త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

K Annamalai | నాకు పార్టీ టికెట్ నిరాక‌రించ‌లేదు.. నేనే పోటీ చేయ‌డం లేదు : అన్నామ‌లై

K Annamalai | పార్టీ రిలీజ్ చేసిన అభ్య‌ర్థుల జాబితాలో త‌న పేరు లేక‌పోవ‌డంపై వ‌స్తున్న ఊహాగానాల‌పై అన్నామ‌లై (K Annamalai) శ‌నివారం స్పందించారు. రాబోయే త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తాను పోటీ చేయ‌డం లేద‌ని స్ప‌ష్టం చేశారు.

D

National | Published On Apr 4, 2026, 12.40 pm IST

K Annamalai | నాకు పార్టీ టికెట్ నిరాక‌రించ‌లేదు.. నేనే పోటీ చేయ‌డం లేదు : అన్నామ‌లై
Advertisement

K Annamalai | త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల (Tamil Nadu Polls) నేప‌థ్యంలో బీజేపీ 27 మంది అభ్య‌ర్థుల‌తో తొలి జాబితాను విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. ఈ జాబితాలో ఆ పార్టీ రాష్ట్ర మాజీ అధ్య‌క్షుడు కే అన్నామ‌లై (K Annamalai) పేరు లేక‌పోవ‌డం అంద‌రినీ షాక్‌కు గురి చేసింది. ఈ వ్య‌వ‌హారంపై ప‌లు ఊహాగానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అన్నామ‌లైకి క‌మ‌లం పార్టీ టికెట్ నిరాక‌రించిందంటూ వార్త‌లు గుప్పుమ‌న్నాయి. ఈ నేప‌థ్యంలో పార్టీ రిలీజ్ చేసిన అభ్య‌ర్థుల జాబితాలో త‌న పేరు లేక‌పోవ‌డంపై వ‌స్తున్న ఊహాగానాల‌పై అన్నామ‌లై శ‌నివారం స్పందించారు.

రాబోయే త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తాను పోటీ చేయ‌డం లేద‌ని స్ప‌ష్టం చేశారు. ఈ నిర్ణ‌యాన్ని పార్టీ కోర్ క‌మిటీకి ఇప్ప‌టికే తెలియ‌జేసిన‌ట్లు చెప్పారు. తాను ఏ నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేయబోనని లిఖితపూర్వకంగా తెలియజేసినట్లు పేర్కొన్నారు. చెన్నైలో నిర్వ‌హించిన విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడుతూ.. ఈ మేర‌కు స్ప‌ష్ట‌త‌నిచ్చారు. "నేను ఏ నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేయనని ఇప్పటికే పార్టీ కోర్ కమిటీకి లిఖితపూర్వకంగా తెలియజేశాను. పార్టీ నాకు టికెట్ నిరాకరించింది అనడం సరికాదు. ఆ వార్త‌ల్లో ఎలాంటి నిజం లేదు. నేనే పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నాను. నేను ఏ ఒక్క నియోజ‌క‌వ‌ర్గానికే ప‌రిమితం కాకుండా.. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీయే అభ్య‌ర్థుల విజ‌యం కోసం కృషి చేయాల‌ని నిర్ణ‌యించుకున్నాను" అని ఆయన అన్నారు. త‌న‌ నిర్ణ‌యాన్ని గౌర‌వించి, కూట‌మి అభ్య‌ర్థుల త‌ర‌ఫున ప్ర‌చారం చేసే అవ‌కాశం క‌ల్పించినందుకు బీజేపీ అధినాయ‌క‌త్వానికి ఈ సంద‌ర్భంగా అన్నామ‌లై కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు.

27 మంది అభ్య‌ర్థుల‌తో తొలి జాబితా.. బ‌రిలో త‌మిళి సై

త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో బీజేపీ శుక్ర‌వారం 27 మంది అభ్య‌ర్థుల‌తో తొలి జాబితాను విడుద‌ల చేసింది. ప్రధాన నియోజకవర్గాల్లో ఐదుగురు మహిళలకు పార్టీ అవకాశం కల్పించింది. పుదుచ్చేరి మాజీ ఎల్‌జీ, తెలంగాణ మాజీ గ‌వ‌ర్న‌ర్ త‌మిళిలై సౌంద‌ర‌రాజ‌న్‌ను మైలాపూర్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి బ‌రిలోకి దింపింది. మోదక్కురిచ్చి నుంచి కీర్తికా శివకుమార్, కోయంబత్తూరు ఉత్తరం నుంచి వనతి శ్రీనివాసన్, అరంతాంగి నుంచి క‌విత శ్రీకాంత్, విలవన్కోడ్ నుంచి ఎస్ విజయధ‌రణి పోటీ చేస్తున్నారు. గెలుపు అవకాశాలున్న స్థానాల్లో మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. దళిత ఓటర్లను ఆకర్షించే దిశగా ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాల్లో కూడా బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. రాసిపురం, అవినాశి, మనమదురై, వాసుదేవనల్లూరు వంటి స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టింది. ముఖ్యంగా కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్‌ను అవినాశి (ఎస్సీ రిజర్వ్) నుంచి బరిలోకి దింపడం గమనార్హం. కేంద్ర మంత్రిగా ఉన్న వ్యక్తి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం విశేషం.

Also Read..

మేం యుద్ధంలో ఉన్నాం.. విమానాలు కూలినా ఇరాన్‌తో చర్చలు ఆగవు : ట్రంప్‌

బెంగాల్‌​లో ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలి.. అధికారుల‌కు ఈసీ ఆదేశాలు

ఆర్టీసీలో అప్రెంటిస్​​షిప్.. ఇంజినీరింగ్‌, నాన్ ఇంజినీరింగ్ అభ్య‌ర్థుల‌కు అవ‌కాశం..

Advertisement
Advertisement