PM Modi | ఉగ్రవాదం, వేర్పాటువాదం, తీవ్రవాదాన్ని రూపుమాపాలి.. విదేశీ పర్యటకు బయల్దేరి వెళ్లిన ప్రధాని మోదీ
PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) విదేశీ పర్యటనకు బయల్దేరి వెళ్లారు. ఈ నెల 29 నుంచి సెప్టెంబరు 1 వరకు ఉజ్బెకిస్థాన్, కిర్గిస్థాన్‌లలో మోదీ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కీలక ప్రకటన విడుదల చేశారు. ప్రపంచవ్యాప్తంగా శాంతి భద్రతలకు ముప్పు కలిగిస్తున్న ఉగ్రవాదం, వేర్పాటువాదం, తీవ్రవాదాన్ని రూపుమాపేందుకు ఇతర సభ్య దేశాలతో కలిసి పనిచేయడానికి భారత్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
PM Modi | త్రినేత్ర.న్యూస్ : ప్రపంచవ్యాప్తంగా శాంతి భద్రతలకు ముప్పు కలిగిస్తున్న ఉగ్రవాదం, వేర్పాటువాదం, తీవ్రవాదాన్ని రూపుమాపేందుకు ఇతర సభ్య దేశాలతో కలిసి పనిచేయడానికి భారత్ కట్టుబడి ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) పునరుద్ఘాటించారు. ప్రధాని ఇవాళ ఉజ్బెకిస్థాన్ (Uzbekistan), కిర్గిస్థాన్ దేశాల పర్యటనకు బయల్దేరి వెళ్లారు. ఈ సందర్భంగా కీలక ప్రకటన విడుదల చేశారు.
ఉజ్బెకిస్థాన్ అధ్యక్షుడు షావ్‌కత్ మిర్జియోయేవ్ ఆహ్వానం మేరకు ఆగస్టు 29-30 తేదీల్లో తాష్కెంట్ నగరంలో పర్యటించనున్నట్లు ప్రధాని తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా భారత్-ఉజ్బెకిస్థాన్ వ్యూహాత్మక భాగస్వామ్యం ఎంతో పురోగతి సాధించిందని పేర్కొన్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, డిజిటల్ కనెక్టివిటీ, రక్షణ, ఇంధరన రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై చర్చలు జరపనున్నట్లు తెలిపారు. అదేవిధంగా వికసిత్ భారత్, యాంగీ ఉజ్బెకిస్థాన్ ఉమ్మడి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంపై ఆ దేశ అధ్యక్షుడు మిర్జియోయెవ్‌తో చర్చల కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. ఇక ఈ పర్యటనలో తాష్కెంట్ స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ ఓరియంటల్ స్లడీస్‌లోని శాస్త్రి మెమోరియల్, మహాత్మాగాంధీ కేంద్రాలను ప్రధాని సందర్శించనున్నారు.
ఉజ్బెకిస్థాన్ పర్యటన అనంతరం ప్రధాని మోదీ కిర్గిస్థాన్ వెళ్తారు. ఆ దేశ అధ్యక్షుడు సాదిర్ జాపరోవ్ ఆహ్వానం మేరకు కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్‌లో జరిగే షాంఘై సహకార సంస్థ (Shanghai Cooperation Organisation) సదస్సులో పాల్గొననున్నట్లు ప్రధాని తెలిపారు. ఎస్‌సీవోలో భారత్ 2017 నుంచి అత్యంత క్రియాశీలక, నిర్మాణాత్మక సభ్య దేశంగా ఉంటూ వస్తోందని చెప్పారు. ఈ సంస్థ ఏర్పడి 25 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఈ సదస్సుకు ప్రత్యేకత సంతరించుకుంది. భద్రత, కనెక్టివిటీ, అవకాశాలు (Security, Connectivity and Opportunity)పై ఆధారపడిన ఈ ప్రాంతం కోసం భారతదేశపు దార్శనికతను ముందుకు తీసుకెళ్లడానికి, అదేవిధంగా మన పొరుగు ప్రాంతాల్లో, ప్రపంచవ్యాప్తంగా శాంతిభద్రతలకు ముప్పు కలిగిస్తున్న ఉగ్రవాదం, వేర్పాటువాదం, తీవ్రవాదం రూపుమాపేందుకు ఇతర సభ్య దేశాలతో కలిసి పనిచేయడానికి భారత్ కట్టుబడి ఉందని ఈ సందర్భంగా ప్రధాని పునరుద్ఘాటించారు.
ఈ ఎస్‌సీవో సదస్సుకు రష్యా అధ్యక్షుడు పుతిన్‌తోపాటు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తదితరులు హాజరయ్యే అవకాశముంది. ఈ పర్యటనలో పుతిన్‌తో ప్రధాని మోదీ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈ భేటీలో ఇరు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాలను నేతలిద్దరూ సమగ్రంగా సమీక్షించనున్నారు.
PM Narendra Modi's Departure Statement ahead of visit to Uzbekistan and Kyrgyz Republic
"I am embarking on a visit to the Republic of Uzbekistan and the Kyrgyz Republic from 29 August-1 September 2026. At the invitation of President Shavkat Mirziyoyev, I will visit Tashkent on… pic.twitter.com/io8j7f0sVA
— ANI (@ANI) August 29, 2026
Also Read..
వెనెజువెలాతో చరిత్రలోనే అతిపెద్ద ఆయిల్ డీల్.. ట్రంప్ కీలక ప్రకటన
ఇండియా పోస్ట్‌లో 23,757 గ్రామీణ డాక్ సేవక్ పోస్టులు.. పదో తరగతి మార్కుల ఆధారంగా ఎంపిక
యూజీసీ నెట్ ఫలితాలు విడుదల.. వచ్చేనెల 9, 10 తేదీల్లో 3 సబ్జెక్టులకు రీఎగ్జామ్
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Giorgia Meloni | మెలోనీ సరికొత్త రికార్డు.. ఇటలీ చరిత్రలోనే అత్యధిక కాలం పనిచేసిన ప్రభుత్వంగా రికార్డు.. ఫ్రెండ్‌కి మోదీ కంగ్రాట్స్
సెప్టెంబర్ 4, 2026

