Janhvi Kapoor | రొమాంటిక్ థ్రిల్లర్ సినిమాలో విలన్‌గా జాన్వీకపూర్ – సైలెంట్‌గా సెట్స్‌పైకి బాలీవుడ్ మూవీ
జాన్వీకపూర్, శ్రీలీల హీరోయిన్లుగా బాలీవుడ్లో ఓ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ రాబోతుంది. సైలెంట్‌గా ఈ సినిమా శుక్రవారం సెట్స్‌పైకి వచ్చింది. నైనిటాల్లో షూటింగ్ మొదలైంది. ఉమేష్ బిస్త్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల నెగెటివ్ షేడ్స్‌తో కూడిన పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం.
Entertainment | Published On Oct 16, 2026, 3.18 pm IST
Janhvi Kapoor | రామ్‌చరణ్ పెద్ది తర్వాత సినిమాలకు స్మాల్ గ్యాప్ ఇచ్చింది శ్రీదేవి తనయ జాన్వీకపూర్. పెద్దిలో చేసిన అచ్చియమ్మ పాత్రపై దారుణంగా విమర్శలు రావడంతో కథల ఎంపికలో తన పంథా మార్చేసింది. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ గ్లామర్ పాత్రలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నీ సుందరి నాలుగైదు నెలల తర్వాత మళ్లీ కెమెరా ముందుకొచ్చింది. ఓ బాలీవుడ్ మూవీ షూటింగ్‌ను సైలెంట్‌గా మొదలుపెట్టింది జాన్వీకపూర్.
రొమాంటిక్ థ్రిల్లర్...
జాన్వీకపూర్, శ్రీలీల హీరోయిన్లుగా హిందీలో ఓ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ తెరకెక్కుతోంది. ఉమేష్ బిస్త్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ శుక్రవారం నుంచి నైనిటాల్లో మొదలైంది. మొదటి షెడ్యూల్లో జాన్వీకపూర్, శ్రీలీలలపై డైరెక్టర్ కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నట్లు సమాచారం.
నెగెటివ్ పాత్రలో...
ఒకే అబ్బాయితో ప్రేమలో పడిన ఇద్దరమ్మాయిలతో కథతో ఊహించని ట్విస్ట్‌లు, టర్న్‌లతో సర్ప్రైజింగ్గా ఈ బాలీవుడ్ మూవీ ఉంటుందని మేకర్స్ చెబుతోన్నారు. ఇందులో జాన్వీకపూర్ పాత్ర నెగెటివ్ షేడ్స్‌తో సాగుతుందని అంటున్నారు. నటిగా తనను తాను కొత్తగా ఆవిష్కరించుకునే అవకాశం కోవడంతోనే విలన్‌గా నటించడానికి ఈ బాలీవుడ్ బ్యూటీ అంగీకరించినట్లు టాక్.
సెకండ్ మూవీ...
గ్లామర్, యాక్టింగ్ విషయంలో జాన్వీకపూర్, శ్రీలీల పాత్రలు పోటాపోటీగా సాగుతాయని సమాచారం. శ్రీలీలకు బాలీవుడ్లో ఇది సెకండ్ మూవీ. సిద్ధార్థ్ గుప్తా హీరోగా నటిస్తోన్న ఈ మూవీని ఏక్తాకపూర్, గునీత్ మోంగా కలిసి నిర్మిస్తున్నారు. మూడు నెలల్లో షూటింగ్‌ను పూర్తిచేసి వచ్చే ఏడాది ప్రథమార్థంలో థియేటర్లలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ప్రస్తుతం బాలీవుడ్లో కార్తీక్ ఆర్యన్, అనురాగ్ బసు కాంబినేషన్లో రూపొందుతోన్న తూ మేరీ జిందగీ హైలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాతోనే బాలీవుడ్‌లోకి ఆమె అరంగేట్రం చేయాల్సింది. కానీ ఈ రొమాంటిక్ లవ్‌స్టోరీ కంటే ముందే జాన్వీకపూర్, శ్రీలీల సినిమా రిలీజయ్యే అవకాశం ఉందని అంటున్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Google | భూకంప హెచ్చరికలు.. 200కు పైగా దేశాలకు సేవలను విస్తరించిన గూగుల్..
- ●Gadwal | ఎస్సై వేధింపులతో ఓ యువకుడు ఆత్మహత్య
- ●Arvind Kejriwal | డ్రగ్స్‌ను స్ప్రెడ్ చేస్తున్నది మీరే కదా..? అమిత్ షాకు కేజ్రీవాల్ స్ట్రాంగ్ కౌంటర్
- ●Amit Shah | పంజాబ్‌లో డ్రగ్స్ మాఫియా ఆగడాలు ఆందోళనకరం : అమిత్ షా
- ●KTR | కాంగ్రెస్ తెచ్చిన కరువు అని ఎందుకు అంటున్నామో తెలుసా..? : కేటీఆర్
- ●Trisha | తమిళనాడు మాజీ సీఎంగా త్రిష - ఎంజీఆర్ బయోపిక్‌లో చెన్నై క్వీన్?

Google | భూకంప హెచ్చరికలు.. 200కు పైగా దేశాలకు సేవలను విస్తరించిన గూగుల్..

Gadwal | ఎస్సై వేధింపులతో ఓ యువకుడు ఆత్మహత్య

Arvind Kejriwal | డ్రగ్స్‌ను స్ప్రెడ్ చేస్తున్నది మీరే కదా..? అమిత్ షాకు కేజ్రీవాల్ స్ట్రాంగ్ కౌంటర్

Amit Shah | పంజాబ్‌లో డ్రగ్స్ మాఫియా ఆగడాలు ఆందోళనకరం : అమిత్ షా






