ‌నం కొత్త పార్ల‌మెంట్‌ను నిర్మించుకున్నాం. ప్ర‌ధాని కోసం కొత్త ఇంటిని నిర్మించుకున్నాం. మ‌రి మ‌న గ్రామాల్లో పిల్ల‌ల కోసం కొత్త పాఠ‌శాల‌ల‌ను ఎందుకు నిర్మించ‌లేక‌పోయాం..? రైతులు, కూలీల పిల్ల‌ల‌ను దేశ భ‌విష్య‌త్తుగా భావించ‌డం లేదా..?" అని దిప్కే ప్ర‌శ్నించారు. నేటికీ గ్రామాల్లోని పిల్ల‌లు బ‌డికి వెళ్లాలంటే చాలా దూరం న‌డ‌వాల్సి వ‌స్తోంద‌న్నారు. అక్క‌డికి వెళ్లిన త‌ర్వాత వారికి తాగునీరు, మ‌రుగుదొడ్లు వంటి క‌నీస వ‌స‌తులు కూడా ఉండ‌టం లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ముఖ్యంగా బాలికలు ఎదుర్కొంటున్న కష్టాలను ఈ సంద‌ర్భంగా దిప్కే హైలైట్ చేశారు.

సీజేపీ “సర్పంచ్ ఛాలెంజ్”

గ్రామాల్లోని ప్రభుత్వ బడులను బాధ్యతగా తీసుకుని అభివృద్ధి చేయాలని సర్పంచ్‌లకు దిప్కే పిలుపునిచ్చారు. మహారాష్ట్రలోని తన స్వగ్రామం హింగోలిలో అక్కడి సర్పంచ్‌ను కలవడం ద్వారా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు చెప్పారు. పాఠశాలలను అభివృద్ధి చేసిన సర్పంచ్‌లను గుర్తించి, వారి సేవలను సోష‌ల్ మీడియా వేదిక‌గా అభినందించ‌నున్న‌ట్లు చెప్పారు. స్కూళ్ల‌ అభివృద్ధికి ముందు, ఆ తర్వాత తీసిన‌ చిత్రాలను సోష‌ల్ మీడియాలో పోస్టు చేసి స‌ర్పంచ్‌ల‌కు మంచి గుర్తింపు తెస్తామ‌న్నారు. ఈ కార్య‌క్ర‌మాన్ని స‌ర్పంచ్ ఛాలెంజ్ (Sarpanch Challenge)గా దిప్కే అభివ‌ర్ణించారు.

ప్ర‌జ‌ల‌ ఆధ్వర్యంలో సోషల్ ఆడిట్

ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌పై ప్ర‌జ‌ల నేతృత్వంలో సోష‌ల్ ఆడిట్ నిర్వ‌హించాల‌ని దిప్కే పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల‌ తల్లిదండ్రులే నేరుగా పాఠశాలలను సందర్శించి అక్క‌డ త‌మ పిల్ల‌ల‌కు క‌నీస సౌక‌ర్యాలు ఉన్నాయో లేదో త‌నిఖీ చేయాల‌న్నారు. విద్యుత్, సురక్షిత తాగునీరు, మరుగుదొడ్లు, మధ్యాహ్న భోజనం వంటి కనీస సదుపాయాలను పరిశీలించాలని కోరారు. ఒక‌వేళ అక్క‌డ క‌నీస వ‌స‌తులు లేక‌పోతే వీడియోలు తీసి పంపాల‌ని సూచించారు. ఇందుకోసం త్వరలోనే CJP సోషల్ మీడియా పేజీల్లో ఒక 'ఆడిట్ ఫారమ్'ను అందుబాటులో ఉంచుతామని చెప్పారు. అందులో నింపిన వివరాలు, వీడియోలను contact@cockroachjantaparty.org కు మెయిల్ చేయవచ్చని తెలిపారు. గ్రామీణ పిల్ల‌ల కోసం మెరుగైన పాఠ‌శాల‌ల‌ను అందిస్తామ‌ని మ‌నం ప్ర‌తిజ్ఞ చేద్దాం. అసలైన భారతదేశం గ్రామాల్లోనే నివసిస్తుంది అని దిప్కే పేర్కొన్నారు.

Also Read..

ఇరాన్ భ‌యం.. తుర్కియే నుంచి బ్రిట‌న్‌కు ట్రంప్ సీక్రెట్ జ‌ర్నీ సాగిందిలా

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను చరిత్ర ఎప్ప‌టికీ గుర్తుంచుకుంటుంది : సోనియా గాంధీ

నా ఓటును తొల‌గించారు.. స‌ర్ ప్ర‌క్రియ‌పై ప్రకాష్ రాజ్ అసంతృప్తి

Advertisement
Advertisement