IRCTC | ఒక్క టూర్‌లో ఏడు జ్యోతిర్లింగాల దర్శనం.. హైదరాబాద్ నుంచి ప్రయాణం మొదలు.. టూర్ ప్యాకేజీ వివరాలు ఇవే..
IRCTC | ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లాలనుకునే యాత్రికులకు ఐఆర్‌సీటీసీ (IRCTC) గుడ్ న్యూస్ చెప్పింది. ‘సప్త జ్యోతిర్లింగ్ దర్శన్ యాత్ర’ పేరుతో (SAPTA (07) Jyotirlinga Darshan Yatra) ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఒకే యాత్రలో ఏడు జ్యోతిర్లింగాలను దర్శించుకునే అవకాశం కల్పిస్తోంది.
IRCTC | త్రినేత్ర.న్యూస్ : ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లాలనుకునే భక్తులకు ఐఆర్‌సీటీసీ (IRCTC) గొప్ప అవకాశం కల్పిస్తోంది. ఒకే యాత్రలో మధ్యప్రదేశ్‌లోని మహాకాళేశ్వర్, ఓంకారేశ్వర్ ఆలయాలతో పాటు గుజరాత్‌లోని ద్వారక, సోమనాథ్, మహారాష్ట్రలోని పుణె, నాసిక్, ఛత్రపతి శంభాజీనగర్‌లోని జ్యోతిర్లింగాలను దర్శించుకునే భాగ్యం కల్పిస్తోంది. ఇందుకోసం "సప్త (07) జ్యోతిర్లింగ దర్శన్ యాత్ర" పేరుతో ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రకటించింది.
ప్రయాణం సాగుతుందిలా..
- ఈ యాత్ర వచ్చే నెల అంటే సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభం అవుతుంది. ఉదయం 8 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు బయల్దేరుతుంది. సికింద్రాబాద్, కామారెడ్డి, నిజామాబాద్ జంక్షన్, ధర్మాబాద్, ముద్ఖేడ్ జంక్షన్, నాందేడ్, పూర్ణ జంక్షన్ మీదుగా ప్రయాణం సాగుతుంది.
- మరుసటి రోజు అంటే 24వ తేదీ ఉదయం 8 గంటలకు ఉజ్జయిని చేరుకుంటారు. అక్కడ హోటల్‌లో చెక్ ఇన్ అయి ఫ్రెస్ అవుతారు. తొలి రోజు మహాకాళేశ్వర్ ఆలయం, కారిడాన్‌ను సందర్శిస్తారు. రాత్రికి ఉజ్జయినిలోనే బస ఉంటుంది.
- మరుసటి రోజు (25వ తేదీ) ఉదయాన్నే టిఫిన్ చేసిన తర్వాత హోటల్ చెక్ అవుట్ చేసి.. రోడ్డు మార్గంలో ఓంకారేశ్వర జ్యోతిర్లింగ ఆలయాన్ని సందర్శించడానికి బయలుదేరతారు. సుమారు నాలుగు గంటల ప్రయాణం ఉంటుంది. ఓంకారేశ్వర ఆలయ సందర్శన అనంతరం అంబేద్కర్ నగర్ రైల్వే స్టేషన్‌కు చేరుకొని రాత్రి 9 గంటలకు ద్వారకకు రైల్లో బయల్దేరతారు.
- 26వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ద్వారక చేరుకుంటారు. అక్కడ హోటల్‌లో చెక్ ఇన్ అవుతారు. రాత్రికి భోజనం చేసి అక్కడే బస చేస్తారు.
- 27వ తేదీ ఉదయం లేవగానే ఫ్రెష్ అయ్యి బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ చేసుకుంటారు. ఆ తర్వాత హోటల్ చెక్ అవుట్ చేసి ద్వారకాధీశ ఆలయాన్ని సందర్శించేందుకు వెళ్తారు. ఆ తర్వాత బేట్ ద్వారక, నాగేశ్వర్ జ్యోతిర్లింగ ఆలయాన్ని సందర్శిస్తారు. అనంతరం ఓఖా రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. రాత్రి 9 గంటలకు రైలు సోమనాథ్‌కు బయల్దేరుతుంది.
- 28వ తేదీ ఉదయం 6 గంటలకు సోమనాథ్ చేరుకున్న తర్వాత.. హోటల్‌కు వెళ్తారు. స్నానం చేసిన తర్వాత సోమనాథ్ జ్యోతిర్లింగ ఆలయాన్ని సందర్శనకు వెళ్తారు. అక్కడ దర్శనం పూర్తైన తర్వాత ఖడ్కీ (పూణె)కి వెళ్లేందుకు సోమనాథ్ రైల్వే స్టేషన్‌కు వెళ్తారు. మధ్యాహ్నం 3 గంటలకు రైలు బయల్దేరుతుంది.
- 29వ తేదీ ఉదయం 11 గంటలకు ఖడ్కీ చేరుకుంటారు. హోటల్‌లో చెక్ ఇన్ అయ్యి రాత్రికి అక్కడే విశ్రాంతి తీసుకుంటారు.
