త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nayanthara | మ‌న‌సు మార్చుకున్న న‌య‌న్ – మాజీ ప్రియుడితో సినిమా…

ప‌దేళ్ల లాంగ్ గ్యాప్ త‌ర్వాత శింబు న‌య‌న‌తార కాంబినేష‌న్‌లో ఓ సినిమా రాబోతున్న‌ట్లు కోలీవుడ్ వ‌ర్గాల్లో రూమ‌ర్లు వినిపిస్తున్నాయి. శింబుతో గ‌తంలో వ‌ల్ల‌భ‌, ఇదు న‌మ్మ ఆలు సినిమాలు చేసింది న‌య‌న‌తార‌. వ‌ల్ల‌భ షూటింగ్‌లోనే ఇద్ద‌రు ప్రేమ‌లో ప‌డ్డారు. కానీ మ‌న‌స్ప‌ర్థ‌ల కార‌ణంగా విడిపోయారు. విభేదాల కార‌ణంగా ఇన్నాళ్లు శింబుతో సినిమాలు చేయ‌ని న‌య‌న్ ఇప్పుడు స‌డెన్‌గా మ‌న‌సు మార్చుకోవ‌డం కోలీవుడ్ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌రంగా మారింది.

N

Entertainment | Published On Oct 30, 2026, 3.14 pm IST

Nayanthara | మ‌న‌సు మార్చుకున్న న‌య‌న్ – మాజీ ప్రియుడితో సినిమా…
Advertisement

Nayanthara |విభేదాల‌ను ప‌క్క‌న‌పెట్టి కోలీవుడ్ హీరో శింబుతో (Simbu) న‌య‌న‌తార (Nayanthara)ఓ సినిమా చేయ‌బోతుందా? ప‌దేళ్ల త‌ర్వాత ఈ జోడీ మ‌రోసారి సిల్వ‌ర్‌స్క్రీన్‌పై క‌నిపించ‌నుందా? అంటే ఔన‌నే కోలీవుడ్ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. కెరీర్ ఆరంభంలో శింబుతో వ‌ల్ల‌భ సినిమా చేసింది న‌య‌న‌తార‌. ఈ సినిమా షూటింగ్‌లోనే ఇద్ద‌రు ప్రేమ‌లో ప‌డ్డారు. కానీ ఏడాది కూడా కాక‌ముందే మ‌న‌స్ప‌ర్థ‌ల కార‌ణంగా శింబుతో ల‌వ్‌స్టోరీకి న‌య‌న్ బ్రేక‌ప్ చెప్పింది. భ‌విష్య‌త్తులో ఈ కోలీవుడ్ హీరోతో క‌లిసి సినిమా చేసేది లేద‌ని ప్ర‌క‌టించింది.

ఇదు న‌మ్మ ఆలు...

చాలా ఏళ్ల త‌ర్వాత మ‌న‌సు మార్చుకున్న లేడీ సూప‌ర్ స్టార్...మాజీ ప్రియుడు శింబుతో క‌లిసి ఇదు న‌మ్మ ఆలు అనే సినిమాలో న‌టించింది. కానీ ఇద్ద‌రి మ‌ధ్య ఉన్న గొడ‌వ‌ల ప్ర‌భావం షూటింగ్‌పై ప‌డ‌టం, నిర్మాణ ప‌ర‌మైన స‌మ‌స్య‌ల వ‌ల్ల అతి క‌ష్టంగా థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన ఈ త‌మిళ మూవీ డిజాస్ట‌ర్‌గా నిలిచింది. త‌న పెళ్లి డాక్యుమెంట‌రీలో శింబు పేరు ప్ర‌స్తావించ‌కుండా అత‌డిపై విమ‌ర్శ‌లు గుప్పించింది ఈ కోలీవుడ్ బ్యూటీ. ఇదు న‌మ్మ ఆలు త‌ర్వాత శింబు కెరీర్ డౌన్ అవుతూ వ‌చ్చింది. మ‌రోవైపు న‌య‌న్ ద‌క్షిణాదిలో టాప్ స్టార్‌గా మారిపోయింది.

ప‌దేళ్ల త‌ర్వాత‌...

దాదాపు ప‌దేళ్ల లాంగ్ గ్యాప్ త‌ర్వాత మ‌ళ్లీ న‌య‌న‌తార‌, శింబు కాంబినేష‌న్‌లో ఓ సినిమా రానున్న‌ట్లు త‌మిళ‌నాట టాక్ న‌డుస్తోంది. క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో పోలీస్ ఆఫీస‌ర్‌గా శింబు, అత‌డి ప్రేయ‌సిగా న‌య‌న‌తార క‌నిపించ‌నున్న‌ట్లు చెబుతున్నారు.
డ్యూడ్ ఫేమ్ కీర్తిశ్వ‌ర‌న్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోతున్నాడు. డైరెక్ట‌ర్‌ చెప్పిన క‌థ న‌చ్చ‌దంతో శింబుతో ఉన్న విభేదాల‌తో సంబంధం లేకుండా ఈ సినిమాలో న‌టించ‌డానికి న‌య‌న‌తార అంగీక‌రించిన‌ట్లు స‌మాచారం. ఇందులో శింబు, న‌య‌న్ కెమిస్ట్రీ కొత్త‌గా ఉంటుంద‌ని అంటున్నారు.

కోలీవుడ్ వ‌ర్గాల్లో...

ప‌దేళ్ల త‌ర్వాత మాజీ ప్రేమికులు క‌లిసి సినిమా చేయ‌బోతుండ‌టం కోలీవుడ్ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌రంగా మారింది. వ‌చ్చే ఏడాది వేస‌విలో ఈ సినిమా సెట్స్‌పైకి రాబోతుంది.
ప్ర‌స్తుతం న‌య‌న‌తార హిందీలో స‌ల్మాన్ ఖాన్‌తో (Salman Khan) ఓ సినిమా చేస్తోంది. వంశీపైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాను దిల్‌రాజు నిర్మిస్తున్నారు. న‌య‌న్ హీరోయిన్‌గా న‌టించిన త‌మిళ మూవీ మూక్కుత్తి అమ్మ‌న్ దీపావ‌ళి సంద‌ర్భంగా న‌వంబ‌ర్ 6న థియేట‌ర్ల‌లోకి రాబోతుంది. ఈ మైథాల‌జీ మూవీలో అమ్మ‌వారిగా, పోలీస్ ఆఫీస‌ర్‌గా ఈ లేడీ సూప‌ర్ స్టార్ క‌నిపించ‌బోతుంది.

 

ట్యాగ్స్:

Director KeerthiswaranIdhu Namma AaluKollywoodNayantharaNayanthara MoviesSimbuSimbu MoviesTamil CinemaTamil Movie NewsVallabha Movie
Advertisement
Advertisement