త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PM Modi | ఏక్తా దివ‌స్‌.. ప‌టేల్ విగ్ర‌హానికి పుష్పాంజ‌లి ఘ‌టించిన ప్ర‌ధాని మోదీ

PM Modi | స‌ర్దార్ వ‌ల్ల‌భ్‌భాయ్ ప‌టేల్ (Sardar Vallabhbhai Patel) 151వ జ‌యంతి నేడు. గుజరాత్‌లోని కేవడియాలో (ఏక్తాన‌గ‌ర్‌లో) ఉన్న ఐక్య‌తా విగ్ర‌హాన్ని (Statue of Unity) ప్ర‌ధాని మోదీ (PM Modi) సంద‌ర్శించారు. అక్క‌డ పుష్పాంజ‌లి ఘ‌టించారు.

D

National | Published On Oct 31, 2026, 11.18 am IST

PM Modi | ఏక్తా దివ‌స్‌.. ప‌టేల్ విగ్ర‌హానికి పుష్పాంజ‌లి ఘ‌టించిన ప్ర‌ధాని మోదీ
Advertisement

PM Modi | త్రినేత్ర న్యూస్ : భారతదేశపు తొలి ఉప ప్రధాని, హోంమంత్రి అయిన ఉక్కు మనిషి స‌ర్దార్ వ‌ల్ల‌భ్‌భాయ్ ప‌టేల్ (Sardar Vallabhbhai Patel) 151వ జ‌యంతి నేడు. ఈ సంద‌ర్భంగా దేశ‌వ్యాప్తంగా ఏక్తా దివ‌స్ (Ekta Diwas ) వేడుక‌లు ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. గుజరాత్‌లోని కేవడియాలో (ఏక్తాన‌గ‌ర్‌లో) ఉన్న ఐక్య‌తా విగ్ర‌హాన్ని (Statue of Unity) ప్ర‌ధాని మోదీ (PM Modi) సంద‌ర్శించారు. అక్క‌డ పుష్పాంజ‌లి ఘ‌టించారు.

ఈ సంద‌ర్భంగా ప‌టేల్ విగ్ర‌హంపై హెలికాప్ట‌ర్‌తో పూల‌వ‌ర్షం కురిపించారు. ఈ వేడుకల్లో భాగంగా ప్రధాని మోదీ ఏక్తా నగర్‌లో సుమారు రూ. 400 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. ఇదిలా ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర హోంమంత్రి అమిత్ షా స‌ర్దార్ వ‌ల్ల‌భ్‌భాయ్ ప‌టేల్‌కు నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా రన్ ఫర్ యూనిటీ (Run for Unity) కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు. పటేల్ జయంతి అయిన అక్టోబర్ 31వ తేదీని 2014 నుంచి ప్రతి సంవత్సరం 'జాతీయ ఐక్యతా దినోత్సవం' (National Unity Day) గా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

Also Read..

టెక్స్‌టైల్స్ రంగానికి కేంద్రం భారీ ఊర‌ట‌.. ప‌త్తి దిగుమ‌తుల‌పై సుంకం మిన‌హాయింపు గ‌డువు పొడిగింపు

భార‌త్‌పై పాక్ గెలుపు.. ప్ర‌ధాని ష‌రీఫ్‌పై నెట్టింట ట్రోల్స్‌

పెట్టుబ‌డిదారుల‌కు అల‌ర్ట్‌.. ఒక్క రోజులోనే రూ.33వేలు త‌గ్గిన ప‌సిడి ధ‌ర‌..

ట్యాగ్స్:

Ekta DiwasEkta NagarGujaratNational Unity DayPm ModiSardar Vallabhbhai PatelStatue Of Unity
Advertisement
Advertisement