త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Abhijeet Dipke | పార్టీ పెట్టం. ప్రెజర్ గ్రూప్ గానే ఉంటాం

కాక్రోచ్ జనతా పార్టీ పొలిటికల్ పార్టీగా మారబోతోందా? ఇండియా కూటమి, పోలీస్ సెక్యూరిటీపై CJP చీఫ్ అభిజీత్ దిప్కే చేసిన కీలక వ్యాఖ్యల ఏంటో తెలుసా?

J

National | Published On Oct 14, 2026, 12.49 pm IST

Abhijeet Dipke | పార్టీ పెట్టం. ప్రెజర్ గ్రూప్ గానే ఉంటాం

సంక్షిప్త సారాంశం

తనకు పోలీసుల నుంచి ఎలాంటి సెక్యూరిటీ అవసరం లేదని స్పష్టం చేసిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే. ఎన్నికల్లో రిగ్గింగ్ చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి సహకరిస్తున్న జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగానే తమ ఉమ్మడి పోరాటమని వెల్లడి. CJP ఎప్పటికీ ఒక 'ఇండిపెండెంట్ ప్రెజర్ గ్రూప్'గానే ఉంటుందని, ఇండియా బ్లాక్‌కు తాము వ్యతిరేకం కాదని క్లారిటీ. CJPని పొలిటికల్ పార్టీగా రిజిస్టర్ చేస్తున్నారన్న వార్తలను పూర్తిగా ఖండించిన అభిజీత్.

Advertisement
  • పొలిటికల్ పార్టీ కాదు
  • CJP అసలు ప్లాన్ బయటపెట్టిన అభిజీత్
  • పొలిటికల్ పార్టీ రిజిస్ట్రేషన్ నుంచి ఇండియా బ్లాక్ వరకు

Abhijeet Dipke | త్రినేత్ర న్యూస్ : కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే నాగ్‌పూర్‌లో మీడియాతో మాట్లాడుతూ.. తమ సంస్థ భవిష్యత్ కార్యాచరణపై కీలక వ్యాఖ్యలు చేశారు. CJP త్వరలోనే ఒక పొలిటికల్ పార్టీగా రిజిస్టర్ కాబోతోందంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన పూర్తిగా ఖండించారు. అంతేకాకుండా ఇండియా బ్లాక్ (INDIA Bloc)తో తమకున్న సంబంధం, పోలీస్ సెక్యూరిటీ తిరస్కరణపై కూడా ఆయన ఫుల్ క్లారిటీ ఇచ్చారు.

పోలీస్ సెక్యూరిటీ ఎందుకు వద్దన్నారంటే?

పోలీసులు ఇచ్చే భద్రతను ఎందుకు నిరాకరించారని రిపోర్టర్లు ప్రశ్నించగా.. "నాకు సెక్యూరిటీతో పని ఏముంది? నాకు ఎలాంటి భద్రత అవసరం లేదు" అని అభిజీత్ దిప్కే సూటిగా బదులిచ్చారు.

రాహుల్ గాంధీ, నేహా బోరా ప్రచారంపై స్పందన

రాహుల్ గాంధీ చేస్తున్న ప్రొటెస్ట్‌లు, అభిజీత్‌కు కౌంటర్‌గా కాంగ్రెస్ పార్టీ నేహా బోరాను ముందుకు తెస్తోందన్న వాదనలపై ఆయన స్పందించారు. "అలాంటిదేమీ లేదు, ప్రస్తుతం జరుగుతున్న ప్రొటెస్ట్‌లన్నీ ఒకే కాజ్ (లక్ష్యం) కోసం జరుగుతున్నాయి" అని స్పష్టం చేశారు.

ప్రధాని నరేంద్ర మోదీ పవర్‌లో కొనసాగేందుకు సహాయం చేస్తూ, ఎలక్షన్ రిగ్గింగ్‌కు పాల్పడుతున్న జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగానే తామంతా కలిసి పోరాడుతున్నామని ఆయన ఆరోపించారు. అందరి లక్ష్యం ఒక్కటేనని తేల్చి చెప్పారు.

ఇండియా బ్లాక్‌తో కలిసి ఉద్యమిస్తారా?

కాంగ్రెస్‌తో కలిసి ఆందోళన చేస్తారా లేక వేర్వేరుగా పోరాటం ఉంటుందా అన్న ప్రశ్నకు అభిజీత్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. "కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఒక ఇండిపెండెంట్ ప్రెజర్ గ్రూప్, అది ఎప్పటికీ ఇండిపెండెంట్ ప్రెజర్ గ్రూప్‌గానే ఉంటుంది" అని చెప్పారు.

అయితే, తాము ఇండియా బ్లాక్‌కు వ్యతిరేకమని దీని అర్థం కాదని ఆయన వివరించారు. ఇండియా బ్లాక్ చేస్తున్న ఆందోళన, తాము చేస్తున్న ఆందోళన రెండూ ఒకే లక్ష్యం కోసం జరుగుతున్నాయని తెలిపారు.

ఇదీ చదవండి | సీజేపీ నేత‌ల‌కు జ్యుడీషియ‌ల్ క‌స్ట‌డీ.. తీహార్ జైలుకు సౌర‌వ్ దాస్‌, రాంకా 

పొలిటికల్ పార్టీ రిజిస్ట్రేషన్‌పై క్లారిటీ

CJP తనను తాను ఒక రాజకీయ పార్టీగా రిజిస్టర్ చేసుకునే ప్రొసీజర్ మొదలుపెట్టిందన్న వార్తలపై ప్రశ్నించగా.. "అలాంటి పొలిటికల్ పార్టీ రిజిస్ట్రేషన్ ఏదీ మేము చేయడం లేదు" అంటూ ఆ ప్రచారానికి అభిజీత్ దిప్కే ఫుల్‌స్టాప్ పెట్టారు.

Advertisement
Advertisement