Supreme Court | వ్యాపారులకు నష్టం జరిగితే చూస్తూ ఊరుకోం.. సీజేపీ నిరసనలపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
Supreme Court | సీజేపీ నిరసనల నేపథ్యంలో సెంట్రల్ పార్క్‌ను మూసివేస్తూ ఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (NDMC) తీసుకున్న నిర్ణయం కారణంగా తమ వ్యాపారాలకు తీవ్ర నష్టం వాటిల్లుతోందంటూ ఢిల్లీ వర్తకుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ మేరకు సుప్రీంకోర్టు (Supreme Court)లో పిటిషన్ దాఖలు చేశాయి. అయితే, ఈ పిటిషన్‌పై తక్షణ ఉత్తర్వులు ఇచ్చేందుకు సీజేఐ ధర్మాసనం నిరాకరించింది.
Supreme Court | త్రినేత్ర న్యూస్ : కాక్రోచ్ జనతాపార్టీ తిరంగా నిరసన నేపథ్యంలో ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ సెంట్రల్ పార్క్‌ను మూసివేస్తూ ఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (NDMC) జారీ చేసిన ఉత్తర్వులను వ్యాపార సంఘాలు సుప్రీంకోర్టు (Supreme Court)లో సవాల్ చేశాయి. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశాయి. ఈ పిటిషన్‌పై తక్షణ విచారణ జరిపేందుకు సుప్రీం ధర్మాసనం నిరాకరించింది. అయితే, నిరసనల వల్ల వ్యాపార కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడితే న్యాయస్థానం తన అధికారాలను ఉపయోగించాల్సి ఉంటుందని హెచ్చరించింది.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను (CEC Gyanesh Kumar) తొలగించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్‌లో ఉన్న సెంట్రల్ పార్క్‌లో జాతీయ జెండా (Tiranga) ఎగురవేసేందుకు సీజేపీ `తిరంగా మార్చ్`కు (Tiranga march) పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సెంట్రల్ పార్క్‌ను శుక్ర, శనివారాల్లో మూసివేస్తున్నట్లు న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (NDMC) ప్రకటించింది. ఎన్డీఎమ్సీ నిర్ణయంపై వ్యాపార వర్గాలు భగ్గుమన్నాయి. పండుగ, పెళ్లిళ్ల సీజన్ల సమయంలో ఢిల్లీలో జరుగుతున్న నిరసనల వల్ల తమ వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేశాయి.
ఇది కూడా చదవండి.. నాపై ఐబీ నిఘా.. నన్ను ఏదైనా చేయొచ్చు: అభిజీత్ దీప్కే
రూ.200 కోట్ల నష్టం
కన్నాట్ ప్లేస్ మార్కెట్లో సెంట్రల్ పార్క్ వద్ద సీజేపీ తలపెట్టిన నిరసనల వల్ల రోజువారీగా రూ.200 కోట్ల వ్యాపారం దెబ్బతినే ప్రమాదం ఉందని పిటిషన్లు పేర్కొన్నారు. అక్టోబర్ 10 నుంచి జరుగుతున్న నిరసనల కారణంగా వ్యాపారులు ఏకంగా రూ. 2,000 కోట్ల మేర నష్టపోయినట్లు తెలిపారు. కేవలం అక్టోబర్ 10 నాటి ఒక్క నిరసన కారణంగానే కన్నాట్ ప్లేస్ ప్రాంతంలో తమకు రూ. 150 కోట్ల నుంచి రూ. 200 కోట్ల వరకు నష్టం వాటిల్లిందని న్యూఢిల్లీ ట్రేడర్స్ అసోసియేషన్ కోర్టుకు తెలిపింది. ఈ సందర్భంగా పిటిషనర్లు కోర్టు ముందు మూడు ప్రధాన డిమాండ్లు ఉంచారు.
వ్యాపారుల డిమాండ్లు ఇవే..
2026 అక్టోబర్ నుంచి 2027 జనవరి వరకు ఈ మూడు నెలలు ఢిల్లీలోని ప్రధాన మార్కెట్ల ప్రాంతాల్లో ధర్నాలు, నిరసనలు, ర్యాలీలు, రోడ్డు దిగ్బంధనాల వల్ల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలని కోరారు. వాణిజ్య కేంద్రాలు, సిటీకి దూరంగా నిరసనల కోసం తగిన ప్రదేశాలను గుర్తించి, అధికారికంగా నోటిఫై చేయాలని పేర్కొన్నారు. అంతేకాదు, ఢిల్లీ లాంటి రద్దీగా ఉండే మహానగరంలో నిరసన తెలిపే రాజ్యాంగ హక్కును, పౌరుల జీవనోపాధి, వ్యాపారాలు, ప్రజా రవాణా హక్కులను సమతుల్యం చేస్తూ ఢిల్లీలో నిరసనల నిర్వహణ కోసం ఒక ఎస్ఓపీని (SOP) రూపొందించాలని కోరారు.
వారి కష్టనష్టాలు మాకు అర్థమవుతున్నాయ్
ఈ పిటిషన్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్య కాంత్ (CJI Surya Kant), జస్టిస్ జాయ్‌మాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా సీజేఐ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. నిరసనపై తక్షణ ఆదేశాలు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. "ఈ పండుగ రోజుల్లో చిన్న దుకాణదారులు తమ జీవనోపాధిని పొందుతారనే విషయం మాకు తెలుసు. కుటుంబాలు ఎదుర్కొనే కష్టనష్టాలు మాకు అర్థమవుతున్నాయి. ప్రజా సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ వివేకంతో వ్యవహరిస్తారని ఆశిస్తున్నాం" అని సీజేఐ సూర్య కాంత్ వ్యాఖ్యానించారు. అధికారుల నిర్ణయంతో చిరు వ్యాపారులకు నష్టం వాటిల్లితే తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
చూస్తూ ఊరుకోం..
"ఒకరు నిరసన తెలపాలనుకుంటున్నారు, మరొకరు వేరుశనగలు అమ్ముకోవాలనుకుంటున్నారు, ఇంకొకరు శాంతిభద్రతలు కోరుకుంటున్నారు.. ఇవన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి" అని విచారణ సందర్భంగా జస్టిస్ జాయ్మాల్య బాగ్చి పేర్కొన్నారు. నిరసనల కారణంగా చిరు వ్యాపారులు నష్టపోకూడదని పేర్కొన్నారు.
NDMC జారీ చేసిన పార్క్ మూసివేత ఉత్తర్వులు చట్టవిరుద్ధమని తేలితే వ్యాపారులకు జరిగిన నష్టానికి చట్టప్రకారం పరిహారం చెల్లించే అంశాలను న్యాయస్థానం పరిశీలిస్తుందని స్పష్టం చేశారు. అనంతరం ఈ పిటిషన్‌ను దసరా సెలవుల తర్వాత అక్టోబర్ 26 లేదా 27 తేదీల్లో విచారిస్తామని సీజేఐ ధర్మాసనం తెలిపింది.
Also Read..
నెలాఖరులో పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు..? మళ్లీ తెరపైకి డీలిమిటేషన్, మహిళా బిల్లులు
బంగ్లాదేశ్ తరహాలో పాలన మార్పునకు కాంగ్రెస్ కుట్ర : రాజ్‌నాథ్ సింగ్
ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ల కోసం రూ.425 కోట్లు: పొన్నం ప్రభాకర్
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Special Parliament Session | నెలాఖరులో పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు..? మళ్లీ తెరపైకి డీలిమిటేషన్, మహిళా బిల్లులు
అక్టోబర్ 16, 2026

