Pinarayi Vijayan | అక్షరాస్యత, పాలనలో మేం ముందున్నాం.. మీరు మాకు నీతులు చెబుతున్నారా..? రేవంత్ రెడ్డికి కేరళ సీఎం కౌంటర్
Pinarayi Vijayan | కేరళం అభివృద్ధిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చేసిన వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్ (CM Pinarayi Vijayan) ఘాటుగా స్పందించారు. పేదల ఇండ్లు కూల్చే మీరు మాకు నీతులు చెబుతున్నారా..? అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Pinarayi Vijayan | కేరళం అభివృద్ధిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చేసిన వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్ (CM Pinarayi Vijayan) ఘాటుగా స్పందించారు. పేదల ఇండ్లు కూల్చే మీరు మాకు నీతులు చెబుతున్నారా..? అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమ రాష్ట్ర అభివృద్ధిపై రేవంత్ రెడ్డి తప్పుడు సమాచారంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తన మాటలతో కేరళం ప్రజలను అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేరళంలో అవినీతి, పరిపాలనా వైఫల్యం ఉందని రేవంత్ చేసిన ఆరోపణలను పినరయి విజయన్ తీవ్రంగా ఖండించారు. ఈమేరకు గణాంకాలతో సహా సమాధానమిచ్చారు. నీతి ఆయోగ్ సుస్థిరాభివృద్ధి సూచిక (2023-24)లో కేరళం మొదటి స్థానంలో ఉండగా, తెలంగాణ ఆరో స్థానంలో ఉందని గుర్తు చేశారు. కేరళంలో పేదరికం కేవలం 0.55 శాతమేనని, తెలంగాణలో అది 5.88 శాతంగా ఉందని వివరించారు. కేరళం అక్షరాస్యత రేటు 95.3 శాతంతో దేశంలోనే అగ్రస్థానంలో ఉండగా, తెలంగాణలో అది 76.9 శాతంతో వెనుకబడి ఉన్నదని ఎద్దేవా చేశారు. శిశు మరణాల రేటు కేరళంలో 1000 జననాలకు 5 మాత్రమే ఉండగా, తెలంగాణలో అది దాదాపు నాలుగు రెట్లు ఎక్కువగా ఉందని అన్నారు. మెరుగైన ఆరోగ్య సదుపాయాలతో కేరళం ప్రజల జీవితకాలం సగటు భారతీయుడి కంటే 5 నుంచి 7 సంవత్సరాలు ఎక్కువ అని తెలిపారు. కేరళం సుస్థిర, సమగ్ర అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని ఆయన వెల్లడించారు.
రాజకీయ ద్వంద్వ వైఖరికి నిదర్శనం
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై పినరయి విజయన్ తీవ్ర విమర్శలు చేశారు. సొంత రాష్ట్రంలో పేదల ఇండ్లపైకి బుల్డోజర్లను పంపి కూల్చిన వ్యక్తి వచ్చి, కేరళంలో సామాజిక పురోగతి గురించి ప్రసంగాలు చేయడం విడ్డూరంగా ఉందని ఘాటుగా వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి మాటలు పొంతన లేనివని, సత్యదూరమైనవని పేర్కొన్నారు. సొంత రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పింఛన్లు ఆలస్యమవుతున్న పరిస్థితుల్లో.. ఇలా ఇతర రాష్ట్రాలపై విమర్శలు చేయడం రాజకీయ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని మండిపడ్డారు.
కాగా, అంతకుముందు కేరళంలో యూడీఎఫ్ అభ్యర్థుల తరఫున ప్రచారం చేసిన రేవంత్‌రెడ్డి.. విజయన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ, సీపీఎం మధ్య రహస్య ఒప్పందం ఉందని, అందుకే అవినీతికి పాల్పడిన సీపీఎం నాయకులను కేంద్ర దర్యాప్తు సంస్థలు వదిలేస్తున్నాయని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ ఆరోపణలకు సీఎం పినరయి విజయన్ గణాంకాలతో సహా సమాధానమిచ్చారు.
కాంగ్రెసే 'బీజేపీ బి-టీమ్'
కేరళం ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మధ్య అవగాహన ఉందన్న రేవంత్ రెడ్డి ఆరోపణలను పినరయి విజయన్ కొట్టిపారేశారు. కాంగ్రెస్ పార్టీయే బీజేపీకి అసలైన "బి-టీమ్" అని వ్యాఖ్యానించారు. "కేరళం, కేంద్ర ప్రభుత్వాల మధ్య అంతర్గత ఒప్పందం ఉందన్న రేవంత్ వాదన హాస్యాస్పదం. కేరళం అభివృద్ధిని అడుగడుగునా అడ్డుకుంటున్న కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేని చేతకాని కాంగ్రెస్ పార్టీయే బీజేపీకి అసలైన బి-టీమ్. ఈ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా మా రాష్ట్రంలో జరుగుతున్న తీవ్ర నిరసనలను ఆయన చూడలేదా..? లేక మా రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ద్రోహాన్ని ఆయన సమర్థిస్తున్నారా?" అని విజయన్ ప్రశ్నించారు.
ఈ సందర్భంగా నిజమైన పాలన, ప్రజా సంక్షేమం గురించి తెలుసుకునేందుకు కేరళకు రావాలంటూ రేవంత్‌రెడ్డిని పినరయి విజయన్ ఆహ్వానించారు. "జీతాలు, పెన్షన్లను పదేపదే ఆలస్యం చేసే ఒక ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న ముఖ్యమంత్రి.. కేరళకు నేర్పించాల్సింది ఏమీ లేదు. నిజమైన పాలన, ప్రజల సంక్షేమం గురించి పాఠాలు నేర్చుకోవడానికి తెలంగాణ ముఖ్యమంత్రిని మేము కేరళంకు సాదరంగా ఆహ్వానిస్తున్నాము" అని ఆయన పేర్కొన్నారు.
Also Read..
నాకు పార్టీ టికెట్ నిరాకరించలేదు.. నేనే పోటీ చేయడం లేదు : అన్నామలై
బెంగాల్లో ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలి.. అధికారులకు ఈసీ ఆదేశాలు
మేం యుద్ధంలో ఉన్నాం.. విమానాలు కూలినా ఇరాన్‌తో చర్చలు ఆగవు : ట్రంప్
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



