Xi Jinping | భారత పర్యటనకు చైనా అధ్యక్షుడు.. గల్వాన్ ఘర్షణ తర్వాత తొలిసారి
Xi Jinping | చైనా అధ్యక్షుడు (Chinese President) షీ జిన్‌పింగ్ (Xi Jinping) భారత పర్యటనకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో న్యూఢిల్లీ వేదికగా జరిగే బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు (BRICS Summit)లో జిన్‌పింగ్ పాల్గొననున్నట్లు సమాచారం.
Xi Jinping | త్రినేత్ర.న్యూస్ : చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ (Xi Jinping) భారత పర్యటనకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో న్యూఢిల్లీ వేదికగా జరిగే బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో (BRICS Summit) జిన్‌పింగ్ పాల్గొననున్నట్లు సమాచారం. 2020 గల్వాన్ ఘర్షణ తర్వాత (Galwan standoff) ఆయన భారత పర్యటనకు రావడం ఇదే మొదటిసారి కానుంది. జిన్‌పింగ్ పర్యటన తేదీలు ఇంకా ఖరారు కాలేదు. ఆయన పర్యటనకు ముందు న్యూఢిల్లీ, బీజింగ్ మధ్య దౌత్యపరమైన చర్చలు మరింత ముమ్మరం చేసే అవకాశం ఉంది. ఇందుకోసం జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఉన్నత స్థాయి చర్చల కోసం చైనా వెళ్లే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
కాగా, 2013 నుంచి చైనా అధ్యక్షుడిగా ఉన్న జిన్‌పింగ్ ఇప్పటి వరకూ మూడుసార్లు భారత పర్యటనకు వచ్చారు. అక్టోబర్ 2019లో ఆయన చివరిసారిగా భారతదేశాన్ని సందర్శించారు. ఆ తర్వాతి ఏడాది అంటే 2020 లఢఖ్ సరిహద్దుల్లో భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణ అనంతరం ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. 2024 అక్టోబర్‌లో జరిగిన బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోదీ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో సమావేశమయ్యాక ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో పురోగతి కనిపించింది. ఈ సమావేశంలో నేరుగా విమాన సర్వీసులు, కైలాస్ మానసరోవర్ యాత్రను పునరుద్ధరించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి.
గల్వాన్ ఘర్షణల తర్వాత గతేడాది ప్రధాని మోదీ తొలిసారి చైనాలో పర్యటించారు. ఆగస్టు 31, సెప్టెంబర్ 1 మధ్య తియాంజిన్ వేదికగా జరిగిన సాంఘై సహకార సదస్సులో పాల్గొన్నారు. ఈ పర్యటన సందర్భంగా జిన్‌పింగ్‌తో (Xi Jinping) మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సహా 20 మందికిపైగా ప్రపంచ నాయకులకు ఈ సమ్మిట్‌లో పాల్గొన్నారు. సదస్సు సందర్భంగా మోదీతోపాటు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ రెడ్‌కార్పెట్ వేసి ఆహ్వానించడం విశేషం.
Also Read..
మా నాన్న యూనిఫామ్ రక్తంతో తడిసిపోయింది.. మాకూ న్యాయం చేయండి
బెదిరింపులతో జెన్ జీ నోరు నొక్కేయలేరు.. మోదీ, షాపై రాహుల్ విమర్శలు
సంబంధిత వార్తలు

Border Trade | టిబెట్‌లో భారీగా హిమపాతం.. భారత్-చైనా సరిహద్దుల్లో నిలిచిన వాణిజ్యం
సెప్టెంబర్ 27, 2026

Trump Xi Jinping Summit US China | ట్రంప్ – జిన్‌పింగ్ మెగా సమ్మిట్: ఏఐ, ట్రేడ్, మిడిల్ ఈస్ట్ యుద్ధంపై ప్రపంచం దృష్టి
సెప్టెంబర్ 24, 2026

PM Modi | సేవే ప్రధాన లక్ష్యం కావాలి : ప్రధాని మోదీ
సెప్టెంబర్ 24, 2026
తాజావార్తలు
- ●Ponguleti Srinivas Reddy | ప్రజల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
- ●KCR | కొండా లక్ష్మణ్ ఆశయాలను ఆచరిస్తేనే వారికి నిజమైన నివాళి: కేసీఆర్
- ●Vemula Prashanth Reddy | కొండా లక్ష్మణ్ బాపూజీని స్మరించుకోకపోతే తెలంగాణను అవమానించినట్లే: మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
- ●LPU Punjab | విద్యార్థినిపై అత్యాచార పుకార్లు.. రణరంగంగా ఎల్పీయూ క్యాంపస్
- ●ULC | అర్బన్ ల్యాండ్ సీలింగ్ దరఖాస్తులకు మోక్షం.. ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం
- ●Priyadarshi | కృతజ్ఞుడిని రామన్న.. నా సినిమాల పట్ల సూపెట్టిన ప్రేమకు హృదయపూర్వక ధన్యవాదాలు : ప్రియదర్శి

Ponguleti Srinivas Reddy | ప్రజల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

KCR | కొండా లక్ష్మణ్ ఆశయాలను ఆచరిస్తేనే వారికి నిజమైన నివాళి: కేసీఆర్

Vemula Prashanth Reddy | కొండా లక్ష్మణ్ బాపూజీని స్మరించుకోకపోతే తెలంగాణను అవమానించినట్లే: మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

LPU Punjab | విద్యార్థినిపై అత్యాచార పుకార్లు.. రణరంగంగా ఎల్పీయూ క్యాంపస్



