త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Attempt Murder | హత్యాయత్నం కేసులో బండి సంజయ్ ముఖ్య అనుచ‌రుడు, బీజేపీ కార్పొరేటర్ అరెస్ట్

Attempt Murder | హత్యాయత్నం కేసులో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ముఖ్య అనుచరుడు, కరీంనగర్ 29వ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ సోమిడి వేణుప్రసాద్‌ను పోలీసులు మంగ‌ళ‌వారం అరెస్ట్ చేశారు. కరీంనగర్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కిసాన్‌నగర్‌లో నివసించే శ్రీకాంత్‌, అత‌డి సోద‌రునిపై వేణుప్ర‌సాద్ త‌న అనుచ‌రుల‌తో క‌లిసి క‌త్తులు, బీఆర్ సీసాల‌తో దాడికి దిగారు.

S

Telangana | Published On Aug 11, 2026, 12.53 pm IST

Attempt Murder | హత్యాయత్నం కేసులో బండి సంజయ్ ముఖ్య అనుచ‌రుడు, బీజేపీ కార్పొరేటర్ అరెస్ట్
Advertisement

Attempt Murder | త్రినేత్ర‌.న్యూస్: హత్యాయత్నం కేసులో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ముఖ్య అనుచరుడు, కరీంనగర్ 29వ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ సోమిడి వేణుప్రసాద్‌ను పోలీసులు మంగ‌ళ‌వారం అరెస్ట్ చేశారు. కరీంనగర్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కిసాన్‌నగర్‌లో నివసించే శ్రీకాంత్‌, అత‌డి సోద‌రునిపై వేణుప్ర‌సాద్ త‌న అనుచ‌రుల‌తో క‌లిసి క‌త్తులు, బీఆర్ సీసాల‌తో దాడికి దిగారు. దీంతో నిందితుల‌ను అరెస్టు చేసిన‌ట్లు పోలీసులు తెలిపారు.

వివ‌రాల్లోకి వెళ్తే.. కిసాన్‌నగర్ ప్రాంతంలో నివసించే శ్రీకాంత్, అతని సోదరుడిపై కత్తులు, బీర్ సీసాలతో దాడి చేశారు. బీర్ సీసాతో కడుపులో పొడవడంతో శ్రీ‌కాంత్‌కు తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడిని వెంట‌నే చికిత్స నిమిత్తం స్థానికులు ఆసుపత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామ‌ని, బీజేపీ కార్పొరేటర్‌తో పాటు మరో ఏడుగురిని అరెస్ట్ చేశామ‌ని పోలీసులు తెలిపారు.

అరెస్ట‌యిన వారిలో బీజేపీ కార్పొరేటర్ సోమిడి వేణుప్రసాద్ (A-1), కుడిది నాగేందర్, పంతంగి మధు, నేరెళ్ల నాగరాజు, శ్రీరామోజు భానుచందర్, సంగం వేణు, పంతంగి శశిధర్‌లు ఉన్నట్టు పోలీసులు వెల్ల‌డించారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివ‌రాల‌ను ద‌ర్యాప్తు అనంత‌రం వెల్ల‌డిస్తామ‌ని పోలీసులు తెలిపారు.

Advertisement
Advertisement