Chamala Kirankumar Reddy | పార్లమెంట్ సమావేశాలు ఇంకా నాలుగు రోజులే ఉన్నయ్.. అమిత్ షా హౌస్‌లోకి వస్తలేరు
Chamala Kirankumar Reddy | పార్లమెంట్ సమావేశాలు ఇంకా నాలుగు రోజులే ఉన్నాయని.. విద్యార్థులపై పెల్లెట్ గన్స్ పేల్చమని ఎవరు ఆర్డర్ ఇచ్చారో కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్‌సభకు వచ్చి సమాధానం చెప్పాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు. విద్యార్థులపై జరిగిని లాఠీచార్జ్‌పై ఆయన క్షమాపణలు చెప్పాలన్నారు.
- ఆయన లోక్‌సభకు వచ్చి పెల్లెట్ గన్స్ పేల్చమని ఎవరు ఆర్డర్ ఇచ్చారో సమాధానం చెప్పాలి
- విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్‌పై క్షమాపణ చెప్పాలి
- భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి డిమాండ్
Chamala Kirankumar Reddy | త్రినేత్ర.న్యూస్: పార్లమెంట్ సమావేశాలు ఇంకా నాలుగు రోజులే ఉన్నాయని.. విద్యార్థులపై పెల్లెట్ గన్స్ పేల్చమని ఎవరు ఆర్డర్ ఇచ్చారో కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్‌సభకు వచ్చి సమాధానం చెప్పాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు. విద్యార్థులపై జరిగిని లాఠీచార్జ్‌పై ఆయన క్షమాపణలు చెప్పాలన్నారు. ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్ అంశంపై అమిత్ షా లోక్‌సభలో సమాధానం చెప్పాలని పార్లమెంట్ ముందు ఇండియా కూటమి ఎంపీలు సోమవారం నిరసన చేపట్టారు. అమిత్ షా సభకు హాజరు కానీ తేదీలతో కూడిన ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ సందర్భంగా చామల మాట్లాడారు.

విపక్షాల ప్రశ్నలకు సమాధానం చెప్తలేరు..
సమావేశాలు ఇంకా నాలుగు రోజులే ఉన్నా అమిత్ షా హౌస్‌లోకి రావడం లేదు. విద్యార్థులపై పెల్లెట్ గన్స్ పేల్చమని ఎవరు ఆర్డర్ ఇచ్చారో అమిత్ షా సమాధానం చెప్పాలి. కేంద్రం బిల్లులపై పార్లమెంట్‌లో చర్చ పెడితే ఆ బిల్లుల ఆమోదానికి సంబంధించి ప్రతిపక్షాలుగా నిర్ణయం తీసుకుంటాం. విపక్షాల ప్రశ్నలకు కేంద్రం సమాధానం చెప్పడం లేదు. కేంద్రం తనకు కావాల్సిన బిల్లులను పాస్ చేయించుకోవాలని చూస్తోంది. కేంద్రం ప్రజాస్వామ్య బద్ధంగా పార్లమెంట్‌ను నడపాలి అని ఎంపీ చామల సూచించారు.
Protesting again today at Makar Dwar, Because the @HMOIndia @AmitShah refuses to do his job!
Amit Shah ji is continuously absent from the House while the nation demands answers.
Who ordered the brutal crackdown on students?
Where did the money from the Ayodhya Ram Mandir… pic.twitter.com/qCDPSL6NBU— Kiran Kumar Chamala (@kiran_chamala) August 10, 2026
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Priyanka | ప్రియాంక కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది: మంత్రి వాకిటి శ్రీహరి
- ●Harish Rao | కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయండి.. రైతుల ఇబ్బందులను పట్టించుకోండి: హరీశ్ రావు
- ●PM Modi | మీ ప్రతి కన్నీటి చుక్కా బంగారు పతకంతో సమానం.. కామన్వెల్త్ పతక విజేతలను అభినందించిన ప్రధాని మోదీ
- ●Ola Electric | ఓలా ఎలక్ట్రిక్ భారీ డీల్.. భారీ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ రంగంలోకి అడుగు..
- ●Sri Chaitanya School | కర్రలతో కొట్టి.. బూట్లతో తొక్కారు.. దమ్మాయిగూడ శ్రీచైతన్య సూల్లో పదో తరగతి విద్యార్థిపై సహచరుల దాడి..
- ●Student protest | పరీక్షల్లో అవకతవకలపై అసెంబ్లీ వరకూ విద్యార్థుల మార్చ్.. జార్ఖండ్‌లో టెన్షన్ టెన్షన్

Priyanka | ప్రియాంక కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది: మంత్రి వాకిటి శ్రీహరి

Harish Rao | కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయండి.. రైతుల ఇబ్బందులను పట్టించుకోండి: హరీశ్ రావు

PM Modi | మీ ప్రతి కన్నీటి చుక్కా బంగారు పతకంతో సమానం.. కామన్వెల్త్ పతక విజేతలను అభినందించిన ప్రధాని మోదీ

Ola Electric | ఓలా ఎలక్ట్రిక్ భారీ డీల్.. భారీ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ రంగంలోకి అడుగు..