Abhijeet Dipke | నాపై ఐబీ నిఘా.. నన్ను ఏదైనా చేయొచ్చు: అభిజీత్ దీప్కే
అక్టోబర్ 16, 2026

Abhijeet Dipke CJP | జ్ఞానేష్ కుమార్ కోసం సొంత దేశ ప్రజలపైనే యుద్ధం చేస్తున్నారు
అక్టోబర్ 15, 2026
తాజావార్తలు
- ●MLC Dasoju Sravan | ఏఈఈ పరీక్షలను రీషెడ్యూల్ చేయాలి: దాసోజు శ్రవణ్
- ●Ponnam Prabhakar | ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ల కోసం రూ.425 కోట్లు: పొన్నం ప్రభాకర్
- ●Tesla Roadster | ఇక గాల్లో ఎగరనున్న కార్లు.. ఎలాన్ మస్క్ సంచలనం..
- ●RS Praveen Kumar | మేడిగడ్డ విషయంలో కేసు నమోదు చేయకపోవడం కూడా నేరమే: ఆర్ఎస్ ప్రవీణ్
- ●Rajnath Singh | బంగ్లాదేశ్ తరహాలో పాలన మార్పునకు కాంగ్రెస్ కుట్ర : రాజ్‌నాథ్ సింగ్
- ●Reliance Industries | స్టార్‌లింక్‌కు స్వాగతం.. పోటీకి భయపడం: రిలయన్స్

MLC Dasoju Sravan | ఏఈఈ పరీక్షలను రీషెడ్యూల్ చేయాలి: దాసోజు శ్రవణ్

Ponnam Prabhakar | ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ల కోసం రూ.425 కోట్లు: పొన్నం ప్రభాకర్

Tesla Roadster | ఇక గాల్లో ఎగరనున్న కార్లు.. ఎలాన్ మస్క్ సంచలనం..

RS Praveen Kumar | మేడిగడ్డ విషయంలో కేసు నమోదు చేయకపోవడం కూడా నేరమే: ఆర్ఎస్ ప్రవీణ్



