Ponguleti | ప్రజా నమ్మకమే ఈ ప్రభుత్వ బలం : మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
Ponguleti | ప్రజా సంక్షేమమే పరమావధిగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. ప్రజల్లో ప్రభుత్వంపై పెరుగుతున్న నమ్మకం, విశ్వాసానికి పాలేరు నియోజకవర్గంలో నిర్వహించిన ‘ప్రజా దర్బార్’ విజయవంతం కావడమే నిదర్శనమని పేర్కొన్నారు. ఖమ్మంలోని ఎస్‌ఆర్ కన్వెన్షన్ హాల్లో మంగళవారం ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
Ponguleti | ప్రజా సంక్షేమమే పరమావధిగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. ప్రజల్లో ప్రభుత్వంపై పెరుగుతున్న నమ్మకం, విశ్వాసానికి పాలేరు నియోజకవర్గంలో నిర్వహించిన ‘ప్రజా దర్బార్’ విజయవంతం కావడమే నిదర్శనమని పేర్కొన్నారు. ఖమ్మంలోని ఎస్‌ఆర్ కన్వెన్షన్ హాల్లో మంగళవారం ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ప్రభుత్వం మూడో సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా చేపట్టిన 99 రోజుల ప్రత్యేక కార్యాచరణ జూలై 12 నాటికి పూర్తవుతుందని తెలిపారు.
25వేల మందిని వ్యక్తిగతంగా కలిశాం..
పాలేరు నియోజకవర్గాన్ని 14 క్లస్టర్లుగా విభజించి గత 25–30 రోజులుగా ‘ప్రజల వద్దకే ప్రభుత్వం’ అనే నినాదంతో ప్రజా దర్బార్ నిర్వహించినట్లు మంత్రి వివరించారు. సోమవారంతో చివరి దశ కార్యక్రమం ముగిసిందని తెలిపారు. ఈ కార్యక్రమాల ద్వారా సుమారు 25 వేల మందిని వ్యక్తిగతంగా కలుసుకుని వారి సమస్యలను ప్రత్యక్షంగా విన్నానని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రజా దర్బార్‌లో మొత్తం 24 వేలకుపైగా దరఖాస్తులు వచ్చాయని మంత్రి తెలిపారు. అందులో అత్యధికంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం 11 వేల అర్జీలు, ఆసరా పింఛన్ల కోసం 5,200 అర్జీలు వచ్చాయని చెప్పారు. గృహజ్యోతి పథకం దరఖాస్తులతో పాటు అంతర్గత రహదారులు, మురుగు కాలువలు, తాగునీటి సమస్యలపై కూడా పెద్ద ఎత్తున వినతులు వచ్చినట్లు వివరించారు.
సాదాబైనామాల సమస్యకు శాశ్వత పరిష్కారం
గత ప్రభుత్వం ధరణి చట్టం తీసుకురావడానికి ముందు సాదాబైనామాల అప్‌లోడ్‌కు అవకాశం ఇచ్చి, తరువాత చట్టంలో వాటిని చేర్చకపోవడంతో రైతులు ఇబ్బందులకు గురయ్యారని మంత్రి విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 9,26,000 సాదాబైనామా దరఖాస్తుల సమస్యను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని మంత్రివర్గం నిబంధనలను సవరించిందని తెలిపారు. ఇప్పటివరకు భూమి అమ్మిన వారి సమ్మతి తప్పనిసరి అన్న నిబంధన ఉండేదని, రైతుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఆ నిబంధనను తొలగించినట్లు చెప్పారు. ఇప్పటికే 5.5 లక్షల దరఖాస్తులకు నోటీసులు జారీ చేసినట్లు, మిగిలిన వాటికి మరో 15 రోజుల్లో నోటీసుల ప్రక్రియ పూర్తవుతుందని వెల్లడించారు. చట్టప్రకారం 30 రోజుల గడువు ముగిసిన వెంటనే అర్హులైన అన్ని సాదాబైనామా దరఖాస్తులను పరిష్కరిస్తామని స్పష్టం చేశారు.
