త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CJP | సీజేపీ నేత‌ల‌కు జ్యుడీషియ‌ల్ క‌స్ట‌డీ.. తీహార్ జైలుకు సౌర‌వ్ దాస్‌, రాంకా 

CJP | ఢిల్లీలోని జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద నిర‌స‌న‌కు దిగిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP)నేతలకు కోర్టులో ఎదురుదెబ్బ త‌గిలింది. నిషేధాజ్ఞలను ఉల్లంఘించి జంతర్ మంతర్ (Jantar Mantar)లోకి ప్రవేశించారనే ఆరోపణల‌పై అరెస్టయిన సీజేపీ కీలక నేతలు సౌరవ్ దాస్ (Saurav Das), అశుతోష్ రాంకా (Ashutosh Ranka)కు కోర్టు ఐదు రోజుల జ్యుడీషియల్ కస్టడీ (judicial custody) విధించింది.

G

National | Published On Oct 14, 2026, 10.25 am IST

CJP | సీజేపీ నేత‌ల‌కు జ్యుడీషియ‌ల్ క‌స్ట‌డీ.. తీహార్ జైలుకు సౌర‌వ్ దాస్‌, రాంకా 
Advertisement

CJP | త్రినేత్ర న్యూస్‌: ఢిల్లీలోని జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద నిర‌స‌న‌కు దిగిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP)నేతలకు కోర్టులో ఎదురుదెబ్బ త‌గిలింది. నిషేధాజ్ఞలను ఉల్లంఘించి జంతర్ మంతర్ (Jantar Mantar)లోకి ప్రవేశించారనే ఆరోపణల‌పై అరెస్టయిన సీజేపీ కీలక నేతలు సౌరవ్ దాస్ (Saurav Das), అశుతోష్ రాంకా (Ashutosh Ranka)కు ఢిల్లీలోని స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కోర్టు ఐదు రోజుల జ్యుడీషియల్ కస్టడీ (judicial custody) విధించింది. మ‌రో నేత అజింక్య షిండేను వ్య‌క్తిగ‌త పూచీక‌త్తుపై విడుద‌ల చేసింది.

చీఫ్ ఎల‌క్ష‌న్ క‌మిష‌న‌ర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ సీజేపీ గ‌త కొన్ని రోజులుగా ఆందోళ‌న‌లు నిర్వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో జంతర్ మంతర్‌ను ధర్నాలు, ఆందోళనల వేదిక జాబితా నుంచి తొలగిస్తూ (డీ-నోటిఫై) ఢిల్లీ పోలీసులు సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. అయితే మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున ముగ్గురు నేత‌లు పోలీసు బారికేడ్ల‌ను దాటి జంత‌ర్ మంత‌ర్ ప్రాంగ‌ణంలోకి ప్రవేశించారు. త్రివర్ణ పతాకాలతో సీఈసీకి వ్య‌తిరేకంగా నిరసన గళం విప్పారు. దీంతో వారిని అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు.. అనుమ‌తి లేకుండా ప్ర‌వేశించ‌డం, నిషేధాజ్ఞ‌ల‌ను ఉల్లంఘించ‌డం, ప్ర‌భుత్వ ఉద్యోగుల విధుల‌కు ఆటంకం క‌ల‌గించ‌డం వంటి అభియోగాల‌తో కేసు న‌మోదుచేశారు. బుధవారం ఉద‌యం మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. విచారణ అనంతరం మేజిస్ట్రేట్ కోర్టు సౌర‌వ్ దాస్‌, రాంకాల‌కు ఐదు రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ ఉత్త‌ర్వులు చేసింది. దీంతో పోలీసులు వారిని తీహార్ జైలుకు (Tihar Jail) త‌ర‌లించారు.

త్రివ‌ర్ణ ప‌తాకం ఎగుర‌వేయ‌డ‌మే త‌ప్పా?: దీప్కే

సీజేపీ కీల‌క నేత‌ల‌కు జ్యుడీషియ‌ల్ క‌స్ట‌డీ విధించ‌డంపై ఆ పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు అభిజీత్ దీప్కే (Abhijeet Dipke) ఆగ్రహం వ్యక్తం చేశారు. జంతర్ మంతర్ వద్ద జాతీయ జెండాను ఎగురవేయ‌డ‌మే వారి త‌ప్పా? అని ప్ర‌శ్నించారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపినందుకు కేంద్ర ప్రభుత్వం పిరికిపంద చర్యలకు పాల్పడుతున్న‌దని ఆరోపించారు. ప్రభుత్వ వ్యతిరేక గళాన్ని అణచివేయాల‌నుకుంటే ప్ర‌ధాని మోదీ (PM Modi) అధికారికంగా ఎమర్జెన్సీ (Emergency) ప్ర‌క‌టించాల‌ని విమ‌ర్శించారు. ఎన్ని అరెస్టులు చేసినా తమ పోరాటం ఆగదని హెచ్చరించారు.

Advertisement
Advertisement