KTR | ఐడీబీఐ ప్రైవేటీకరణ.. అంత తొందర ఎందుకు?.. కేంద్ర ప్రభుత్వంపై కేటీఆర్ ఆగ్రహం
KTR | ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ రంగ బ్యాంకులు దేశానికి ఆస్తులని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. ఐడీబీఐ బ్యాంకు (IDBI Bank) ప్రైవేటీకరణ, తక్కువ విలువకే కట్టబెట్టేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
KTR | త్రినేత్ర న్యూస్: ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ రంగ బ్యాంకులు దేశానికి ఆస్తులని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. ఐడీబీఐ బ్యాంకు (IDBI Bank) ప్రైవేటీకరణ, తక్కువ విలువకే కట్టబెట్టేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ రంగ బ్యాంకులు దేశ సంపద. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. ఐడీబీఐ బ్యాంక్ విలువను తక్కువగా అంచనా వేస్తున్నారన్న వార్తలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. బిడ్లు రిజర్వ్ ధర కంటే తక్కువగా వచ్చినప్పుడు నిబంధనలు, వాల్యుయేషన్ విధానాలను ఎందుకు మార్చారు?
హైదరాబాద్‌లోని (Hyderabad) విలువైన భూములతో పాటు ఐడీబీఐకి ఉన్న కీలకమైన రియల్ ఎస్టేట్ ఆస్తుల విలువను పూర్తిస్థాయిలో లెక్కలోకి తీసుకున్నారా?. ఐడీబీఐ ఉద్యోగులు లేవనెత్తుతున్న అభ్యంతరాలు, ఆందోళనలను కేంద్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు?. ఒక ప్రతిష్ఠాత్మక ప్రభుత్వ రంగ బ్యాంకును ప్రైవేట్ సంస్థకు అప్పగించే ముందు కేంద్ర ప్రభుత్వం ప్రజలకు స్పష్టమైన సమాధానాలు చెప్పాలి. దేశ ప్రజల ఆస్తులైన ప్రభుత్వ రంగ సంస్థల విలువ, భవిష్యత్తు విషయంలో పారదర్శకతను ఎందుకు పాటించడం లేదు? బ్యాంక్ ప్రైవేటీకరణలో (Privatization) ఇంత తొందర ఎందుకు?’ అని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు.
PSUs and Public Sector Banks are national assets that need to be safeguarded
Reports about under valuation of IDBI bank are really concerning. Why were the rules and valuation methodology changed when bids fell below the reserve price?
IDBI also owns valuable real estate assets, including prime land in Hyderabad. Has their value been properly accounted for?
Why are the concerns raised by the IDBI employees not being addressed?
Before selling off a reputed public sector bank to a private player, the union government owes the country some straight answers
What’s the hurry ?
— KTR (@KTRBRS) October 31, 2026
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●CM Vijay | జైల్ బ్రేక్ ఘటన.. సీఎం విజయ్ కీలక నిర్ణయం
- ●Gold Price | భారీగా పతనమవుతున్న బంగారం, వెండి ధరలు.. ఇప్పుడు పెట్టుబడులు పెట్టవచ్చా..?
- ●PM Modi | ఏక్తా దివస్.. పటేల్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించిన ప్రధాని మోదీ
- ●Inter Exams | ఫిబ్రవరి 24 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు..!
- ●Gold And Silver Prices Today | పెట్టుబడిదారులకు అలర్ట్.. ఒక్క రోజులోనే రూ.33వేలు తగ్గిన పసిడి ధర..
- ●US Stock Markets | అమెరికా టెక్ మార్కెట్లలో 2.4 లక్షల కోట్ల డాలర్లు ఆవిరి.. ఏఐ పెట్టుబడులే కారణమా?

CM Vijay | జైల్ బ్రేక్ ఘటన.. సీఎం విజయ్ కీలక నిర్ణయం

Gold Price | భారీగా పతనమవుతున్న బంగారం, వెండి ధరలు.. ఇప్పుడు పెట్టుబడులు పెట్టవచ్చా..?

PM Modi | ఏక్తా దివస్.. పటేల్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించిన ప్రధాని మోదీ

Inter Exams | ఫిబ్రవరి 24 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు..!