GSLV F17 mission | మరో ఆరు ప్రయోగాలే లక్ష్యం.. GSLV-F17 ప్రయోగం విజయవంతం వేళ గగన్‌యాన్ అప్డేట్ ఇచ్చిన ఇస్రో ఛైర్మన్
సెప్టెంబర్ 4, 2026

WhatsApp | ఇక బిల్లులన్నీ వాట్సాప్‌లోనే చెల్లించవచ్చు.. కొత్త అప్డేట్ వచ్చేసింది..
సెప్టెంబర్ 3, 2026
తాజావార్తలు
- ●Nagarmal Bajoria | 300 సార్లు ఎన్నికల్లో పోటీ.. ఆ కోరిక తీరకుండానే అనంత లోకాలకు
- ●Konda Surekha | కొండా సురేఖకు మరో ఝలక్..
- ●Traffic Restrictions | వినాయక విగ్రహాల తరలింపు.. ధూల్‌పేటలో 14 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
- ●CM Revanth Reddy | కొడంగల్ లిఫ్ట్.. ఫేజ్-2 పనులకు టెండర్లు పిలవండి
- ●KRMB | తాగు నీటి అవసరాలకే నీటిని వినియోగించాలి.. కేఆర్ఎంబీ ఆదేశాలు
- ●CM Revanth Reddy | హకీంపేట్ ఎడ్యుకేషన్ హబ్ పనులను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి

Nagarmal Bajoria | 300 సార్లు ఎన్నికల్లో పోటీ.. ఆ కోరిక తీరకుండానే అనంత లోకాలకు

Konda Surekha | కొండా సురేఖకు మరో ఝలక్..

Traffic Restrictions | వినాయక విగ్రహాల తరలింపు.. ధూల్‌పేటలో 14 వరకు ట్రాఫిక్ ఆంక్షలు

CM Revanth Reddy | కొడంగల్ లిఫ్ట్.. ఫేజ్-2 పనులకు టెండర్లు పిలవండి



