Vedanta Oil and Gas | వేదాంత ఆయిల్ అండ్ గ్యాస్‌కు భారీ లాభాలు.. ఆదాయంలో 7 శాతం వృద్ధి..
Vedanta Oil and Gas | వేదాంత ఆయిల్ అండ్ గ్యాస్ లిమిటెడ్ గత సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో మెరుగైన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. కంపెనీ ఆదాయం 7 శాతం పెరగగా, ఈబీఐటీడీఏ ఏకంగా 34 శాతం వృద్ధి చెందింది. మరోవైపు రాజస్థాన్‌లో మూడు కొత్త చమురు, సహజ వాయువు నిక్షేపాలను గుర్తించడంతోపాటు కృష్ణా-గోదావరి బేసిన్‌లో రెండు సముద్ర తీర చమురు అన్వేషణ బ్లాకులను దక్కించుకుంది.
Vedanta Oil and Gas | వేదాంత ఆయిల్ అండ్ గ్యాస్ లిమిటెడ్ గత సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో మెరుగైన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. కంపెనీ ఆదాయం 7 శాతం పెరగగా, ఈబీఐటీడీఏ ఏకంగా 34 శాతం వృద్ధి చెందింది. మరోవైపు రాజస్థాన్‌లో మూడు కొత్త చమురు, సహజ వాయువు నిక్షేపాలను గుర్తించడంతోపాటు కృష్ణా-గోదావరి బేసిన్‌లో రెండు సముద్ర తీర చమురు అన్వేషణ బ్లాకులను దక్కించుకుంది.
34 శాతం వృద్ధి రేటు..
వేదాంత సంస్థ రెండో త్రైమాసికంలో పటిష్టమైన ఆర్థిక పనితీరును నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే కంపెనీ ఆదాయం 7 శాతం పెరిగి రూ.2,486 కోట్లకు చేరుకుంది. ఈబీఐటీడీఏ 34 శాతం వృద్ధితో రూ.1,393 కోట్లకు పెరిగింది. చమురు ధరల ద్వారా మెరుగైన ఆదాయాలు, వ్యయ నియంత్రణ చర్యలు ఈ వృద్ధికి దోహదపడ్డాయి. 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో కంపెనీ మొత్తం ఆదాయం రూ.4,993 కోట్లుగా నమోదైంది. రాజస్థాన్, రావ్వా ప్రాంతాల్లోని పాత చమురు క్షేత్రాల్లో ఉత్పత్తిని మెరుగుపరిచేందుకు బావుల నిర్వహణ, కృత్రిమ లిఫ్ట్ వ్యవస్థల సామర్థ్యాన్ని పెంచే కార్యక్రమాలను కొనసాగిస్తోంది. రెండో త్రైమాసికంలో రోజువారీ స్థూల ఉత్పత్తి 72.2 వేల బ్యారెళ్ల చమురు సమానంగా ఉండగా, కంపెనీ వాటా ప్రకారం ఉత్పత్తి 47.8 వేల బ్యారెళ్లుగా నమోదైంది. త్రైమాసికంలో మొత్తం స్థూల చమురు, సహజ వాయువు ఉత్పత్తి 66 లక్షల బ్యారెళ్ల చమురు సమానంగా, కంపెనీ వాటా ఉత్పత్తి 44 లక్షల బ్యారెళ్లుగా ఉంది.
అన్వేషణ, అభివృద్ధి ప్రాజెక్టులతో ముందుకు..
భవిష్యత్ వృద్ధిని లక్ష్యంగా చేసుకుని కంపెనీ పలు అన్వేషణ, అభివృద్ధి ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్తోంది. ఇందులో భాగంగా భారత తూర్పు తీరంలో లోతైన సముద్ర ప్రాంతాల్లో చమురు, సహజ వాయువు అన్వేషణ, ఉత్తర రాజస్థాన్‌లో ఏఎస్పీ ఇంజెక్షన్ పూర్తి స్థాయి అమలు, ఈశాన్య రాష్ట్రాల్లో కొత్త అన్వేషణ కార్యక్రమాలను చేపట్టనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో రాజస్థాన్ బ్లాక్‌లో మూడు కొత్త నిక్షేపాలను గుర్తించింది. కామేశ్వరి, సరస్వతి, రాగేశ్వరి క్షేత్రాల్లో గతంలో అన్వేషించని భూగర్భ పొరల్లో లోతైన సహజ వాయువు, తక్కువ లోతులో చమురు నిల్వలను గుర్తించింది. వీటి వాణిజ్యపరమైన సామర్థ్యం, ఆర్థిక సాధ్యాసాధ్యాలపై ప్రస్తుతం పరిశీలన జరుగుతోంది. మరోవైపు, డిస్కవర్డ్ స్మాల్ ఫీల్డ్ (డీఎస్ఎఫ్) నాలుగో విడత బిడ్డింగ్‌లో కృష్ణా-గోదావరి బేసిన్‌లో రెండు సముద్ర తీర బ్లాకులను కంపెనీ దక్కించుకుంది. కేజీ/ఓఎస్‌డీఎస్‌ఎఫ్/జీ1/2025 పేరుతో ఒక నిస్సార సముద్ర బ్లాక్, కేజీ/డీడబ్ల్యూఎస్‌డీఎస్‌ఎఫ్/జీడీ10/2025 పేరుతో ఒక లోతైన సముద్ర బ్లాక్‌ను కేటాయించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, సమర్థవంతమైన ప్రాజెక్టుల అమలు ద్వారా దేశీయ చమురు, సహజ వాయువు వనరులను వెలికితీయడం, సముద్ర తీర అన్వేషణ కార్యకలాపాలను విస్తరించడం కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Nayanthara | మనసు మార్చుకున్న నయన్ - మాజీ ప్రియుడితో సినిమా...
- ●Woman Suicide | కోకాపేటలో విషాదం.. 23వ అంతస్తు నుంచి దూకి యువతి ఆత్మహత్య
- ●Yamuna River | యమునా నదిలో మునకేసి గుటకేసిన బీజేపీ ఎంపీ
- ●Viral Video | పెనుగాలులు.. భారీ వర్షం.. అయినా ఆగని పూరీ జగన్నాథుడి సేవ!
- ●Amit Shah | మూడోసారి అధికారంలోకి వస్తే యూసీసీ
- ●PM Modi | నా చివరి శ్వాస వరకు ప్రజలకు సేవ చేస్తూనే ఉంటాను : ప్రధాని మోదీ

Nayanthara | మనసు మార్చుకున్న నయన్ - మాజీ ప్రియుడితో సినిమా...

Woman Suicide | కోకాపేటలో విషాదం.. 23వ అంతస్తు నుంచి దూకి యువతి ఆత్మహత్య

Yamuna River | యమునా నదిలో మునకేసి గుటకేసిన బీజేపీ ఎంపీ

Viral Video | పెనుగాలులు.. భారీ వర్షం.. అయినా ఆగని పూరీ జగన్నాథుడి సేవ!



