త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Arvind Kejriwal | డ్రగ్స్‌ను స్ప్రెడ్ చేస్తున్నది మీరే కదా..? అమిత్ షాకు కేజ్రీవాల్ స్ట్రాంగ్‌ కౌంట‌ర్‌

Arvind Kejriwal | పంజాబ్‌లో డ్రగ్స్ మాఫియా (drug mafia) పేట్రేగిపోతోంద‌ని, శాంతిభ‌ద్ర‌త‌ల‌ను కాపాడ‌టంలో సీఎం భ‌గ‌వంత్ మాన్ (CM Bhagwant Mann) నేతృత్వంలోని ఆప్ ప్ర‌భుత్వం విఫ‌ల‌మైందంటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) చేసిన వ్యాఖ్య‌ల‌కు ఆప్ జాతీయ క‌న్వీన‌ర్ అర‌వింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) తీవ్రంగా స్పందించారు. అదానీ పోర్ట్ (Adani ports) ద్వారా పంజాబ్‌లో డ్రగ్స్ ను స్ప్రెడ్ చేస్తున్నది మీరే కదా..? అంటూ షా పోస్టుకు గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చారు.

D

National | Published On Oct 16, 2026, 2.53 pm IST

Arvind Kejriwal | డ్రగ్స్‌ను స్ప్రెడ్ చేస్తున్నది మీరే కదా..? అమిత్ షాకు కేజ్రీవాల్ స్ట్రాంగ్‌ కౌంట‌ర్‌
Advertisement

Arvind Kejriwal | త్రినేత్ర న్యూస్ : పంజాబ్ (Punjab)లో శాంతిభద్రతల క్షీణత, డ్రగ్స్ మాఫియా (drug mafia), గ్యాంగ్‌స్టర్ల ఆగడాలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన విష‌యం తెలిసిందే. రాష్ట్రంలో శాంతిభ‌ద్ర‌త‌ల‌ను కాపాడ‌టంలో సీఎం భ‌గ‌వంత్ మాన్ (CM Bhagwant Mann) నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ (AAP) ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంద‌ని ఆరోపించారు. ఈ నేప‌థ్యంలో షా ఆరోప‌ణ‌ల‌పై ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అర‌వింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) తీవ్రంగా స్పందించారు. పంజాబ్‌లో డ్రగ్స్ ను స్ప్రెడ్ చేస్తున్నది మీరే కదా..? అంటూ షా పోస్టుకు గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చారు.

"అదానీ పోర్ట్ (Adani ports) ద్వారా పంజాబ్‌లో మ‌త్తుప‌దార్థాల‌ను వ్యాప్తి చేస్తున్న‌ది మీరే. గ్యాంగ్‌స్టర్లకు సబర్మతి జైలులో రక్షణ కల్పించింది మీరే. 2007-2017 మ‌ధ్య 'చిట్టా పార్టీ'తో కుమ్మక్కై పంజాబ్‌లో డ్రగ్స్ వ్యాప్తికి కారణం మీరే. ఇప్పుడు మ‌ళ్లీ అదే పార్టీతో చేతులు క‌లిపి పంజాబ్‌లో డ్రగ్స్ విక్రయించి వేల కోట్ల రూపాయలు సంపాదించాలని కలలు కంటున్నారా..? నేడు మీ బీజేపీ ప్రభుత్వాలు ఏళ్ల తరబడి అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే డ్ర‌గ్స్ బెడ‌ద ఎక్కువ‌గా ఉంది. ఆ రాష్ట్రాల్లో విచ్చ‌ల‌విడిగా మత్తుపదార్థాలు అమ్మినా ఇంకా మీకు తృప్తి కలగలేదా..? ఇప్పుడు మ‌ళ్లీ మీ చిట్టా పార్టీతో కలిసి పంజాబ్‌ను సర్వనాశనం చేయడానికి వచ్చారా..? పంజాబ్ జ‌లాలు, చండీగఢ్, పంజాబ్ యూనివర్సిటీలపై కేంద్రానికి వివ‌క్ష‌ ఉందనే విష‌యం ప్ర‌జ‌లంద‌రికీ తెలుసు. ఆ మూడు నల్ల వ్యవసాయ చట్టాలను మళ్లీ తీసుకురావాలని మీరు భావిస్తున్నారు. పంజాబ్ దీన్ని ఎప్ప‌టికీ జ‌ర‌గ‌నివ్వ‌దు" అంటూ కేజ్రీ తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు.

Also Read..

పంజాబ్‌లో డ్ర‌గ్స్ మాఫియా ఆగ‌డాలు ఆందోళ‌న‌క‌రం : అమిత్ షా

కాంగ్రెస్ తెచ్చిన క‌రువు అని ఎందుకు అంటున్నామో తెలుసా..? : కేటీఆర్

త‌మిళ‌నాడు మాజీ సీఎంగా త్రిష - ఎంజీఆర్ బ‌యోపిక్‌లో చెన్నై క్వీన్‌?

Advertisement
Advertisement