త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Abhijeet Dipke | ఢిల్లీని ప్రభుత్వం వార్ జోన్ గా ప్రకటించినందువల్లే బిజినెస్ లాస్..! నిరసనలు కారణం కాదు : అభిజీత్ దిప్కే

Abhijeet Dipke | శాంతియుత నిరసనల (peaceful protests) వల్ల వ్యాపారాలకు ఎన్నడూ నష్టం వాటిల్లద‌ని సీజేపీ వ్య‌వ‌స్థాప‌కుడు అభిజీత్ దిప్కే (Abhijeet Dipke) స్ప‌ష్టం చేశారు. ప్రభుత్వం ఒక నగరాన్ని పూర్తిగా ష‌ట్‌డౌన్ చేసి, ఇంటర్నెట్ సేవలను నిలిపివేసి, పౌరుల రాకపోకలను నియంత్రిస్తూ ఆ ప్రాంతాన్ని వార్ జోన్‌ (war zone)గా మార్చినప్పుడే వ్యాపారాలు దెబ్బతింటాయని వ్యాఖ్యానించారు.

D

National | Published On Oct 16, 2026, 3.51 pm IST

Abhijeet Dipke | ఢిల్లీని ప్రభుత్వం వార్ జోన్ గా ప్రకటించినందువల్లే బిజినెస్ లాస్..! నిరసనలు కారణం కాదు : అభిజీత్ దిప్కే
Advertisement

Abhijeet Dipke | త్రినేత్ర న్యూస్ : కాక్రోచ్ జ‌న‌తాపార్టీ నిర‌స‌న‌ల వ‌ల్ల త‌మ వ్యాపారాల‌కు న‌ష్టం వాటిల్లుతోందంటూ వ‌ర్త‌క‌ సంఘాలు వ్య‌క్తం చేసిన ఆందోళ‌న‌పై సీజేపీ వ్య‌వ‌స్థాప‌కుడు అభిజీత్ దిప్కే (Abhijeet Dipke) స్పందించారు. శాంతియుత నిర‌స‌న‌ల (peaceful protests) వ‌ల్ల వ్యాపారాలకు నష్టం వాటిల్లుతుందనడం సరికాదన్నారు. ప్ర‌భుత్వ చ‌ర్య‌ల వ‌ల్లే ఇబ్బందులు తలెత్తుతున్నాయని స్ప‌ష్టం చేశారు. ఈ మేర‌కు సోష‌ల్ మీడియాలో పోస్టు పెట్టారు.

శాంతియుత నిరసనల వల్ల వ్యాపారాలకు ఎన్నడూ నష్టం వాటిల్లద‌ని స్ప‌ష్టం చేశారు. ప్రభుత్వం ఒక నగరాన్ని పూర్తిగా ష‌ట్‌డౌన్ చేసి, ఇంటర్నెట్ సేవలను నిలిపివేసి, పౌరుల రాకపోకలను నియంత్రిస్తూ ఆ ప్రాంతాన్ని వార్ జోన్‌గా మార్చినప్పుడే వ్యాపారాలు దెబ్బతింటాయని వ్యాఖ్యానించారు. త‌మ‌ పార్టీ ఎప్పుడూ మహాత్మా గాంధీ బోధించిన అహింస, శాంతి మార్గాలకే కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ముంబై, పూణే, జైపూర్, లక్నో, బెంగళూరు, నాగ్‌పూర్ తదితర నగరాల్లో తాము చేపట్టిన నిరసనలన్నీ పూర్తిగా శాంతియుతంగానే సాగాయని పేర్కొన్నారు. జైపూర్‌లో నిరసన తెలుపుతున్న సమయంలో తనపై వ్యక్తిగతంగా దాడి జరిగిందని దిప్కే తెలిపారు. అయినప్పటికీ హింసకు హింసతో సమాధానం ఇవ్వకూడదనే ఉద్దేశంతో తాను ఎదురుదాడి చేయలేదని చెప్పుకొచ్చారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగ విలువ‌ల‌కే తాము కట్టుబడి ఉంటామని, ఎంత రెచ్చగొట్టినా రాజ్యాంగ విలువ‌లను వీడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.

"ప్రభుత్వ విధానాలను ప్రశ్నించడం, తప్పులను ఎత్తిచూపడం ప్రజాస్వామ్యంలో పౌరుల ప్రాథమిక హక్కు. అది అరాచ‌కం కాదు. నేడు అధికారంలో ఉన్న పార్టీయే ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు ద‌శాబ్దాల పాటూ నిర‌స‌న‌లు నిర్వ‌హించింది. వీధుల్లోకి వ‌చ్చి స‌మ‌స్య‌ల‌పై నాటి ప్ర‌భుత్వాల‌ను ప్ర‌శ్నించింది. అదే అప్పుడు ఆంక్ష‌లు, బెదిరింపులు, పోలీసు అణ‌చివేత‌లు వారిపై ప్ర‌యోగించి ఉంటే.. ఈ రోజు అధికార ప‌ద‌వుల్లో ఉన్న వారిలో చాలా మంది ఈ స్థాయికి చేరుకొని ఉండేవారే కాదు. మీరు ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు నిర‌స‌న‌ల‌ను ప్ర‌జాస్వామ్య హ‌క్కుగా కీర్తించి.. అధికారంలోకి వ‌చ్చాక అదే చ‌ర్య‌ను ప్ర‌జాశాంతికి ముప్పుగా ప‌రిగణించ‌డం ద్వంద్వ వైఖ‌రికి నిద‌ర్శ‌నం" అని దిప్కే వ్యాఖ్యానించారు.

Also Read..

డ్రగ్స్‌ను స్ప్రెడ్ చేస్తున్నది మీరే కదా..? అమిత్ షాకు కేజ్రీవాల్ స్ట్రాంగ్‌ కౌంట‌ర్‌

పంజాబ్‌లో డ్ర‌గ్స్ మాఫియా ఆగ‌డాలు ఆందోళ‌న‌క‌రం : అమిత్ షా

ద‌స‌రాకు ఊరెళ్తున్నారా..? ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి..!

Advertisement
Advertisement