- 30వ తేదీ తెల్లవారుజామున 4 గంటలకే హోటల్‌లో చెక్ అవుట్ చేసి భీమశంకర జ్యోతిర్లింగ క్షేత్రానికి బయల్దేరతారు. సుమారు 3 గంటల ప్రయాణం ఉంటుంది. మధ్యాహ్నం భోజనం అనంతరం ఓజార్‌లోని శ్రీ విఘ్నహర్ గణపతి ఆలయాన్ని సందర్శిస్తారు. అదేరోజు రాత్రి 11 గంటలకు ఖడ్కి రైల్వే స్టేషన్‌కు చేరుకొని నాసిక్‌కు బయల్దేరతారు.
- 1వ తేదీ ఉదయం 6 గంటలకు నాసిక్ రోడ్డు రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. . అక్కడి నుంచి హోటల్‌కు వెళ్లి ఫ్రెష్ అవుతారు. త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగ ఆలయాన్ని సందర్శిస్తారు. రాత్రి భోజనం అనంతరం నాసిక్ రోడ్డు రైల్వే స్టేషన్‌కు చేరుకుని.. ఛత్రపతి శంభాజీనగర్ (ఔరంగాబాద్)కు ప్రయాణాన్ని మొదలు పెడతారు.
- 2వ తేదీ ఉదయం 6 గంటలకు ఛత్రపతి శంభాజీనగర్ చేరుకుంటారు. హోటల్‌కు వెళ్లి ఫ్రెస్ అవుతారు. ఆ తర్వాత ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగ ఆలయాన్ని సందర్శిస్తారు. ఈ ఆలయంతో సప్త జ్యోతిర్లింగ్ దర్శన్ యాత్ర పూర్తవుతుంది. అదే రోజు రాత్రి 11 గంటలకు తిరుగుపయనమవుతారు.
- 3వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు రైలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది. రైలు దిగిన తర్వాత యాత్రికులు తమ గమ్యస్థానాలకు వెళ్తారు. దీంతో ఈ టూర్ పూర్తవుతుంది.
- మొత్తం 10 రాత్రులు, 11 రోజుల పాటు ఈ యాత్ర సాగుతుంది.
ఇవీ ప్యాకేజీ ధరలు..
- ఈ ప్యాకేజీలో ఎకానమీ (స్లీపర్ క్లాస్), స్టాండర్డ్ (3ఏసీ), కంఫర్ట్ (2ఏసీ) అనే మూడు కేటగిరీలు ఉన్నాయి.
- స్లీపర్ క్లాస్‌లో ఎకానమీ టికెట్ ధర రూ.18,000 నుంచి ప్రారంభమవుతుంది. అదే 5-11 ఏళ్ల మధ్య వయసు గల చిన్నారులకు మాత్రం రూ.16,700 చెల్లించాలి.
- 3ఏసీ స్టాండర్డ్ ప్యాకేజీ ధర రూ.27,400 నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో 5-11 ఏళ్ల మధ్య చిన్నారులకు రూ.25,900 చెల్లించాలి.
- ఇక 2ఏసీ కంఫర్ట్ ప్యాకేజీ ధర రూ.35,500గా నిర్ణయించారు. ఇందులో 5-11 ఏళ్ల చిన్నారులకు రూ.33,600 చెల్లించాలి.
ప్యాకేజీలో లభించే సౌకర్యాలు
యాత్రికులకు హోటల్ బస, శాకాహార భోజనం (ఉదయం, మధ్యాహ్నం, రాత్రి), స్థానిక రవాణా, ట్రావెల్ ఇన్సూరెన్స్, టూర్ మేనేజర్ సహాయం వంటి సదుపాయాలు ప్యాకేజీలో భాగం. అయితే, ఏ ఆలయం వద్దైనా ఎంట్రీ ఫీజులు ఉంటే మాత్రం ప్రయాణికులే చెల్లించుకోవాల్సి ఉంటుంది. కేవలం యాత్రికుల భద్రత, ప్రయాణ సదుపారం, బస, ఫుడ్ వంటివి మాత్రమే రైల్వే సిబ్బంది చూసుకుంటారు. ఈ ప్రత్యేక ‘సప్త జ్యోతిర్లింగ దర్శన్ యాత్ర’ కోసం బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఆసక్తి ఉన్న ప్రయాణికులు IRCTC టూరిజం పోర్టల్ లేదా దేశవ్యాప్తంగా ఉన్న అధికారిక IRCTC టూరిజం కార్యాలయాల ద్వారా తమ సీట్లను బుక్ చేసుకోవచ్చు.
Also Read..
పుట్టబోయే బిడ్డ కోసం షాపింగ్ చేసిన సమంత - అమ్మతనంపై ఆసక్తికర కామెంట్లు
జియో ఐపీఓకు సెబీ గ్రీన్ సిగ్నల్.. అతిపెద్ద లిస్టింగ్‌కు రంగం సిద్ధం..
కొత్త కారుకు పూజచేయించాడు.. అదే కారు కింద పడి వ్యక్తి మృతి
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Tejas Express | మారిన తేజస్ ఎక్స్‌ప్రెస్ పేరు.. ఇకపై ఏమని పిలుస్తారంటే?
ఆగస్టు 13, 2026

