Malkajgiri Police | దసరాకు ఊరెళ్తున్నారా..? ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
Malkajgiri Police | దసరా( Dasara ) పండుగ వచ్చేస్తోంది. దీంతో నగర వాసులంతా తమ సొంతూర్లకు పయనమవుతున్నారు. ఇదే అదునుగా భావించి దొంగలు రెచ్చిపోయే ప్రమాదం ఉంది. చోరీలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సొంతూర్లకు వెళ్లే నగర వాసులు అప్రమత్తంగా ఉండాల్సిందే.
Malkajgiri Police | త్రినేత్ర న్యూస్ : దసరా( Dasara ) పండుగ వచ్చేస్తోంది. దీంతో నగర వాసులంతా తమ సొంతూర్లకు పయనమవుతున్నారు. ఇదే అదునుగా భావించి దొంగలు రెచ్చిపోయే ప్రమాదం ఉంది. చోరీలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సొంతూర్లకు వెళ్లే నగర వాసులు అప్రమత్తంగా ఉండాల్సిందే. తమ ఇంటికి తాళం వేసి వెళ్లేవారు.. తమ విలువైన వస్తువులను భద్రంగా ఉంచుకోవాలి. నివాసాల వద్ద సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని మల్కాజ్గిరి పోలీసులు సూచించారు. సోషల్ మీడియాలో మీ ప్రయాణ వివరాలను పంచుకోవద్దని హెచ్చరించారు. అత్యవసర సహాయం కోసం డయల్ 112కు కాల్ చేయాలని సూచించారు.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
- ఇంట్లో బంగారం, వెండి, నగదు పెట్టొద్దు. బ్యాంక్ లాకర్లోనే ఉంచాలి.
- సీసీటీవీ కెమెరా, అలారం, సెంట్రల్ లాక్ ఏర్పాటు చేసుకోవాలి.
- తాళం కనబడకుండా కర్టెన్ వేయండి.. బయట గొల్లం పెట్టొద్దు.
- ఒక గదిలో లైట్ ఆన్ చేసి ఉంచండి.. తలపుల ముందు చెప్పులు పెట్టండి.
- పేపర్ లేదా పాల వారికి సెలవు సమయంలో రావొద్దని చెప్పండి.
- ప్రయాణ వివరాలు సోషల్ మీడియాలో పంచుకోవద్దు.
- ఇంటి పక్కవారు.. నమ్మకమైన వారికి, స్థానిక పోలీసు స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలి.
- కొత్త వ్యక్తులు, డెలివరీ బాయ్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి.
- బస్సు, రైల్లో అపరిచితులు ఇచ్చే తినుబండారాలు తీసుకోవద్దు.
- మీకు ఎవరి మీదనైనా అనుమానం వస్తే 100 లేదా 112 టోల్ ఫ్రీ నంబర్‌కు కానీ, రాచకొండ పోలీసు కంట్రోల్ రూమ్ 8712662666కు లేదా వాట్సాప్ నంబర్ 8712662111కు డయల్ చేయండి.

తాజావార్తలు
- ●Janhvi Kapoor | రొమాంటిక్ థ్రిల్లర్ సినిమాలో విలన్‌గా జాన్వీకపూర్ - సైలెంట్‌గా సెట్స్‌పైకి బాలీవుడ్ మూవీ
- ●Google | భూకంప హెచ్చరికలు.. 200కు పైగా దేశాలకు సేవలను విస్తరించిన గూగుల్..
- ●Gadwal | ఎస్సై వేధింపులతో ఓ యువకుడు ఆత్మహత్య
- ●Arvind Kejriwal | డ్రగ్స్‌ను స్ప్రెడ్ చేస్తున్నది మీరే కదా..? అమిత్ షాకు కేజ్రీవాల్ స్ట్రాంగ్ కౌంటర్
- ●Amit Shah | పంజాబ్‌లో డ్రగ్స్ మాఫియా ఆగడాలు ఆందోళనకరం : అమిత్ షా
- ●KTR | కాంగ్రెస్ తెచ్చిన కరువు అని ఎందుకు అంటున్నామో తెలుసా..? : కేటీఆర్

Janhvi Kapoor | రొమాంటిక్ థ్రిల్లర్ సినిమాలో విలన్‌గా జాన్వీకపూర్ - సైలెంట్‌గా సెట్స్‌పైకి బాలీవుడ్ మూవీ

Google | భూకంప హెచ్చరికలు.. 200కు పైగా దేశాలకు సేవలను విస్తరించిన గూగుల్..

Gadwal | ఎస్సై వేధింపులతో ఓ యువకుడు ఆత్మహత్య

Arvind Kejriwal | డ్రగ్స్‌ను స్ప్రెడ్ చేస్తున్నది మీరే కదా..? అమిత్ షాకు కేజ్రీవాల్ స్ట్రాంగ్ కౌంటర్





