త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Viral Video | పెనుగాలులు.. భారీ వర్షం.. అయినా ఆగని పూరీ జగన్నాథుడి సేవ!

Viral Video | ప్రకృతి ప్రకోపించినా.. ఈదురుగాలులు బీభత్సం సృష్టించినా.. భారీ వ‌ర్షాలు కురుస్తున్నా ఆ సంప్రదాయానికి మాత్రం ఆటంకం కలగలేదు. ఒడిశా ప్రముఖ పుణ్యక్షేత్రం పూరీ జగన్నాథ ఆలయంలో మరోసారి అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. తుపాను ప్రభావంతో భారీ వర్షాలు, బలమైన గాలులు వీస్తున్నా.. ఆలయ శిఖరంపై పవిత్ర పతాకాన్ని మార్చే శతాబ్దాల నాటి సంప్రదాయం యథావిధిగా కొనసాగింది.

P

Devotional | Published On Oct 30, 2026, 3.07 pm IST

Viral Video | పెనుగాలులు.. భారీ వర్షం.. అయినా ఆగని పూరీ జగన్నాథుడి సేవ!
Advertisement

Viral Video | ప్రకృతి ప్రకోపించినా.. ఈదురుగాలులు బీభత్సం సృష్టించినా.. భారీ వ‌ర్షాలు కురుస్తున్నా ఆ సంప్రదాయానికి మాత్రం ఆటంకం కలగలేదు. ఒడిశా ప్రముఖ పుణ్యక్షేత్రం పూరీ జగన్నాథ ఆలయంలో మరోసారి అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. తుపాను ప్రభావంతో భారీ వర్షాలు, బలమైన గాలులు వీస్తున్నా.. ఆలయ శిఖరంపై పవిత్ర పతాకాన్ని మార్చే శతాబ్దాల నాటి సంప్రదాయం యథావిధిగా కొనసాగింది. ఈ దృశ్యం భక్తులను ఆశ్చర్యానికి గురిచేసింది.

214 అడుగుల ఎత్తులో..

ఒడిశాలో తుపాను ప్రభావంతో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పూరీలోనూ వాతావరణం ప్రతికూలంగా మారింది. అయినప్పటికీ జగన్నాథ ఆలయ శిఖరంపై ఉన్న నీలచక్రం వద్ద పతితపావన పతాకాన్ని మార్చే కార్యక్రమాన్ని చునారా సేవాయత్‌ పూర్తి చేశారు. సుమారు 214 అడుగుల ఎత్తుకు చేరుకుని బలమైన గాలుల మధ్యే జెండాను మార్చారు. ప్రతికూల వాతావరణంలోనూ సంప్రదాయాన్ని కొనసాగించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పూరీ జగన్నాథ ఆలయంలో ప్రతిరోజూ పతాకాన్ని మార్చడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఆలయ శిఖరంపై నీలచక్రం సమీపంలో ఎగురవేసే ఈ జెండాను పతితపావన ధ్వజం, పతితపావన బాణా అని పిలుస్తారు. సూర్యాస్తమయానికి ముందే చునారా సేవాయత్‌లు శిఖరంపైకి చేరుకుని పతాకాన్ని మారుస్తారు. వాతావరణ పరిస్థితులతో సంబంధం లేకుండా ఈ ఆచారాన్ని కొనసాగించడం విశేషం.

భ‌క్తుల‌ను ఆక‌ర్షించిన రూపం..

పతాక మార్పు సమయంలో గాలుల ప్రభావంతో జెండాపై ముడి ఆకారంలో ఓ రూపం కనిపించడం భక్తుల దృష్టిని ఆకర్షించింది. దీన్ని కొందరు భక్తులు శూన్య గ్రంథి లేదంటే బ్రహ్మ గ్రంథిగా పేర్కొంటూ శుభసూచకంగా భావిస్తున్నారు. ఈ ఘటన మరోసారి జగన్నాథుడిపై భక్తులకున్న విశ్వాసాన్ని, ఆలయ విశిష్ట సంప్రదాయాల ప్రాధాన్యతను చాటిచెప్పింది.

 

View this post on Instagram

 

ట్యాగ్స్:

Cyclone ArnabJagannath TempleJagannath Temple FlagOdishaTelugu NewsViral Video
Advertisement
Advertisement