Mamata Banerjee | సంతకాల ఫోర్జరీ.. మమతా బెనర్జీ ఇంట్లో సీఐడీ సోదాలు
Mamata Banerjee | పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee)కి మరో షాక్ తగిలింది. ఎమ్మెల్యేల సంతకాల ఫోర్జరీ కేసుకు (Signature Scandal Probe) సంబంధించి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (CID) సర్చ్ వారెంట్‌తో దీదీ నివాసానికి వెళ్లింది.
Mamata Banerjee | పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee)కి మరో షాక్ తగిలింది. సంతకాల ఫోర్జరీ కేసుకు (Signature Scandal Probe) సంబంధించి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (CID) దీదీ నివాసానికి వెళ్లింది. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదా కోసం ఎమ్మెల్యేల సంతకాలు ఫోర్జరీ చేసినట్లు మమతా బెనర్జీపై ఆరోపణలు వచ్చాయి.
మే 6న టీఎంసీ అధిష్టానం సీనియర్ నేత శోభన్‌దేవ్ ఛటోపాధ్యాయ (Sobhandeb Chattopadhyay) పేరును ప్రతిపక్ష నేతగా, చీఫ్ విప్‌గా ప్రతిపాదిస్తూ స్పీకర్‌కు ఒక డాక్యుమెంట్ ఇచ్చింది. అయితే, అందులో తమ సంతకాలను ఫోర్జరీ చేశారని లేదా తమ ప్రమేయం లేకుండానే పెట్టారని పలువురు ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఇదే విషయాన్ని రిటబ్రత, సందీపన్ సాహా స్పీకర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో వివాదం ముదిరింది. ఈ ఆరోపణలపై సీఐడీ (CID) బృందం దర్యాప్తు చేస్తోంది.
దర్యాప్తులో భాగంగా సీఐడీ మూడు బృందాలుగా విడిపోయి సోదాలు చేపడుతోంది. ఓ బృందం సర్చ్ వారెంట్‌తో కోల్‌కతాలోని 30బీ హరీష్ చటర్జీ స్ట్రీట్‌లో ఉన్న మమతా బెనర్జీ నివాసానికి చేరుకొని సోదాలు చేస్తుండగా.. మరొక బృందం మమతా బెనర్జీ మేనల్లుడు, ఎంపీ అభిషేక్ బెనర్జీ కార్యాలయంలో తనిఖీలు చేస్తోంది. మూడో బృందం అభిషేక్ బెనర్జీ నివాసంలో సోదాలు నిర్వహిస్తోంది. అయితే, ప్రస్తుతం దీదీ ఢిల్లీలో ఉన్నారు. ఇక పార్టీలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో దీదీ కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీతో సమావేశం అయ్యారు. ప్రస్తుతం వీరి భేటీ కొనసాగుతోంది.
Also Read..
మరోసారి లోక్‌సభ ముందుకు డీలిమిటేషన్, మహిళా కోటా బిల్లు..?
ఐటీఆర్ ఫైల్ చేస్తే సరిపోదు.. ఈ కారణాలుంటే తప్పనిసరిగా ఆదాయపు పన్ను శాఖ పరిశీలిస్తుంది..
ప్రజా నమ్మకమే ఈ ప్రభుత్వ బలం : మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
సంబంధిత వార్తలు

Mamata Banerjee | ఆ ద్రోహులకు పార్టీలోకి నో ఎంట్రీ.. బీజేపీకి వ్యతిరేకంగా విపక్ష పార్టీలు ఏకంకావాలి : మమతా బెనర్జీ
జులై 21, 2026

Koel Mallick | దీదీకి షాక్.. రాజీనామా చేసిన మరో ఎంపీ
జులై 16, 2026

ED Freezes TMC Bank Accounts | తృణమూల్ కాంగ్రెస్‌కు ఈడీ బిగ్ షాక్.. రూ.440 కోట్ల ఖాతాలు ఫ్రీజ్, ఆ హెలికాప్టర్ కొనుగోళ్లే కొంపముంచాయా?
జులై 8, 2026
తాజావార్తలు
- ●Horoscope | ఆగస్టు 2 రాశి ఫలాలు.. ఈ రాశివారి కోరికలు నెరవేరుతాయి!
- ●CJI Justice Surya Kant | మధ్యవర్తిత్వం భారతీయ సంస్కృతిలో భాగమే : సీజేఐ జస్టిస్ సూర్యకాంత్
- ●Riddhi Kumar | సెల్ఫీ ఫొటోలు షేర్ చేసిన రాజాసాబ్ హీరోయిన్
- ●Telangana Rising-2047 | ‘తెలంగాణ రైజింగ్-2047’లో భాగస్వాములు కండి.. మంత్రి శ్రీధర్‌బాబు పిలుపు
- ●Mirnalini Ravi | ప్రియుడితో ఎంగేజ్మెంట్ చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్ - గర్ల్‌ఫ్రెండ్స్ డే రోజు గుడ్‌న్యూస్
- ●Tollywood | ఆగస్ట్ బరిలో స్టార్స్ - టాక్సిక్ తో పాటు ఈ నెలలో రిలీజ్ కానున్న సినిమాలు ఇవే

Horoscope | ఆగస్టు 2 రాశి ఫలాలు.. ఈ రాశివారి కోరికలు నెరవేరుతాయి!

CJI Justice Surya Kant | మధ్యవర్తిత్వం భారతీయ సంస్కృతిలో భాగమే : సీజేఐ జస్టిస్ సూర్యకాంత్

Riddhi Kumar | సెల్ఫీ ఫొటోలు షేర్ చేసిన రాజాసాబ్ హీరోయిన్

Telangana Rising-2047 | ‘తెలంగాణ రైజింగ్-2047’లో భాగస్వాములు కండి.. మంత్రి శ్రీధర్‌బాబు పిలుపు