IRCTC | ఐఆర్‌సీటీసీ గంగా గయా సంగం యాత్ర.. ఒకే టూర్‌లో గయ, అయోధ్య, కాశీ వంటి పుణ్యక్షేత్రాల సందర్శన.. హైదరాబాద్ నుంచే స్టార్ట్
ఆగస్టు 1, 2026

Indian Railway | తత్కాల్ టికెట్లకు కొత్త విధానం.. ఆగస్టు 1 నుంచి టోకెన్ వ్యవస్థ అమలు
జులై 31, 2026
తాజావార్తలు
- ●Ola Electric | ఓలా ఎలక్ట్రిక్‌కు కేంద్రం భారీ ఊతం.. రూ.95.81 కోట్ల ప్రోత్సాహకం..
- ●Samantha | పుట్టబోయే బిడ్డ కోసం షాపింగ్ చేసిన సమంత - అమ్మతనంపై ఆసక్తికర కామెంట్లు
- ●Jio Platforms IPO | జియో ఐపీఓకు సెబీ గ్రీన్ సిగ్నల్.. అతిపెద్ద లిస్టింగ్‌కు రంగం సిద్ధం..
- ●Hyderabad | కొత్త కారుకు పూజచేయించాడు.. అదే కారు కింద పడి వ్యక్తి మృతి
- ●PM Modi | ఉగ్రవాదం, వేర్పాటువాదం, తీవ్రవాదాన్ని రూపుమాపాలి.. విదేశీ పర్యటకు బయల్దేరి వెళ్లిన ప్రధాని మోదీ
- ●Class 9 Student | రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థినికి ఐదు నెలల గర్భం.. వైద్యపరీక్షల్లో వెలుగులోకి..

Ola Electric | ఓలా ఎలక్ట్రిక్‌కు కేంద్రం భారీ ఊతం.. రూ.95.81 కోట్ల ప్రోత్సాహకం..

Samantha | పుట్టబోయే బిడ్డ కోసం షాపింగ్ చేసిన సమంత - అమ్మతనంపై ఆసక్తికర కామెంట్లు

Jio Platforms IPO | జియో ఐపీఓకు సెబీ గ్రీన్ సిగ్నల్.. అతిపెద్ద లిస్టింగ్‌కు రంగం సిద్ధం..

Hyderabad | కొత్త కారుకు పూజచేయించాడు.. అదే కారు కింద పడి వ్యక్తి మృతి



