Ponnam Prabhakar | సినిమా, పుస్తకాలతో సర్వాయి పాపన్న చరిత్రను భావితరాలకు తెలపొచ్చు.. చిత్ర యూనిట్‌కు అభినందనలు
Ponnam Prabhakar | సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జీవిత చరిత్రను, ఆయన చేసిన పోరాటాలను నేటి తరానికి, భావితరాలకు పరిచయం చేయడంలో సినిమా, పుస్తకాలు కీలక పాత్ర పోషిస్తాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ‘సర్దార్ సర్వాయి పాపన్న’ సినిమా ట్రైలర్‌ను మంగళవారం మినిస్టర్ క్వార్టర్స్ లో ఆయన ఆవిష్కరించి మాట్లాడారు.
- ‘సర్దార్ సర్వాయి పాపన్న’ సినిమా ట్రైలర్ ఆవిష్కరణలో మంత్రి పొన్నం ప్రభాకర్
త్రినేత్ర.న్యూస్: సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జీవిత చరిత్రను, ఆయన చేసిన పోరాటాలను నేటి తరానికి, భావితరాలకు పరిచయం చేయడంలో సినిమా, పుస్తకాలు కీలక పాత్ర పోషిస్తాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ‘సర్దార్ సర్వాయి పాపన్న’ సినిమా ట్రైలర్‌ను మంగళవారం మినిస్టర్ క్వార్టర్స్ లో ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. పాపన్న గౌడ్ 376వ జయంతి సందర్భంగా ఈ చిత్రాన్ని ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం అభినందనీయమన్నారు. పాపన్న గౌడ్ చరిత్రను వెండితెరపై ఆవిష్కరిస్తున్న చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చరిత్రను భావితరాలకు చాటిచెప్పాలి. ఆయన చరిత్రను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జీవిత చరిత్రకు సంబంధించిన పుస్తకాన్ని, పోస్టర్ ఆవిష్కరించడం సంతోషంగా ఉంది. బహుజన రాజ్యాన్ని స్థాపించి, మన ప్రాంతాన్ని మనమే పరిపాలించుకోవాలనే ఆలోచనతో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పోరాటం సాగించారు అని మంత్రి పేర్కొన్నారు.

గోల్కొండను వేదికగా చేసుకొని బహుజన రాజ్యాన్ని స్థాపించేందుకు ఆయన కృషి చేశారు. సర్వాయి పాపన్న గౌడ్ అనేక కోటలను జయించి, గోల్కొండ కోట వరకు తన సామ్రాజ్యాన్ని విస్తరించారు. సామాజిక సమానత్వం, స్వయం పాలన, అణగారిన వర్గాల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది అని పొన్నం కొనియాడారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు పతాని రామకృష్ణ, దర్శకుడు, నిర్మాత లింగంపల్లి వెంకటేష్ గౌడ్, డిస్ట్రిబ్యూటర్ పేపర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
సంబంధిత వార్తలు

Attempt Murder | హత్యాయత్నం కేసులో బండి సంజయ్ ముఖ్య అనుచరుడు, బీజేపీ కార్పొరేటర్ అరెస్ట్
ఆగస్టు 11, 2026

Vinod Kumar, Dayakar Rao | గద్దెను కూల్చినంత ఈజీగా.. ప్రజల మనసుల నుంచి పెద్దిని తీసేయలేరు
ఆగస్టు 10, 2026

Defence Corridor | హైదరాబాద్–బెంగళూరు డిఫెన్స్ కారిడార్‌ను ఆమోదించండి.. కేంద్రమంత్రికి జితేందర్‌రెడ్డి రిక్వెస్ట్
ఆగస్టు 10, 2026
తాజావార్తలు
- ●PM E-DRIVE | ద్విచక్ర వాహనదారులకు గుడ్ న్యూస్.. ఎలక్ట్రిక్ వాహనాలకు సబ్సిడీ గడువు పెంపు..
- ●Prakash Raj | నా ఓటును తొలగించారు.. సర్ ప్రక్రియపై ప్రకాష్ రాజ్ అసంతృప్తి
- ●Attempt Murder | హత్యాయత్నం కేసులో బండి సంజయ్ ముఖ్య అనుచరుడు, బీజేపీ కార్పొరేటర్ అరెస్ట్
- ●Parliament Monsoon Session | రివర్స్ ఎటాక్.. పార్లమెంట్ ఆవరణలో ఎన్డీయే ఎంపీల నిరసన
- ●షాంపేన్ నుండి టేకిలా వరకు: ప్రపంచ ప్రసిద్ధ లిక్కర్ బ్రాండ్ల వెనుక దాగున్న 'జిఐ' సీక్రెట్!
- ●Donald Trump | ఇరాన్ భయం.. తుర్కియే నుంచి బ్రిటన్‌కు ట్రంప్ సీక్రెట్ జర్నీ సాగిందిలా

PM E-DRIVE | ద్విచక్ర వాహనదారులకు గుడ్ న్యూస్.. ఎలక్ట్రిక్ వాహనాలకు సబ్సిడీ గడువు పెంపు..

Prakash Raj | నా ఓటును తొలగించారు.. సర్ ప్రక్రియపై ప్రకాష్ రాజ్ అసంతృప్తి

Attempt Murder | హత్యాయత్నం కేసులో బండి సంజయ్ ముఖ్య అనుచరుడు, బీజేపీ కార్పొరేటర్ అరెస్ట్

Parliament Monsoon Session | రివర్స్ ఎటాక్.. పార్లమెంట్ ఆవరణలో ఎన్డీయే ఎంపీల నిరసన