సాగులో ఉన్న వారికే హక్కులు..
తరతరాలుగా భూమిని సాగు చేస్తున్నా పట్టా పుస్తకాలు లేని రైతుల కోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలో 70 రెవెన్యూ గ్రామాలను ఎంపిక చేసి ఆధునిక భూ సర్వే నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. పాలేరు నియోజకవర్గంలోని తిరుమలాయపాలెం (కాకరవాయి) గ్రామంలో ఈ సర్వే ఇప్పటికే విజయవంతంగా పూర్తయిందని చెప్పారు. సాగులో ఉన్నవారికే హక్కులు కల్పిస్తూ, వాస్తవానికి లేని పట్టాలను రద్దు చేసే విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ప్రజా దర్బార్‌లో వచ్చిన 4,300 భూ సమస్యల దరఖాస్తుల్లో సుమారు 2,300 కేసులను ప్రత్యేక కార్యాచరణ ద్వారా త్వరలో పరిష్కరించనున్నట్లు తెలిపారు. అలాగే ప్రభుత్వ అవసరాల కోసం భూమి సేకరణ జరిగితే మొత్తం సర్వే నంబర్‌ను నిషేధిత జాబితాలో పెట్టే పాత విధానాన్ని సవరించి, పట్టా భూములను ఆ జాబితా నుంచి తొలగించే ప్రక్రియ దాదాపు పూర్తయిందని చెప్పారు.
నిర్ణీత కాలంలో ఇళ్లు, ఇళ్ల స్థలాల సమస్య పరిష్కారం
ప్రజా దర్బార్‌లో వచ్చిన అర్జీలను పరిష్కరించేందుకు అధికార యంత్రాంగాన్ని విభజించి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కనీసం 45 రోజుల సమయం పడుతుందని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు అర్హులైన దరఖాస్తులను విడతల వారీగా మంజూరు చేస్తామని చెప్పారు. ఇళ్ల స్థలాల కోసం సుమారు 1,500 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సేకరించిన భూములను గుర్తించాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. నివాసయోగ్యమైన ప్రభుత్వ భూములను గుర్తించి రాబోయే రోజుల్లో ఇళ్ల స్థలాల సమస్యను కూడా పరిష్కరిస్తామని మంత్రి భరోసా ఇచ్చారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Guppedantha Manasu Sequel | రిషికి ఐ లవ్ యూ చెప్పిన వసుధార - గుప్పెడంత మనసు 2 పై అప్డేట్?
- ●Ponnam Prabhakar | సీఎం రేవంత్‌రెడ్డికి మంత్రి పొన్నం కృతజ్ఞతలు
- ●KTR | ప్రగతి భవన్లో 150 బెడ్రూమ్లు ఉన్నాయా..? : కేటీఆర్
- ●HMDA | మొక్కల పెంపకం ఒక ఉద్యమంగా మారాలి
- ●KTR | తెలంగాణలో వార్తను వార్తగా రాసే పరిస్థితి లేదు : కేటీఆర్
- ●RBI | బ్యాంక్ డిపాజిట్లపై ఆర్బీఐ కొత్త రూల్.. ఇక అన్ని బ్రాంచ్‌ల్లో ఒకే వడ్డీ..

Guppedantha Manasu Sequel | రిషికి ఐ లవ్ యూ చెప్పిన వసుధార - గుప్పెడంత మనసు 2 పై అప్డేట్?

Ponnam Prabhakar | సీఎం రేవంత్‌రెడ్డికి మంత్రి పొన్నం కృతజ్ఞతలు

KTR | ప్రగతి భవన్లో 150 బెడ్రూమ్లు ఉన్నాయా..? : కేటీఆర్

HMDA | మొక్కల పెంపకం ఒక ఉద్యమంగా మారాలి



