త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gadwal | ఎస్సై వేధింపులతో ఓ యువకుడు ఆత్మహత్య

Gadwal | ఎస్సై వేధింపులు భ‌రించ‌లేక‌ ఓ యువ‌కుడు ఆత్మ‌హ‌త్య( Suicide ) చేసుకున్నాడు. ఈ ఘ‌ట‌న జోగులాంగ గద్వాల జిల్లాలోని ధ‌రూర్ మండ‌ల ప‌రిధిలో వెలుగు చూసింది.

S

Telangana | Published On Oct 16, 2026, 2.54 pm IST

Gadwal | ఎస్సై వేధింపులతో ఓ యువకుడు ఆత్మహత్య
Advertisement

Gadwal | త్రినేత్ర న్యూస్ : ఎస్సై వేధింపులు భ‌రించ‌లేక‌ ఓ యువ‌కుడు ఆత్మ‌హ‌త్య( Suicide ) చేసుకున్నాడు. ఈ ఘ‌ట‌న జోగులాంగ గద్వాల జిల్లాలోని ధ‌రూర్ మండ‌ల ప‌రిధిలో వెలుగు చూసింది. ఈ నెల 9న పురుగుల మందు సేవించ‌గా, చికిత్స పొందుతూ శుక్ర‌వారం ఉద‌యం ప్రాణాలు కోల్పోయాడు బాధితుడు.

బాధితుడు స్టేట్‌మెంట్ ఇలా..

గ్రామంలో జ‌రిగిన ఓ చిన్న గొడ‌వ‌కు రాజకీయ రంగు పులిమి త‌న‌ను గంట‌ల త‌ర‌బ‌డి పోలీసు స్టేష‌న్‌లో నిర్బంధించి ఇబ్బంది పెట్టినందుకే, తీవ్ర మ‌న‌స్తాపానికి గురై పురుగుల మందు తాగాను. ప్ర‌స్తుత స‌ర్పంచ్ ముష్టి విజ‌య్ పోలీసుల‌కు ఫోన్ చేశాడు. ఆ త‌ర్వాత న‌న్ను ఎస్సై, కానిస్టేబుల్ క‌లిసి పోలీసు స్టేష‌న్‌లోనే గంట‌ల త‌ర‌బ‌డి నిర్బంధించారు. ఇబ్బందుల‌కు గురి చేశారు. దాంతో తీవ్ర మనస్తాపానికి గురై పురుగుల మందు తాగాను అని పోలీసుల‌కు బాధితుడు వీరేశ్ స్టేట్‌మెంట్ ఇచ్చాడు.

ఈ ఘటనపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఈ వ్యవహారానికి సంబంధించి గద్వాల సర్కిల్ ఇన్‌స్పెక్టర్(సీఐ) శ్రీనివాసులు ఆదివారం నేరుగా కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్న బాధితుడు వీరేష్‌ను కలిసి వివరాలు ఆరా తీసి స్టేట్‌మెంట్ రికార్డు చేశారు.

Advertisement
Advertisement