Mirnalini Ravi | ప్రియుడితో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్ – గర్ల్‌ఫ్రెండ్స్ డే రోజు గుడ్‌న్యూస్
ఇంటర్నేషనల్ గర్ల్‌ఫ్రెండ్స్ డే రోజు టాలీవుడ్ హీరోయిన్ మృణాళిని రవి గుడ్‌న్యూస్ వినిపించింది. ప్రియుడు మహావిష్ణుతో తన ఎంగేజ్‌మెంట్ జరిగినట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. వరుణ్ తేజ్ గద్దలకొండ గణేష్‌తో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది మృణాళిని రవి.
Entertainment | Published On Aug 1, 2026, 8.44 pm IST
Mirnalini Ravi | టాలీవుడ్ హీరోయిన్ మృణాళిని రవి పెళ్లిపీటలు ఎక్కబోతుంది. ప్రియుడు మహావిష్ణుతో మృణాళిని ఎంగేజ్‌మెంట్ శనివారం జరిగింది. ఈ గుడ్‌న్యూస్‌ను సోషల్ మీడియా ద్వారా మృణాళిని అభిమానులతో పంచుకుంది. ఇంటర్నేషనల్ గర్ల్‌ఫ్రెండ్స్ డే రోజు తమ జీవితంలో కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టబోతుండటం ఆనందంగా ఉందంటూ ఈ జంట పేర్కొన్నారు.
రొమాంటిక్ ఫొటోలు...
ప్రియుడితో దిగిన రొమాంటిక్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది మృణాలిని రవి. ఎంగేజ్‌మెంట్ జరిగినట్లుగా రింగ్ ఎమోజీని ఈ ఫొటోలకు జోడించింది. నిన్ను ఇష్టపడటం అంటే నన్ను నేను ప్రేమించుకోవడమే. ఎన్ని జన్మలెత్తినా నిన్నే నా జీవితభాగస్వామిగా ఎంచుకుంటాను అంటూ ఎమోషనల్‌గా పోస్ట్ పెట్టింది. ఆమె పోస్ట్ వైరల్ అవుతోంది. ఏడేళ్ల స్నేహం ఈ రోజుతో జీవితకాల బంధంగా మారబోతుంది అంటూ మహావిష్ణు కూడా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సేమ్ ఫొటోలను షేర్ చేశాడు. ఈ జంటకు అభిమానులు శుభాకాంక్షలు చెబుతోన్నారు. త్వరలోనే మృణాళిని, మహావిష్ణు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టబోతున్నట్లు చెబుతోన్నారు.మలేషియాకు చెందిన మహావిష్ణు అధ్మాత్మిక గురువు అని సమాచారం.
గద్దలకొండ గణేష్‌తో...
విజయ్ సేతుపతి, సమంత ప్రధాన పాత్రల్లో నటించిన సూపర్ డీలక్స్ మూవీతో మృణాళిని రవి యాక్టింగ్ జర్నీ మొదలైంది. గద్దలకొండ గణేష్‌తో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి అడుగులోనే పెద్ద హిట్టు అందుకుంది. ఆ తర్వాత ఆర్గానిక్ మామా హైబ్రీడ్ అల్లుడు, మామా మశ్చీంద్ర సినిమాల్లో కథానాయికగా కనిపించింది. తమిళంలో ఛాంపియన్, ఎనిమీ, కోబ్రాతో పాటు మరికొన్ని సినిమాలు చేసింది. 2024లో రిలీజైన రోమియా తర్వాత సినిమాలకు దూరమైంది మృణాళిని రవి.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Government Teachers | డుమ్మా కొడితే ఉద్యోగం ఊడినట్టే.. ఉపాధ్యాయులకు సర్కార్ వార్నింగ్
- ●Kondagattu | కొండగట్టు అంజన్న హుండీలో డమ్మీ నోట్ల కట్టలు
- ●NTPC | ఎన్టీపీసీలో డిప్యూటీ మేనేజర్ ఉద్యోగాలు.. నెలకు రూ.2 లక్షల జీతం..
- ●గోదావరి నీటిపై ఏపీ 'మాస్టర్ మైండ్'.. రేవంత్ సర్కార్ చావో రేవో!
- ●Horoscope | ఆగస్టు 13 రాశిఫలాలు.. ఈ రాశి వారు ధన సంపాదనకు కొత్త మార్గాలు అన్వేషిస్తారు!
- ●Senior Citizen Property Rights India | ఆస్తి తీసుకుని పేరెంట్స్‌ను గాలికి వదిలేసిన కొడుకు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు

Government Teachers | డుమ్మా కొడితే ఉద్యోగం ఊడినట్టే.. ఉపాధ్యాయులకు సర్కార్ వార్నింగ్

Kondagattu | కొండగట్టు అంజన్న హుండీలో డమ్మీ నోట్ల కట్టలు

NTPC | ఎన్టీపీసీలో డిప్యూటీ మేనేజర్ ఉద్యోగాలు.. నెలకు రూ.2 లక్షల జీతం..

గోదావరి నీటిపై ఏపీ 'మాస్టర్ మైండ్'.. రేవంత్ సర్కార్ చావో రేవో!






