Tollywood | ఆగస్ట్ బరిలో స్టార్స్ – టాక్సిక్ తో పాటు ఈ నెలలో రిలీజ్ కానున్న సినిమాలు ఇవే
ఆగస్ట్ నెల టాలీవుడ్‌కు కీలకం కాబోతుంది. ఈ నెలలో పలువురు స్టార్ హీరోలు నటించిన పాన్ ఇండియన్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. సూర్య, యశ్ వంటి పరభాషా హీరోల సినిమాలతో తెలుగు స్టార్స్ ఎంత వరకు పోటీపడతారన్నది ఆసక్తికరంగా మారింది.
Entertainment | Published On Aug 1, 2026, 8.11 pm IST
Tollywood | జూలై నెల టాలీవుడ్‌కు అచ్చొచ్చింది. జూలై మొదటి వారంలో అఖిల్...చివరి వారంలో చెన్నై లవ్‌స్టోరీతో రెండు బ్లాక్‌బస్టర్స్ దక్కాయి. జూలైలో స్టార్ హీరోల సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాకపోవడంతో ఆడియెన్స్ డిసపాయింట్ అయ్యారు. మిడ్ రేంజ్, చిన్న సినిమాలే ఎక్కువగా రిలీజయ్యాయి. కానీ ఆగస్ట్‌లో మాత్రం పలువురు స్టార్ హీరోలు నటించిన భారీ బడ్జెట్ సినిమాలు బాక్సాఫీస్ బరిలో నిలవడం ఆసక్తికరంగా మారింది. ఈ పోటీలో ఎవరు విన్నర్‌గా నిలుస్తారన్నది టాలీవుడ్ వర్గాల్లో ఉత్కంఠను పంచుతోంది.
కొరియన్ కనకరాజు...
ఆగస్ట్ ఫస్ట్ వీక్‌లో మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన కొరియన్ కనకరాజు థియేటర్లలోకి రాబోతుంది. కమర్షియల్ హిట్టు కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్న వరుణ్‌తేజ్ ..ఈ సారి రూటు మార్చాడు. హారర్ కామెడీ కథతో ఈ సినిమా చేశాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రితికా నాయక్ హీరోయిన్‌గా నటించింది. ఈ వారం రిలీజ్ అవుతోన్న తెలుగు సినిమాల్లో కొరియన్ కనకరాజుపైనే ఎక్కువగా ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొన్నాయి. కొరియన్ కనకరాజుతో పాటు కేజీక్యూ, అనకాపల్లి సినిమాలు ఈ వీక్ థియేటర్లలో సందడి చేయబోతున్నాయి.
అగధ వర్సెస్ విశ్వనాథ్ అండ్ సన్స్
ఆగస్ట్ సెకండ్ వీక్‌లో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద డబ్బింగ్ సినిమాలు డామినేట్ చేయబోతున్నాయి. సీనియర్ డైరెక్టర్ ఎంఎస్ రాజు దర్శకత్వం వహిస్తూ నిర్మించిన అగధ మూవీ ఆగస్ట్ 14న రిలీజ్ అవుతోంది. అదే రోజు తమిళ డబ్బింగ్ సినిమాలు సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్‌తో పాటు నయనతార హాయ్ మూవీ కూడా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీకి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించాడు. మమితా బైజు హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు తెలుగులో రికార్డ్ స్థాయిలో థియేట్రికల్ బిజినెస్ జరిగింది. నయనతార హాయ్ మూవీలో కెవిన్ హీరోగా నటించాడు. ఈ రెండు సినిమాలు ఏజ్ గ్యాప్ లవ్‌స్టోరీ కాన్సెప్ట్‌తోనే రూపొందడం గమనార్హం.
రవితేజ ఇరుముడి...
ఆగస్ట్‌లోనే ఇరుముడితో తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నాడు మాస్ మహారాజా రవితేజ. శివ నిర్వాణ దర్శకత్వంలో ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ మూవీ ఆగస్ట్ 21న రిలీజ్ అవుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇరుముడికి ఒక రోజు ముందు దుల్కర్ ఆగస్ట్ 20న దుల్కర్ సల్మాన్ మలయాళ డబ్బింగ్ మూవీ ఐ యామ్ గేమ్ తెలుగు ఆడియెన్స్ ముందుకు వస్తోంది. అమీర్‌లోగ్ అనే చిన్న సినిమా కూడా ఇదే వారం థియేటర్లలోకి రాబోతుంది.
సోలోగా బరిలో...
ఆగస్ట్‌లో రిలీజ్ అవుతోన్న సినిమాల్లో యశ్ టాక్సిక్ కోసమే ఫ్యాన్స్ ఎక్కువగా ఎదురుచూస్తున్నారు. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ మూవీపై పాన్ ఇండియన్ వైడ్‌గా ఓ రేంజ్‌లో హైప్, బజ్ నెలకొన్నాయి. కేజీఎఫ్ తర్వాత యశ్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాలో నయనతార, రుక్మిణి వసంత్, తారా సుతారియా, కియారా అద్వానీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఆగస్ట్ 26న సోలోగా మూవీ థియేటర్లలోకి రాబోతుంది. కన్నడ డబ్బింగ్ మూవీ అయినా తెలుగులో స్ట్రెయిట్ సినిమా స్థాయిలో టాక్సిక్ ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Janhvi Kapoor | అలా అయితే గుహలో ఉండాల్సి వస్తుంది..! జాన్వీ కపూర్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
ఆగస్టు 11, 2026

Vishnu Priya | హీరోయిన్‌గా విష్ణుప్రియ – ఇంద్ర లోకం నుంచి వచ్చిన ఊర్వశిగా…
ఆగస్టు 11, 2026

Tollywood | సీనియర్ సినీ నటుడు కృష్ణేశ్వరరావు కన్నుమూత – సూపర్ హిట్ సినిమాలకు రచయితగా!
ఆగస్టు 11, 2026
తాజావార్తలు
- ●Bank Account | కేవైసీ చేయకపోతే బ్యాంక్ అకౌంట్ క్లోజ్ అవుతుందా..? సోషల్ మీడియా ప్రచారంలో నిజమెంత..?
- ●Harish Rao | రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ నిలదీస్తే గానీ సోయి రాదా..?
- ●Amit Shah | చర్చకు నేను సిద్ధం.. విపక్షాలకు అమిత్ షా సవాల్
- ●KTR | ‘ఏఐ హబ్-స్విట్జర్లాండ్’ వచ్చేసింది.. ఇక సమాచార లోడ్‌ను నియంత్రించొచ్చు
- ●SpaceXAI | స్పేస్ఎక్స్ఏఐ నుంచి గ్రోక్ బాట్.. ఇక పనులన్నింటినీ ఏఐ ఏజెంట్లే చేస్తాయి..
- ●Post Office RD | రోజుకు రూ.300తో పోస్టాఫీస్ ద్వారా రూ.15 లక్షలు.. ఇలా చేస్తే సాధ్యం..

Bank Account | కేవైసీ చేయకపోతే బ్యాంక్ అకౌంట్ క్లోజ్ అవుతుందా..? సోషల్ మీడియా ప్రచారంలో నిజమెంత..?

Harish Rao | రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ నిలదీస్తే గానీ సోయి రాదా..?

Amit Shah | చర్చకు నేను సిద్ధం.. విపక్షాలకు అమిత్ షా సవాల్

KTR | ‘ఏఐ హబ్-స్విట్జర్లాండ్’ వచ్చేసింది.. ఇక సమాచార లోడ్‌ను నియంత్రించొచ్చు



