Cotton Imports | టెక్స్‌టైల్స్ రంగానికి కేంద్రం భారీ ఊరట.. పత్తి దిగుమతులపై సుంకం మినహాయింపు గడువు పొడిగింపు
Cotton Imports | కేంద్రం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. పత్తి దిగుమతులపై (Cotton Imports) సుంకం మినహాయింపు గడువును 2026 డిసెంబర్ 31 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Cotton Imports | త్రినేత్ర న్యూస్ : దేశీయ వస్త్ర పరిశ్రమకు (Textile Industry) కేంద్రం భారీ ఊరట కల్పిస్తూ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. పత్తి దిగుమతులపై (Cotton Imports) సుంకం (customs duty) మినహాయింపు గడువును 2026 డిసెంబర్ 31 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న గడువు 2026 అక్టోబర్ 31తో ముగియనుండగా.. తాజాగా మరో 2 నెలల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
కేంద్రం తాజా నిర్ణయం వల్ల దేశీయ మార్కెట్‌లో ముడి పత్తి కొరత తీరడంతో పాటు టెక్స్‌టైల్ పరిశ్రమ ఎదుర్కొంటున్న ఉత్పత్తి వ్యయాల భారం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. అంతేకాదు, దేశీయ మార్కెట్లో పత్తి లభ్యత మెరుగుపడి, ఈ ముడి సరకుపై ఆధారపడి పనిచేసే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు చేయూత ఇచ్చినట్టైంది. తయారీ రంగానికి ముడిసరకు నిరంతరం అందేలా చూడటం ద్వారా, తయారీదారులు సేకరణ ఖర్చులను సమర్థవంతంగా నిర్వహించుకోవడానికి ఈ నిర్ణయం ఎంతగానో దోహదపడుతుంది. ఈ పన్ను మినహాయింపు వల్ల అంతిమంగా వస్త్రాల తయారీ ఖర్చులు తగ్గి, వినియోగదారులకు కూడా తక్కువ ధరలకే దుస్తులు లభించే అవకాశం ఉంటుంది.
To augment the availability of cotton for the Indian textile sector, the Central Government has extended the existing customs duty exemption on imports of cotton till 31st December, 2026 (earlier valid till 31st October, 2026).
The extension is expected to help reduce input costs across the textile and apparel sector, thereby providing targeted relief to manufacturers and consumers, while also keeping the interests of domestic farmers in mind. Overall, the measure is anticipated to have a positive impact on the performance of the domestic textile industry, especially small and medium enterprises, by ensuring better availability of cotton in the market. Notification no. 35/2026 - Customs dated 30th October 2026 has been issued in this regard.
— ANI (@ANI) October 31, 2026
Also Read..
భారత్‌పై పాక్ గెలుపు.. ప్రధాని షరీఫ్‌పై నెట్టింట ట్రోల్స్
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Shehbaz Sharif | భారత్‌పై పాక్ గెలుపు.. ప్రధాని షరీఫ్‌పై నెట్టింట ట్రోల్స్
- ●Rain Alert | రానున్న మూడు రోజులు వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ
- ●PM Modi | జీఎస్ఎల్వీ ప్రయోగం విజయవంతం.. ప్రధాని మోదీ అభినందన
- ●Palak Tiwari | మూడేళ్ల ప్రేమకు బ్రేకప్.. పాలక్ తివారీ, ఇబ్రహీం అలీఖాన్ విడిపోయారా?
- ●AEES Teaching Recruitment | అటామిక్ ఎనర్జీ ఎడ్యుకేషన్ సొసైటీలో టీచర్ ఉద్యోగాలు.. నవంబర్ 2 నుంచి దరఖాస్తులు
- ●Massive Fire | షూ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. నలుగురు దుర్మరణం

Shehbaz Sharif | భారత్‌పై పాక్ గెలుపు.. ప్రధాని షరీఫ్‌పై నెట్టింట ట్రోల్స్

Rain Alert | రానున్న మూడు రోజులు వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ

PM Modi | జీఎస్ఎల్వీ ప్రయోగం విజయవంతం.. ప్రధాని మోదీ అభినందన

Palak Tiwari | మూడేళ్ల ప్రేమకు బ్రేకప్.. పాలక్ తివారీ, ఇబ్రహీం అలీఖాన్ విడిపోయారా?



