Prakash Raj | నా ఓటును తొలగించారు.. సర్ ప్రక్రియపై ప్రకాష్ రాజ్ అసంతృప్తి
Prakash Raj | బెంగళూరులో సర్ ప్రక్రియలో భాగంగా తన ఓటును తొలగించారని ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ (Prakash Raj) ఆరోపించారు. ఈ మేరకు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఎక్స్ వేదికగా ఓ సెల్ఫీ వీడియోని విడుదల చేశారు.
Prakash Raj | త్రినేత్ర.న్యూస్ : బెంగళూరులో (Bengaluru) సర్ (SIR) ప్రక్రియలో భాగంగా తన ఓటును తొలగించారని ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ (Prakash Raj) ఆరోపించారు. సర్ (Special Intensive Revision) ప్రక్రియలో భాగంగా బెంగళూరు నియోజకవర్గంలో దాదాపు 65 లక్షల మంది ఓటర్ల పేర్లను తొలగించారని చెప్పారు. అందులో తన పేరు కూడా ఉందన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ సెల్ఫీ వీడియోని విడుదల చేశారు.
"ప్రియమైన మిత్రులారా.. మీకు ఓ జోక్ చెప్పాలనుకుంటున్నాను. బెంగళూరు నియోజకవర్గంలో SIR ప్రక్రియ తర్వాత ఓటు హక్కు తొలగించిన 65 లక్షల మంది ఓటర్లలో నేను కూడా ఒకడిని. నేను ఇదే నియోజకవర్గంలో పుట్టాను. ఇక్కడే పెరిగాను. ఇక్కడే చదువుకున్నాను. నా సినీ ప్రయాణం కూడా ఇక్కడే సాగింది. మరో విషయం ఏంటంటే.. నేను ఈ నియోజకవర్గం నుంచి గతంలో ఎంపీ అభ్యర్థిగా కూడా పోటీ చేశాను. అయినా నా ఓటు తొలగించారు. సరే, జోక్ బానే ఉంది. మళ్లీ నా ఓటు హక్కును పొందడానికి ఏం డాక్యుమెంట్లు అడుగుతారో. కానీ ఒక్క చిన్న విషయం. మిమ్మల్ని ఎన్నుకోని పౌరుల ఓటు హక్కును కాలరాయడానికి మీరు మీ అధికారాలను ఉపయోగించవచ్చు. కానీ మిమ్మల్ని గద్దె దించాలనే మా అధికారాన్ని, మా ప్రయత్నాన్ని మీరు ఆపగలరా..? జస్ట్ అస్కింగ్" అంటూ ప్రకాష్ రాజ్ వ్యాంగ్యంగా స్పందించారు.
Fraand 😂😂 you may chose n deny voting rights of few citizens who may not elect you back to thrown.. but can you stop us from eventually bringing you down from your thrown #justasking pic.twitter.com/S8BpM3CNy0
— Prakash Raj (@prakashraaj) August 11, 2026
అదేవిధంగా జార్ఖండ్ (Jharkhand) రాజధాని రాంచీలోని అసెంబ్లీ సమీపంలో నిరసన తెలుపుతన్న విద్యార్థులపై పోలీసుల బలప్రయోగాన్ని ప్రకాష్ రాజ్ తీవ్రంగా ఖండించారు. ఇలా ఎందుకు చేస్తున్నారు..? అంటూ ప్రశ్నించారు. క్రూరత్వం అన్ని వేళలా పనిచేయదని స్పష్టం చేశారు. ఈ క్రూరత్వాన్ని ఇకపై సహించబోమని వ్యాఖ్యానించారు. ఈ మేరకు నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు బాష్పవాయు గోళాలను ప్రయోగిస్తూ, లాఠీఛార్జ్ చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు.
Why .. Why .. Why 💔💔💔 . This brutality will not work anymore.. it will only bring the arrogant power down . #justasking https://t.co/wFBXcvUfdp
— Prakash Raj (@prakashraaj) August 10, 2026
Also Read..
రివర్స్ ఎటాక్.. పార్లమెంట్ ఆవరణలో ఎన్డీయే ఎంపీల నిరసన
ఇరాన్ భయం.. తుర్కియే నుంచి బ్రిటన్‌కు ట్రంప్ సీక్రెట్ జర్నీ సాగిందిలా
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను చరిత్ర ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది : సోనియా గాంధీ
తాజావార్తలు
- ●Ponnam Prabhakar | సినిమా, పుస్తకాలతో సర్వాయి పాపన్న చరిత్రను భావితరాలకు తెలపొచ్చు.. చిత్ర యూనిట్‌కు అభినందనలు
- ●PM E-DRIVE | ద్విచక్ర వాహనదారులకు గుడ్ న్యూస్.. ఎలక్ట్రిక్ వాహనాలకు సబ్సిడీ గడువు పెంపు..
- ●Attempt Murder | హత్యాయత్నం కేసులో బండి సంజయ్ ముఖ్య అనుచరుడు, బీజేపీ కార్పొరేటర్ అరెస్ట్
- ●Parliament Monsoon Session | రివర్స్ ఎటాక్.. పార్లమెంట్ ఆవరణలో ఎన్డీయే ఎంపీల నిరసన
- ●షాంపేన్ నుండి టేకిలా వరకు: ప్రపంచ ప్రసిద్ధ లిక్కర్ బ్రాండ్ల వెనుక దాగున్న 'జిఐ' సీక్రెట్!
- ●Donald Trump | ఇరాన్ భయం.. తుర్కియే నుంచి బ్రిటన్‌కు ట్రంప్ సీక్రెట్ జర్నీ సాగిందిలా

Ponnam Prabhakar | సినిమా, పుస్తకాలతో సర్వాయి పాపన్న చరిత్రను భావితరాలకు తెలపొచ్చు.. చిత్ర యూనిట్‌కు అభినందనలు

PM E-DRIVE | ద్విచక్ర వాహనదారులకు గుడ్ న్యూస్.. ఎలక్ట్రిక్ వాహనాలకు సబ్సిడీ గడువు పెంపు..

Attempt Murder | హత్యాయత్నం కేసులో బండి సంజయ్ ముఖ్య అనుచరుడు, బీజేపీ కార్పొరేటర్ అరెస్ట్

Parliament Monsoon Session | రివర్స్ ఎటాక్.. పార్లమెంట్ ఆవరణలో ఎన్డీయే ఎంపీల నిరసన






