త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Abhijeet Dipke | నాపై ఐబీ నిఘా.. న‌న్ను ఏదైనా చేయొచ్చు: అభిజీత్‌ దీప్కే

Abhijeet Dipke | కాక్రోచ్‌ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే (Abhijeet Dipke) సంచలన ఆరోపణలు చేశారు. తనపై ఇంటెలిజెన్స్‌ బ్యూరో (IB) నిఘా పెట్టింద‌ని, నంబర్‌ ప్లేట్లు లేని వాహనాలు తనను ఫాలో అవుతున్నాయని.. తనను ఏదైనా చేయొచ్చన్నారు.

G

National | Published On Oct 16, 2026, 7.56 am IST

Abhijeet Dipke | నాపై ఐబీ నిఘా.. న‌న్ను ఏదైనా చేయొచ్చు: అభిజీత్‌ దీప్కే
Advertisement

Abhijeet Dipke | త్రినేత్ర న్యూస్‌: కాక్రోచ్‌ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే (Abhijeet Dipke) సంచలన ఆరోపణలు చేశారు. తనపై ఇంటెలిజెన్స్‌ బ్యూరో (IB) నిఘా పెట్టింద‌ని, నంబర్‌ ప్లేట్లు లేని వాహనాలు తనను ఫాలో అవుతున్నాయని.. తనను ఏదైనా చేయొచ్చన్నారు. ఢిల్లీ పోలీసులు (Delhi Police) ఏ క్షణమైనా తనను అరెస్టు చేయ‌వ‌చ్చ‌ని, అయినా తాము వెనక్కి తగ్గేదే లేద‌ని స్పష్టం చేశారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను (Gyanesh Kumar) తొల‌గించాల‌ని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని కన్నాట్‌ ప్లేస్‌లో ఉన్న సెంట్రల్‌ పార్క్‌లో జాతీయ జెండా (Tiranga) ఎగురవేసేందుకు సీజేపీ `తిరంగా మార్చ్‌`కు (Tiranga march) పిలుపునిచ్చిన విష‌యం తెలిసిందే. తిరంగా మార్చ్‌కు సిద్ధ‌మ‌వుతున్న నేప‌థ్యంలో అభిజిత్ దిప్కేను ఢిల్లీ పోలీసులు గృహనిర్బంధంలోకి తీసుకునే అవకాశం ఉందన్న ఆరోపణల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

జెండా ఎగురవేయడం నేరమా?

జాతీయ జెండాను ఎగురవేయడం నేరమైతే జైలుకు వెళ్లడానికి కూడా సిద్ధమేనని దిప్కే ప్రకటించారు. తాము ప్రశాంతంగా వెళ్లి తిరంగాను ఎగురవేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. దీన్ని నేరంగా పరిగణిస్తే.. అంతకంటే దేశద్రోహం మరొకటి ఉండద‌న్నారు. ఈ దేశంలో జాతీయ జెండాను ఎగురవేయడానికి జైలుకు వెళ్లాల్సి వస్తే అందుకు సిద్ధంగా ఉన్నామ‌ని చెప్పారు. తాను నిరంతర నిఘా నీడలో ఉన్నానని, నంబర్ ప్లేట్లు లేని వాహనాలు తనను వెంబడిస్తున్నాయ‌ని చెప్పారు. ఐబీ అధికారులు తన ఇంటి వాచ్‌మెన్‌ను అడిగి తన వివరాలు తెలుసుకుంటున్నారని ఆరోపించారు. ఢిల్లీ పోలీసులు న‌న్ను ఏ క్ష‌ణ‌మైనా అరెస్టు చేయ‌వ‌చ్చ‌న్నారు. కానీ తాము వీటికి భయపడేది లేద‌ని ప్ర‌ధాని మోదీకి (PM Modi) చెప్పాలనుకుంటున్నా అని స్ప‌ష్టం చేశారు.

తిరంగా ప్ర‌ధానికి అంత ద్వేషం ఎందుకు

సౌరవ్ దాస్, అశుతోశ్‌ రాంకాను ఇప్పటికే అరెస్ట్ చేశారు. కేవలం జాతీయ జెండాను (National Flag) ఎగురవేసినందుకే ప్రజలను జైల్లో పెడుతున్నారని ఆరోపించారు. భారత ప్రధానికి తిరంగా అంటే అంత ద్వేషం ఎందుకు? ఆయనకు తిరంగా అంటే ద్వేషం ఉంటే, ఆయన ప్రధానిగా ఉండటానికి అర్హుడేనా? అని విమర్శించారు. దేశంలో అప్రకటిత అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) నడుస్తోందని, ఎమర్జెన్సీ విధిస్తే తన ప్రతిష్ట దెబ్బతింటుందనే భయంతోనే నరేంద్ర మోదీ దీనిని అధికారికంగా ప్రకటించడం లేదని ఆరోపించారు.

సెంట్రల్ పార్క్ మూసివేత

కాగా, నిరసన కార్యక్రమం జరగాల్సిన సెంట్రల్ పార్క్‌ను శుక్ర‌, శనివారాల్లో మూసివేస్తున్నట్లు న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (NDMC) ప్రకటించింది. దీంతో మరికొన్ని ప్రాంతాల్లో జెండా ఎగురవేయాలని నిర్ణయిస్తే ఆయా ప్రాంతాలన్నింటినీ మూసివేస్తారా? అభిజీత్ ప్రశ్నించారు. తాము 100 ప్రాంతాల్లో తిరంగాను ఎగురవేస్తామని చెబితే, ఆ 100 ప్రాంతాలనూ మూసివేస్తారా? అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అలాగే, ప్రధాని మోదీ ర్యాలీలో ఎవరైనా జాతీయ జెండాను ఎగురవేస్తే ఆ ర్యాలీని రద్దు చేస్తారా అని నిలదీశారు.

Advertisement
Advertisement