Amit Shah | పంజాబ్‌లో డ్రగ్స్ మాఫియా ఆగడాలు ఆందోళనకరం : అమిత్ షా
Amit Shah | పంజాబ్‌లో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా (drug mafia), గ్యాంగ్స్టర్ల ఆగడాలు విపరీతంగా పెరిగిపోయాయన్నారు. శాంతిభద్రతలను కాపాడటంలో సీఎం భగవంత్ మాన్ (CM Bhagwant Mann) నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ (AAP) ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.
Amit Shah | త్రినేత్ర న్యూస్ : పంజాబ్ (Punjab)లో శాంతిభద్రతల క్షీణత, డ్రగ్స్ మాఫియా (drug mafia), గ్యాంగ్స్టర్ల ఆగడాలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో డ్రగ్స్ నెట్‌వర్క్‌లను అణచివేయడంలో, శాంతిభద్రతలను కాపాడటంలో సీఎం భగవంత్ మాన్ (CM Bhagwant Mann) నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ (AAP) ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా అమిత్ షా సంచలన ట్వీట్ పెట్టారు.
పంజాబ్ రాష్ట్రంలో ప్రస్తుతం మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వ్యవస్థీకృత నేరాల పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మన్సా జిల్లాలో డ్రగ్స్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న సామాజిక కార్యకర్త పర్విందర్ సింగ్ ఝోటా దారుణ హత్య, దిర్బాలో ఒత్తిడి తట్టుకోలేక ఓ తండ్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటనలను షా ప్రస్తావించారు. ఆయా ఘటనలు రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయన్నారు. ఈ రెండు ఘటనలపై భగవంత్ మాన్ నేతృత్వంలోని పంజాబ్ ప్రభుత్వం నుంచి వివరణ కోరనున్నట్లు తెలిపారు.
డ్రగ్స్‌ను వ్యతిరేకించే వారి భద్రత ప్రశ్నార్థకంగా మారిందన్నారు. పంజాబ్ ప్రజల భద్రతకు ఎవరు బాధ్యత వహిస్తారంటూ..? ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌ను షా ప్రశ్నించారు. ప్రజలకు కేవలం హామీలు, ప్రకటనలు కాదని, ఫలితాలు, సమాధానాలు కావాలని హితవుపలికారు. డ్రగ్ నెట్‌వర్క్‌లపై కఠినమైన చర్యలు తీసుకోవాలన్నారు. నేరస్థులకు అందుతున్న రాజకీయ అండదండలపై నిష్పక్షపాత విచారణ జరగాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా తమ పార్టీ అధికారంలోకి వస్తే పంజాబ్‌ను డ్రగ్స్ రహిత, గ్యాంగ్‌స్టర్ రహిత, సురక్షిత రాష్ట్రంగా మారుస్తామని షా ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
पंजाब आज नशे, गैंगस्टरवाद व संगठित अपराध के बढ़ते खतरे से जूझ रहा है। भगवंत मान सरकार के सामने सबसे बड़ा सवाल है कि आखिर पंजाब की जनता की सुरक्षा की जिम्मेदारी कौन निभाएगा?
दिरबा में एक पिता का दबाव में जहर खा लेना और मानसा में नशे के खिलाफ आवाज उठाने वाले परविंदर सिंह झोटा की दिनदहाड़े हत्या ने पंजाब की कानून-व्यवस्था पर गंभीर सवाल खड़े कर दिए हैं। परविंदर के पिता ने AAP सरकार और उनके विधायक पर गंभीर आरोप लगाए हैं। गृह मंत्रालय भी इन दोनों घटनाओं पर पंजाब सरकार से जवाब माँगेगा।
पंजाब में नशे का कारोबार फल-फूल रहा है, संगठित अपराध का खतरा बढ़ रहा है और नशे के खिलाफ आवाज उठाने वालों की सुरक्षा पर सवाल खड़े हो रहे हैं।
भगवंत मान जी, पंजाब की जनता को प्रचार नहीं, जवाब, घोषणाएँ नहीं, परिणाम, नशे के नेटवर्क पर निर्णायक प्रहार और अपराधियों को मिलने वाले किसी भी राजनीतिक संरक्षण की निष्पक्ष जाँच चाहिए।
मैं आज पंजाब की जनता के सामने अपना संकल्प दोहराता हूँ कि पंजाब में हमारी सरकार बनने पर हम नशामुक्त, गैंगस्टरमुक्त और सुरक्षित पंजाब बनाने के लिए पूरी ताकत से काम करेंगे। हमारा लक्ष्य स्पष्ट है - नशे के कारोबार पर प्रहार, युवाओं के भविष्य की रक्षा, अपराधियों पर कठोर कार्रवाई और कानून का ऐसा राज, जिसमें कोई भी नागरिक भय के साये में जीने को मजबूर न हो।
— Amit Shah (@AmitShah) October 16, 2026
Also Read..
వ్యాపారులకు నష్టం జరిగితే చూస్తూ ఊరుకోం.. సీజేపీ నిరసనలపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్ తెచ్చిన కరువు అని ఎందుకు అంటున్నామో తెలుసా..? : కేటీఆర్
తమిళనాడు మాజీ సీఎంగా త్రిష - ఎంజీఆర్ బయోపిక్‌లో చెన్నై క్వీన్?
సంబంధిత వార్తలు

Abhijeet Dipke CJP | జ్ఞానేష్ కుమార్ కోసం సొంత దేశ ప్రజలపైనే యుద్ధం చేస్తున్నారు
అక్టోబర్ 15, 2026

Jairam Ramesh | 14 కోట్ల మంది భారతీయులు చొరబాటుదారులా? ఓటర్ల జాబితా సవరణపై అమిత్ షాకు కాంగ్రెస్ 3 సూటి ప్రశ్నలు
అక్టోబర్ 14, 2026

Rahul Gandhi | న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు: రాహుల్ గాంధీ
అక్టోబర్ 13, 2026
తాజావార్తలు
- ●MLA Padi Kaushik Reddy | 24 గంటలు కాదు.. 6 గంటలే కరెంట్ ఇస్తున్నారు
- ●WhatsApp | వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. అకౌంట్ లేకున్నా కాల్స్‌లో చేరొచ్చు..
- ●Kalvakuntla Kavitha | విద్యుత్ కేంద్రాలు ప్రైవేటుకు ధారదత్తం : కల్వకుంట్ల కవిత
- ●Personal Loan | ఆదాయ ధ్రువీకరణ పత్రాలు లేకుండానే పర్సనల్ లోన్.. అర్హత ఎలా నిర్ణయిస్తారంటే..?
- ●Ponnam Prabhakar | హుస్నాబాద్‌కు దసరా కానుక.. నూతన కబడ్డీ అకాడమీకి జీవో జారీ: పొన్నం ప్రభాకర్
- ●Supreme Court | వ్యాపారులకు నష్టం జరిగితే చూస్తూ ఊరుకోం.. సీజేపీ నిరసనలపై సుప్రీం కీలక వ్యాఖ్యలు

MLA Padi Kaushik Reddy | 24 గంటలు కాదు.. 6 గంటలే కరెంట్ ఇస్తున్నారు

WhatsApp | వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. అకౌంట్ లేకున్నా కాల్స్‌లో చేరొచ్చు..

Kalvakuntla Kavitha | విద్యుత్ కేంద్రాలు ప్రైవేటుకు ధారదత్తం : కల్వకుంట్ల కవిత

Personal Loan | ఆదాయ ధ్రువీకరణ పత్రాలు లేకుండానే పర్సనల్ లోన్.. అర్హత ఎలా నిర్ణయిస్తారంటే..?



